మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10
· 31-బళ్ళారి రాఘవ మేనమామ ,నాటక రచయితా ,రామ కబీరు ,కంసధ్వంస నాటక ఫేం –శ్రీ ధర్మ వరం గోపాలాచార్యులు
· , ధర్మవరం గోపాలాచార్యులు నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తమ్మడు. వీళ్ళిద్దరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు.
నాటకరంగ ప్రస్థానం
కన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు ఒక తెలుగు నాటకం రాసి మొదట ప్రదర్శించాడు. కానీ అది సరిగా ప్రదర్శన కాలేదు. దాంతో తెలుగు భాష నాటక రచనకు పనికిరాదన్న భావనకు దారితీసింది. అప్పుడు రామకృష్ణమాచార్యులు స్వయంగా నాటక రచన, ప్రదర్శనలను ప్రారంభించి ప్రప్రథమంగా చిత్రనళీయము నాటకం రాసి 1887 జనవరి 29 తేదీన విజయవంతంగా ప్రదర్శించాడు. తర్వాత చాలా నాటకాలను రచించి, స్వయంగా ప్రదర్శించాడు. గోపాలాచార్యులు తన అన్నతో కలిసి నాటకాలలో భరతుడు మొదలైన పాత్రలను పోషించాడు.
తర్వాత హైద్రాబాదులో వకీలు వృత్తిని నిర్వర్తించాడు. హైదరాబాదులో “కృష్ణ విలాసినీ సభ” అనే నాటక సంస్థను స్థాపించి, హరిశ్చంద్ర నాటకంను స్వయముగా రచించి ప్రదర్శింపజేశాడు. అక్కడినుండి 1910లో బళ్ళారికి తిరిగి వచ్చి 1912లో అన్న ధర్మవరం రామకృష్ణమాచార్యులతో కలిసి, ‘అభినవ సరస వినోదిని’ స్థాపించాడు. 1912, నవంబరు 30న రామకృష్ణమాచార్యులు మరణంతో అది ఆగిపోయిన తర్వాత ‘కృష్ణమాచార్య సభ’ అనే పేరుతో ఒక సమాజంను నడిపి, దేశమంతా తిరిగి ప్రదర్శనలు చేశాడు. ఈ సమాజానికి గోపాలాచార్యులు ఉపాధ్యక్షులుగా ఉన్నాడు. బళ్ళారి తిరిగివచ్చిన తరువాత ఇతను మరికొన్ని నాటకాలను రచించాడు.
రచనలు
ఈయన మొత్తము 12 నాటకములును రచించాడు.
- రామదాసు
- సుభద్రార్జునీయము
- రామకబీరు
- ప్రేమచంద్రయోగి లేదా అస్పృశ్య విజయము (1933)
- చంద్రమతీపరిణయము
- రుక్మిణీకృష్ణీయము లేదా మాయాశక్తి
- శ్రీరామ లీలలు
- గిరిజా శంకరీయము
- పాండవాజ్ఞాతవాసం
- ఉత్తర రామచరిత (కన్నడ) (1889)
- కంసధ్వంసము
- కెయిసర్
ఇతర వివరాలు
మేనల్లుడు బళ్ళారి రాఘవాచార్యులు ప్రతి నాటకపు ప్రతిని పరిశీలించి మార్పులు, చేర్పులు సూచించేవాడు. దాని ప్రకారమే వీళ్ళిద్దరు సరిదిద్దుకునేవారు. అలా ‘రామదాసు’, ‘సుభద్రార్జునియము’ ‘రాం కబీర్’ వంటి నాటకాలు రూపొందించారు. వీరు మొత్తం 13 నాటకాలు రాశారు. అందులో ప్రకటిత మైనవి –పై ముడున్నూ, ప్రేమచంద్రవిజయం’ లేదా ‘అస్ప్రస్యవిజయము’ ‘రుక్మిణీకృష్నియము’ లేదా ‘మాయాశక్తి’. ఇంకను అముద్రిత నాటకాలు; ‘ శ్రీరామ లిలలు’ గిరిజా శంకరియము, పాండజ్ఞాత్వాసం, ఉత్తర రామచరితము, హరిశ్చంద్ర, కేయిసర్ లేదా కలియుగ దుర్యోధన, ఉషాపరినయము, కంసద్వంసము’ వీరు పాత్రోచిత భాషను ఆధరించి , పౌరులు మొదలగు వారి భాషకు ‘మిస్రభాష’ అని పేరుపెట్టారు . వీరి నాటకాలు అన్నింటిలోకి ముఖ్యమైనది ‘రామదాసు’ నాటకం. బళ్ళారి రాఘవాచార్యులకు కీర్తి తెచ్చిన లేదా అతని వల్లన ప్రఖ్యాతి చెందినరెండు నాటకాలలో అది రెండవది. (మొదటిది కోలాచలం శ్రీనివసురావు ‘రామరాజు ) ‘భక్తి’ ప్రదనరసంగా ఉత్తమ నాటక రచన చేసినవారిలో వీరు రెండవ వారు. మొదటివాడు రాధాకృష్ణ ’ నాటక రచయిత అయిన పానుగంటి లక్ష్మి నరసింహారావు ).
