పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-6
సాధారణంగా తారాశంకర్ తన రచనతో సంతృప్తి పొందడు .దాన్ని మార్చిమార్చి మెరుగులు దిద్దుతూనే ఉంటాడు.1939లో ప్రచురించిన ధాత్రీ దేవతనవల ఆయన రచయితగా ప్రదర్శించిన లక్షణాలన్నీ బీజ ప్రాయంగా ఉన్నాయి .పాత ధనవంతుల నయా ధనవంతుల సమస్యలు ,రైతాంగ సమస్యలు ,సగటు మనిషి నిరంతర పోరాటం ,వ్యక్తిత్వంతో భాసించే స్త్రీ ,పురుషులు ,విభిన్న సిద్ధాంతాల కార్యకర్తలు ,వర్షాభావ పరిస్థితులు ఇందులో దర్శన మౌతాయి . మనో వికారాలు లేకుండా నిస్సంగం గా ఆయన రాసిన తర్వాతనవలలకు ఇది నాంది .ఇవన్నీ విస్తృత ప్రాతిపదిక పై రాసినవే .సార్వకాలీనత సార్వజనీనత ఉన్నవే .తన అత్త మరణం ధాత్రీదేవత మరణం అంటాడు బంధ్యోపాధ్యాయ .నిష్కల్మష ప్రేమమూర్తి గౌరీ.హి౦సా విధానాలతో స్వాతంత్ర్యం సంపాదిద్దామనుకొన్న కొందరు యువకులు అమెరికా మొదలైన దేశాలకు వెళ్లి అక్కడ కేంద్రాలు ప్రారంభించారు .అదే నిజమైన విప్లవంగా భావించారు .
గణ దేవత ,పంచ గ్రామ నవలలో అయిదు గ్రామాల కథ ఉంది .పంచాయతీరాజ్ అస్తవ్యస్తం క్షీణదశ చూపించాడు .పాత నుంచి కొత్తకుకోత్తకు మారే దశ చూపాడు .ప్రాచీన ,మధ్యకాలాలలో బెంగాల్ లోగ్రామాలు 9,7,5 సంఖ్యలో సమూహాలుగా ఉన్నాయి .గ్రామ నిర్వహణ సంఘాలచే గ్రామస్తుల అంగీకారంతో పాలన జరిగేది .అందుకే వీటి నవగ్రామ, సప్తగ్రామ ,పంచాగ్రామ అనే పేర్లు వచ్చాయి .ఈ సంఘాలు ప్రజలకు ఎంతో మేలు చేసేవి ,మన్ననలు పొందేవి .ఒకకమ్మరి గ్రామస్తుల పని చేయటానికి నిరాకరించటంతో ‘’గణ దేవత ‘’నవల మొదలౌతుంది .కులాల వృత్తులు చేసేవారికి గ్రామస్తులు ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పేవారు .అది వారిఅవసరాలకు చాలేదికాదు .పైకుమ్మరి అందుకే ఆవూరు వెళ్లి పట్నం లో బతుకుదామనుకొన్నాడు .గ్రామ సంఘం అతడిని విమర్శించినా లక్ష్యపెట్టడు .ధనికుల్ని శాసించలేని ఆ సంఘాన్ని అతడూ లెక్క చేయలేదు .పట్నం నవనాగరకతకు ప్రతీక .పల్లె ఇంకా అలానే కునారిల్లుతోంది .గ్రామ సంఘాలకు మూలాలైన ఆయిదు గ్రామాలు క్షీణించిపోయాయి .పట్నం వెళ్ళిన ఆయువకుడు తిరిగివచ్చీ ఇంకా ఎక్కువమందిని తనతో తీసుకు వెళ్ళాలనుకొని వచ్చి గ్రామం ధనికుల హస్తాలలో నలిగిపోతుంటే భరించలేకపోతాడు .ఇందులో ఉన్నవారు వ్యక్తులు కారు సాంఘిక వ్యవస్తలు .ప్రధానపాత్రలు ఒకే ఆర్ధిక వ్యవస్తకుచెందినవి .నిరక్షరాస్యులమధ్య విద్యావంతుడు ఒకడు ఉండిమార్గదర్శనం చేయటం ఉంది .కార్మికులుగా వలస పోకుండా భూమిని ఇంకా తమ జీవనాధారంగా నిలబెట్టుకొనే వ్యక్తులు పెరుగుతారు .ఈ నవలలో ఉన్నత ఉత్తమ సాహిత్య విలువలు నెలకొల్పాడు .ఆకాలం లో అలాంటి రచయితలూ లేరు .ఆయన కృషి చేసిన సాహిత్య ప్రక్రియ విభిన్నమైనది .ఆయన సాహిత్యగౌరవం అసాదారణమైనది .
సశేషం
మహర్నవమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు