మనకు తెలియని మహాత్ముని కబుర్లు -2
ఉన్నవ వారు చెప్పిన బాపూ కబుర్లు –‘’గాంధీజీ తన జీవిత చరిత్రలో తన జీవిత ఉద్దేశ్యాలను స్పష్టంగా చెప్పారు .ఆయన లక్ష్యం భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించటం మాత్రమె కాదు .స్వారాజ్యాన్నీ ,ఈశ్వర సాక్షాత్కారాన్నీ ఆత్మ దర్శనాన్నీ పొందటమే ఆయన లక్ష్యం .తాను చేసిన ప్రతిపని భగవద్దర్శనం కోసమేనని ,ఈ ప్రయత్నం లో తాను ఆహుతి అవటానికి కూడా వెనుదీయననీ ,,తానూ రాజకీయ రంగం లో ప్రవేశించటం కూడా ఆత్మ సాక్షాత్కారం పొందటానికే అని గాంధీ రాశారు .తనకు ఇంకా భగవద్దర్శనం పూర్తిగా కలగలేదని అనేవారు .
ఒక సారి గాంధీని ఇలా ప్రశ్నించా ‘’బాపూ !మీరు ఆత్మ కథలో ముప్పై ఏళ్ళుగా భగవంతుని దర్శనంకోసం నిరంతరం శ్రమిస్తున్నానని ,ఆ ప్రయత్నం లో అగ్ని గుండాన దూకటానికైనా సిద్ధమే అని రాశారు కదా .మీ ఉద్దేశ్యంలో భగవంతుడు ఎలా ఉంటాడు ?ఏ రూపం లో మీరు భగవంతుని చూడాలని అనుకొంటున్నారు ?శ౦ఖుచక్రగాదాయుధాలతో ఉన్న విష్ణు మూర్తిని చూడాలనుకొంటున్నారా ‘’అంటే బాపు చిరునవ్వు నవ్వి ‘’క్రైస్తవులకు ఆరూపం లో సాక్షాత్కరించడు కదా ‘’అన్నారు .’’కానీ భక్త శిరోమణి తులసీ దాస్ కు విష్ణు రూపం లోనే దర్శనమిచ్చినట్లు తెలుస్తోందికదా ‘’అన్నాను .’’అవును .యద్భావం తద్భవతి .అన్నట్లు ఎవరు ఏ భావంలో ఆరాధిస్తే ఆ రూపం లో భగవద్దర్శనం లభిస్తుంది .కాని నాకు ఏదో ఒక ఆకార మూర్తిగా దర్శించాలని లేదు .నిరాకార ,నిరంజన ఆత్మ స్వరూపాన్నే సాక్షాత్కరింప జేయమని కోరుతున్నాను ‘’అన్నారు బాపు .ఆయన అన్నిమతాలను సమభావం తో చూశారు .రామనామ సంకీర్తనం చేసేవారు .సాకారమూర్తిని సేవించలేదు .నిజానికి ఆయన ఆరాధించిన రాం రహీం యేసు లకు భేదమే లేదు .
‘’గాంధీజీ రాసిన గీతా బోధన నాకు తెలుగులో రాయటానికి అదృష్టం కలిగింది .అందులో అయిదవ అధ్యాయం 18వ శ్లోకం ‘’విద్యా వినయ సంపన్నేబ్రాహ్మణే గవి హస్తిని – శుని చైవ స్వపాకం చ పండితా స్సమ దర్శనః ‘’భావం నాకు స్పష్టంగా గోచరించలేదు .వెంటనే గాంధీని ‘’బాపూ !అందర్నీ సమాన దృష్టితో చూడటం అంటే ఏమిటి ?అది ఎలా సాధ్యమౌతుంది ?మిమ్మల్నీ ,మురికి బట్టలు ఉతికే చాకలిని సమానంగా గౌరవించటం ఎలా ?ఆ చాకల్ని ‘’దయ చేయండి ఈ కుర్చీలో కూర్చోండి ‘’అని గౌరవిస్తే లోకులు నన్ను పిచ్చి వాడు అనుకోరా ?కనుక ఈ సమత్వాన్ని మా నిత్య జీవితం లో ఆచరణలో పెట్టటం ఎలాగో వివరించి చెప్పండి ?’’అన్నాను .బోసినవ్వుల బాపు ‘’సమత్వం అంటే అదికాదు ..ఎవరికీ ఏది అవసరమో గుర్తించి ,వారికి ఆ విధంగా సేవ చేయటం ‘హాథీకో మన్,చివుంటేకో కణ్’’అన్నట్లు ఏనుగు కు మణుగు ఆహారాన్ని చీమకు ఒక కణం ఆహారాన్ని పెట్టినా రెండిటికి సమానంగా ఆహారం పెట్టినట్లే లెక్క ..ఆకలేసిన వాడికి ,ఆకలి లేని వాడికీ సమానంగా పెడితే ఇద్దరికీ అపచారం చేసిన వాళ్ళమవుతాం .వారిద్దర్నీ సమాన దృష్టితో మనం చూడలేదన్నమాట .కనుక ఎవరికీ ఏది ఎంత అవసరమో వారికి ఆ సేవను ప్రతిఫలాపేక్ష లేకుండా చేయటం వల్లనే సమదృష్టికలుగుతుంది .అభ్యాసం అనుభవాలవలన ఈ ధర్మ సూక్ష్మాలు బోధ పడతాయి ‘’అని ఉపదేశించారు మహాత్మాజీ .
రేపు గాంధీ జయంతి సందర్భంగా బాపూకొక చిరుకానుకగా
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-22-ఉయ్యూరు
వీక్షకులు
- 993,985 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,951)
- సమీక్ష (1,306)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (380)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు