నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు
రొద్దం హనుమంతరావు (ఫిబ్రవరి 23, 1906 – 1986) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది, శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి స్థాపకుడు.[1
జననం
హనుమంతరావు 1906, ఫిబ్రవరి 23న అనంతపురం జిల్లా, పెనుగొండ లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు వెంకోబరావు. ఈయన పినతండ్రి రొద్దం రంగారావు, సోదరుడు రొద్దం రాజారావులు ప్రముఖ నటులు. ఈయన కుమారుడు రొద్దం ప్రభాకరరావు ఐ.పి.ఎస్. అధికారి. వారు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రిటైర్ అయ్యారు.
రంగస్థల ప్రస్థానం
హనుమంతరావు తన 13వ ఏట అనంతపురం కళశాలలో విజయనగర పతనం నాటకంలోని విరుమలాంబగా నటించి రంగస్థలంపై అడుగుపెట్టాడు. పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి, అనంతపురంలో అలిత కళాపోషణ సమితిని స్థాపించాడు. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహరావు, ఈలపాట రఘురామయ్య తదితర ప్రముఖ నటులతో కలిసి నటించాడు.
నటించిన నాటకాలు – పాత్రలు
· విజయనగర పతనం – విరుమలాంబ
· సావిత్రి – సావిత్రి
· పాదుకా పట్టాభిషేకం – కైకేయి
· ప్రమీలార్జునీయం – ప్రమీల
· శ్రీకృష్ణదేవరాయ విజయం – అన్నపూర్ణ
· ఉత్తర గోగ్రహణం – ఊర్వశి, ఉత్తర కుమారుడు
· నటచరిత్ర – బాహుకుడు
· రాణీ సంయుక్త – అహుళ రాయుడు
మరణం
హనుమంతరావు 1986లో హైదరాబాద్లో మరణించాడు.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-22-ఉయ్యూరు