త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య,ఆచలరమణుడు ,గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా కర్త –శ్రీ రావినూతల శ్రీరాములు
· రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు 1936, అక్టోబరు 12న ప్రకాశం జిల్లా, పమిడిపాడులో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.
రచనలు
- మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర[1]
- పేదలపెన్నిది (గుత్తి కేశవపిళ్ళై జీవితగాథ)
- ప్రజలమనిషి ప్రకాశం
- ఆంధ్రకేసరి ప్రకాశం
- ధ్రువతార (పొట్టిశ్రీరాములు జీవితగాథ)[2]
- అరుణగిరి యోగులు
- దాక్షిణాత్య భక్తులు
- దక్షిణాది భక్తపారిజాతాలు
- సుందరకాండము (నవరత్నమాల)
- అచల రమణుడు
- బ్రహ్మర్షి దైవరాత
- మహాతపస్వి కావ్యకంఠ గణపతిముని
- బి.వి.నరసింహస్వామి
- ప్రతిభాశాలి (పప్పూరు రామాచార్యులు జీవితకథ)
- కల్లూరి మనీషి
- ధన్యజీవి
- చీమకుర్తి శేషగిరిరావు
- బాపూజీ రామమంత్రము
- పప్పూరి రామాచార్యుల ఆముక్తమాల్యద
- జవహర్‌లాల్ నెహ్రూ జీవితకథ, సూక్తులు
- మహామనిషి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ సంక్షిప్త జీవితపరిచయం
- జాతీయ పతాకం – గీతం
- గ్రేట్ సెయింట్స్ ఆఫ్ సౌత్ ఇండియా
· 36-శ్రీరామాయణనిధి ,కధానిదధి ,బైబిల్ సూక్తులు రాసిన విద్యారత్న ,లలితకవికోకిల –శ్రీ తలమర్ల కళానిధి
· లమర్ల కళానిధి పేరుతో సాహిత్యలోకానికి పరిచయమైన ఈ కవి అసలు పేరు కొల్లప్ప[1].
జీవిత విశేషాలు
ఆయన అనంతపురం జిల్లా, కొత్తచెరువు మండలానికి చెందిన తలమర్ల గ్రామంలో 1915 లో ఓబమ్మ, ఓబన్న దంపతులకు జన్మించాడు.వారిది హరిజన కులం. మొదటి నుండి బీదతనంతో జీవితాన్ని గడిపిన ఆయన నిరాడంబరుడు, సుగుణ సంపన్నుడిగా పేరెన్నికగన్నాడు. ఇతడు స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడై సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1970లో అనంతపురంలో తెలుగు పండితునిగా పదవీ విరమణ చేశాడు.
ఇతని సుగుణాన్ని నిరూపించే సంఘటన ఒకటి[2], [3]
ఆ రోజుల్లో పల్లెల్లో అక్షరాస్యతని వ్యాపింపచేయటం కోసం, ప్రైవేటు మేనేజ్‌మెంట్లు నిర్వహించే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్నీ, ప్రాథమికోన్నత పాఠశాలల్నీ, ప్రభుత్వం గ్రాంటులిచ్చి ప్రోత్సహించేది. ఆ గ్రాంటుసొమ్ము ఎంతో తెలుసా? 1 నుండి 5వ తరగతి వరకూ ఉండే ప్రాథమిక పాఠశాలకి నెలకి 5 రూపాయలు. 6, 7, 8 తరగతులు కూడా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అయితే, నెలకి 15 రూపాయలు. అంతే, ప్రభుత్వం అందించే సాయం. మరి, స్కూలుకి కావలసిన కుర్చీలూ, బెంచీలూ, బల్లలూ, రిజిష్టర్లూ, మ్యాపులూ, తెల్ల కాగితాలూ, చాక్`పీసులూ, ఇవి కాక, బిల్డింగ్ అద్దె, టీచర్ల జీతాలు – వీటన్నింటికీ డబ్బు కావాలి కదా – అది అంతా మేనేజ్‌మెంట్ వారే, ఊళ్లో ప్రజల విరాళాల ద్వారానో, విద్యార్థులు చెల్లించే స్కూలు ఫీజుల ద్వారానో సమకూర్చుకోవాలి. విద్యార్థుల దగ్గర్నుంచి ఫీజు, ఎట్టి పరిస్థితిలోనూ నెలకి అర్థ రూపాయి మించకుండా, అదైనా స్కూళ్ళ ఇన్‌స్పెక్టరు వారి అనుజ్ఞ లేకుండా వసూలు చెయ్యకూడదు – ఇదీ ఆనాటి ఎయిడెడ్ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాల మేనేజ్‌మెంట్ల దుస్థితీను. అటువంటి ప్రాథమిక పాఠశాల మేనేజ్‌మెంట్ అధిపతిగా తలమర్ల కళానిధి ఉండేవాడు. అప్పటికాయన వయస్సు ఇరవై నిండలేదు. అంతే కాదు, ఆయన ఎనిమిదవ క్లాసు వరకే చదువుకొని టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. అలా ఎనిమిదవ క్లాసు మాత్రమే పాసయి టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళని హయ్యర్‌గ్రేడ్ టీచర్లనే వారు. అలా కాకుండా మెట్రిక్యులేషన్ పేసయి, టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్లని సెకండరీ గ్రేడ్ టీచర్లనే వారు. తలమర్ల వారు అప్పట్లో హయ్యర్ గ్రేడ్ టీచర్ మాత్రమే! బెళ్లూరి శ్రీనివాసమూర్తి మాత్రం సెకండరీ గ్రేడ్. అంటే బెళ్లూరి ఓ మెట్టు ఎక్కువ. అనగా 6, 7, 8 తరగతులకి పాఠం చెప్పే అర్హత వుంది ఆయనకి. అలా తనకంటే ఎక్కువ అర్హత ఉన్న తన మిత్రుడు బెళ్లూరి శ్రీనివాసమూర్తిని, ప్రాథమికోన్నత పాఠశాలగా ఎదిగి, తన మేనేజ్‌మెంట్ లోనే ఉన్నత పాఠశాలకి హెడ్‌మాస్టర్‌గా చెయ్యడమే కాకుండా, శ్రీనివాసమూర్తి తమ్ముడికీ, తండ్రిగారికీ, ఇద్దరికీ కూడా తన పాఠశాలలో టీచర్ ఉద్యోగాలిచ్చాడు తలమర్ల కళానిధి. మైత్రిపట్ల ఆయనకి ఉన్న అభిమానం అది. కాని శ్రీనివాసమూర్తి తండ్రి అయిన హనుమంతరావుగారికి, ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాల స్థాయికి ఎదిగిన ఆ పాఠశాల మేనేజ్‌మెంట్‌ని, తలమర్ల కళానిధి నుంచి తప్పించి తను చేజిక్కించుకోవాలనే చెడు తలంపు వచ్చింది. దాంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పై అధికార్లకి ఫిర్యాదులు చేశాడు. ఊళ్ళో కొందరిని తలమర్లపైకి ఉసిగొల్పాడు. లెక్కలు సరిగా లేవని తప్పుడు ప్రచారం చేశాడు. ఆయన ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినా తలమర్ల కళానిధి కలత చెందలేదు. తన మిత్రుడైన శ్రీనివాసమూర్తి కూడా ఆ కుట్రలో కలిసి అందులో భాగస్వామి అయ్యాడే అని బాధపడ్డాడు. దాంతో ఎన్నో ఏళ్ళుగా వర్ధిల్లుతూన్న బెళ్ళూరి, తలమర్లల స్నేహానికి గ్రహణం పట్టింది. ఇద్దరి మధ్యామాటలూ, పలకరింపులూ అదృశ్యం అయ్యాయి. ఇద్దర్లో, ఏ ఒక్కరు సంస్కారి కాకపోయినా, ఆ విరామం వైషమ్యానికీ, వైషమ్యం విరోధానికి దారితీసేది. కాని ఇద్దరూ సంస్కారులు – ముభావంగా ఒకరికొకరు దూరంగా ఉండిపోయారు. పరస్పరం దూషించుకోలేదు. తగవులాడుకోలేదు. తర్వాత కొన్ని నెలలకి బెళ్లూరి విద్వాన్ పరీక్షకి కూర్చోవలసి వచ్చింది. అందుకాయనకో సర్టిఫికెట్ కావలసి వచ్చింది. బోనఫైడ్ టీచర్‌గా పనిచేసినట్లు. ఆ సర్టిఫికెట్ ఎవరుఇవ్వాలి? తను పనిచేసింది తలమర్ల స్కూల్లో, అందువల్ల ఆయన ఇవ్వాలి సర్టిఫికేట్. కాని ఇంత జరిగాక ఇస్తారా? సరాసరి తలమర్ల దగ్గరికి వెళ్ళి తలవంచుకొని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు బెళ్లూరి. తలమర్ల కళవళపడి ‘ఏవిటిది స్వామీ?’ అనడిగాడు. ‘నీకు ద్రోహం చేశాను. మా నాన్నగారితో కలిసి నీపై కుట్రపన్నాను. దుష్ప్రచారం చేశాను. ఇప్పుడు క్షమించి బోనఫైడ్ టీచర్ సర్టిఫికేట్ నాకు ఎలా ఇస్తావు? ఇవ్వవు నాకు తెలుసు’ అన్నాడు. ‘ఎందుకివ్వను? ఇస్తాను. మన స్నేహానికి మధ్యలో ఏదో మబ్బుపట్టింది. ఇప్పుడు తొలిగిపోయింది ‘ అంటూ కౌగిలించుకొని, సర్టిఫికెట్ మీద సంతకం చేసి మిత్రుని భవిష్యత్తుకి బంగారుబాట వేశాడు తలమర్ల.
రచనలు
- శ్రీరామాయణనిధి (వాల్మీకి రామాయణానికి వచనానువాదం)
- దక్షిణేశ్వర భాగవతము (రామకృష్ణ పరమహంస జీవితగాథ మంజరీ ద్విపదలో)
- ఆత్మకథ
- కబీరు సూక్తినిధి (తేటగీతుల్లో కబీరు సూక్తులు)
- వర్ణాంతర వివాహాలు (నాటకము)
- హరిజనోద్ధరణ (నాటకము)
- కళాసౌధము[4] (ఖండకావ్య సంపుటి)
- నవనాథ చరిత్ర
- మధుకణములు (శ్రీ కృష్ణకర్ణామృతమునకు తెలుగు అనువాదము వచనం)
- కథానిధి (కథాసంపుటి)
- ప్రేమపూజ (కథాసంపుటి)
- మణిమనోహరులు (కథాసంపుటి)
- బైబిల్ సూక్తులు
బిరుదులు
- లలితకవికోకిల
- విద్యారత్న
రచనల నుండి ఉదాహరణ
గిజిగాడు
నూతిలోనికి వ్రాలిన యీతరెమ్మ
ఆకును తూగుటుయ్యెలవోలె సఖియతోడ
నీకులాయము నల్లెదు నిపుణమైతో
ఓయి! గిజిగాడ! ధన్యుడవోయి జగతి
ప్రణయరాజ్యపు రమతోడ బవ్వళింప
అద్భుతాశ్చర్యములు గొల్ప నందముగను
ఎవ్వరెఱుగని యల్లికనెటులొయల్లి
గారడీవైతె! గిజిగాడ కళను బెంచ
ఓ కళారాధకుడ యెంత యోపికోయి
పూనివా వేదొ దీక్షను పూతమతిని
నీకళా రహస్యమ్మును నెరుగనైతి
ఔర గిజిగాడ యెవరు నీగురువు చెపుమ
(శ్రీసాధన పత్రిక 28 జూన్ 1947 సంచికనుండి
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-22-ఉయ్యూరు