· 32-చిత్రకవిత్వ దిట్ట,హాలికుడు ,నాటక ,శతక హరికధా కర్త –శ్రీ రాప్తాటి ఓబిరెడ్డి
రాప్తాటి ఓబిరెడ్డి [1]అనంతపురం జిల్లాకు చెందిన అజ్ఞాతకవి. చిత్రకవిత్వం చెప్పడంలో దిట్ట. ఒక మారుమూల కుగ్రామంలో బడి పెట్టుకొని, పేదపిల్లలకు పాఠం చెప్తూ, తీరిక సమయంలో తోచిన విషయాలపై కవిత్వం చెప్తూ మరోప్రక్క వ్యవసాయంచేస్తూ జీవనం సాగించిన నిరాడంబర జీవి ఇతడు. శతకాలు, హరికథలు, నాటకాలు, పద్యకావ్యాలు చాలా వ్రాశాడు. వాటిలో ఎక్కువభాగం అముద్రితాలే. ఖడ్గబంధ కందము, శైలబంధకందము, రతిబంధము, ఉత్పల పాద గర్భకందము మొదలైన చిత్రబంధకవిత్వం, అంత్యప్రాస, ద్విప్రాస, త్రిప్రాస,లటానుప్రాస మొదలైన శబ్దాలంకారాలు ఇతని రచనలలో అడుగడుగునా కనిపిస్తుంది.
రచనలు
- భక్త శ్రీ సిరియాళ (హరికథ)
- భీమసౌగంధిక (నాటకము)
- నిర్యోష్ట కృష్ణశతకము
- రాప్తాటి నిర్వచన రామాయణము
- శబ్దాలంకార శతకము
రచనల నుండి ఉదాహరణలు
నక్షత్రనేత! ఖద్యో
తాక్షా! రణరంగదక్ష! ఆశ్రితరక్షా!
రాక్షస గజహర్యక్షా!
అక్షీణ దయా కవితకటాక్షా! కృష్ణా!
(కృష్ణ శతకము నుండి)
ఏరా! సాగర! యింతనీకు పొగరా! మీరీతి నాయనతిన్
మేరంజాలితివా! దురాత్మ! కుటిలా! మిథ్యానులాపా! నినున్
ఘోరప్రక్రియ ఖండఖండములుగా, గోయించి భూతాళికా
హారం బౌ నటులే నొనర్తు ననగా – నాతండు భీతాత్ముఁడై
(రాప్తాటి నిర్వచన రామాయణములో కౌసల్యా పరిణయ ఘట్టము నుండి)
ఏమేమీ! చిరుతొండనంబి సతతం – బీరీతి సద్భక్తులన్
ఆమోదంబు జెలంగ, దృప్తిపడ – నాహారంబు లర్పించునే?
ఈ మాడ్కిన్ జెలువొందు త్యాగపరు నెందేనిన్ గనుగొంటిమే?
స్వామీ! నా మదిఁగోర్కె గల్గెను భవద్భక్తున్ బరీక్షింపగన్
(భక్త శ్రీసిరియాళ నుండి)
33-రాయలసీమ రచయితల చరిత్ర, కుమార శతక,పుష్పబామ విలాస కర్త,హెడ్ మాస్టర్ ,శ్రీ కృష్ణ దేవరాయ గ్రంధాలయ స్థాపకుడు,కవిభూషణ ,కవితిలక –శ్రీ కల్లూరు హనుమంతరావు
· రాయలసీమ రచయితల చరిత్ర వ్రాసిన కల్లూరు అహోబలరావు స్వయంగా కవి. బహుగ్రంథకర్త.
జీవితవిశేషాలు
కల్లూరు అహోబలరావు[1] 1901 జూన్ నెలలో అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలో జన్మించాడు. ఇతని పూర్వీకులు మైసూరు రాష్ట్రంలోని ‘మొళబాగు’కు చెందినవారు. బడగనాడు నియోగి శాఖకు చెందిన బ్రాహ్మణుడు. కాశ్యపశ గోత్రుడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కల్లూరు సుబ్బారావు ఇతనికి మేనమామ. ఇతనికి తన పన్నెండవయేటనే వివాహమైనది. భార్య సీతమ్మకు అప్పటికి ఎనిమిదేండ్లు మాత్రమే. ఇతనికి ఆరుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు పుట్టారు.
విద్యాభ్యాసం, ఉద్యోగం
ఇతడు తన ప్రాథమిక విద్య హిందూపురం, ధర్మవరం గ్రామాలలో చదివాడు. బెంగళూరులో యస్.యస్.ఎల్.సి చదివాడు. బళ్లారిలో సెకండరీగ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పరీక్ష పాసయ్యాడు. తెలుగులో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకాలోని అనేక గ్రామాల పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేశాడు. బళ్లారిలోని సెయింట్ జాన్స్ హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా, తెలుగు పండితునిగా పనిచేశాడు.
సాహిత్యరంగం
బళ్లారిలో పనిచేస్తున్నపుడు 1931లో ఘూళీకృష్ణమూర్తి, హెచ్.దేవదానముల సహకారంతో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 40కు పైగా గ్రంథాలను పాఠకలోకానికి అందించాడు. 1981లో ఈ సంస్థ స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ఇతడు తన రచనలను మొదట శతకాలతో ప్రారంభించాడు. ఎన్నో గ్రంథాలను వ్రాశాడు. 1919 నుండి 1990 వరకు ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు క్రమం తప్పకుండా శుభాకాంక్షలను పద్యరూపంలో ముద్రించి బంధుమిత్రులకు పంపేవాడు. అవి కేవలం శుభాకాంక్ష పద్యాలు మాత్రమే కావు. గత సంవత్సరంలో ప్రజానీకం పడిన కష్టనష్టాలకు, దేశకాల పరిస్థితులకు దర్పణం పట్టిన పద్య ఖండికలు.[2] రాయలసీమలో పుట్టిపెరిగిన 141మంది కవుల జీవితచరిత్రలను,వారి రచనలను పరిచయంచేస్తూ నాలుగు సంపుటాలలో “రాయలసీమ రచయితల చరిత్ర”ను వెలువరించాడు.
రచనలు
- కుమార శతకము (1923)
- భరతమాతృ శతకము (1923)
- భావతరంగములు – ఖండికలు (1931)
- పూదోట – ఖండికలు (1951)
- భక్తమందారము – ద్విశతి (1958)
- ఉగాది స్వర్ణభారతి (1972)
- రాయలసీమ రచయితల చరిత్ర – 4 సంపుటాలు (1975-1986)
- శ్రీరామకర్ణామృతము (1980)
- శ్రీకృష్ణకర్ణామృతము
- ఉగాది వజ్రభారతి
- గృహలక్ష్మి – కందపద్య త్రిశతి
- పుష్పబాణ విలాసము
- యామినీపూర్ణతిలక
- శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రము
రచనల నుండి ఉధాహరణలు
1.సీ. రాటమా! కాదు – పోరాటంబు లుడిగించు
విష్ణుచక్రంబిద్ది పృథివి యందు
రాటమా! కాదు – ఆరాటంబు బోకార్పు
కల్పవృక్షంబిద్ది ఖండితముగ
రాటమా! కాదుపో – కాటకంబుల ద్రోలి
కడుపు నిండించెడి కన్నతల్లి