శమీ పూజ,శమీ అష్టోత్తర శతనామావళి

శమీ పూజ,శమీ అష్టోత్తర శతనామావళి

Video link

శమీ పూజ ,శమీ అష్టోత్తర శతనామావళి

శమీపూజ

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం|

అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా||

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |

లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం

వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిమ్‌ |

వందే సూర్యశాశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్‌ ||

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |

యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ||

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |

సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

 తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా; విజయదశమినాడు చేపట్టిన ఏకార్యము అయినా విజయముతధ్యము అని చతుర్వర్గ చింతామణిఅనే ఉద్గ్రంథము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే విజయంఅని తెలిపియున్నది. ఆ పవిత్ర సమయము సకల వాంఛితార్థ సాధకమైనదని నమ్మకం..

మహిషాసుర మర్దని అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి ,పదవ రోజైన ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు వాడిని సంహరించి విజయం సాధించింది. అందుకే ఆరోజుకు  విజయదశమి అనే పేరొచ్చింది.పూర్వం రాజులు ,జమీందార్లు లోక కల్యాణం కోసం ,వాళ్ళ విజయం కోసం ,వారి పాలనలో ఉన్న దేవాలయాలలోశమీ పూజోత్సవాలు చేసేవారు . సాయంకాలం పూజ తర్వాత స్వామిని గుర్రం పై ,వేదమంత్రోచ్చరణతో ,మేళ తాళాల ఛత్ర చామర మర్యాదలతో తో  ఊరేగించి ,,శమీ వృక్షం దగ్గరకు వెళ్లి ఆ వృక్షానికి ,ఆయుధాలకు పూజ చేసి ,విజయం కోసం నాలుగు దిక్కులలో,వృక్షం పై అగ్రంపైనా  బాణాలు సంధించి వదిలే వారు. ఇది శత్రునాశనానికి చిహ్నం . ప్రస్తుత సంవత్సరం  విజయదశమినుంచి వచ్చే సంవత్సరం విజయ దశమి పర్యంతం  అష్ట దిక్కులా తనకు తన కుటుంబానికి దిగ్విజయం కలగాలని. “ విజయ పత్రం. “ రాసి శమీ వృక్షం మొదట్లో  ఉంచుతారు. ఇందులో గోత్రం ,పేరు రాయాలి. శమీ వృక్షానికి అందరూ ప్రదక్షిణాలు చేసి ,శమీ పత్రాలను కోసి భక్తితో కళ్ళకు అద్దుకొని శిరస్సున ఉంచుకొని  ఆలయానికి వస్తారు.

మనం ఒక తెల్లకాగితం మీద పైన శ్రీ రస్తు— శుభమస్తు —-అవిఘ్నమస్తు అని దూర దూరంగా రాసి దానికింద

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ

 అనే శ్లోకం రాసి ,దానికింద స్వస్తిశ్రీ చాంద్రమాన _________( శుభకృత్) నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ దశమి –విజయదశమినుంచి ,శోభకృత్ నామ సంవత్సర ఆశ్వ యుజ శుద్ధ దశమి విజయ దశమి పర్యంతం అని రాసి, తర్వాత(_______( గౌతమస) గోత్రం –తర్వాత________ ( గబ్బిట దుర్గాప్రసాద్) కు కుటుంబానికి అష్టదిక్కులా దిగ్విజయం కలుగుగాక  అనిరాసి శ్రీశ్రీ శ్రీశ్రీ శ్రీ  అని అయిదుసార్లు

  రాసి పసుపు ,కుంకుమ అంటించి శమీ వృక్షంలేక  కొమ్మ కింద ఉంచాలి. గుడిలో అయితే అర్చకస్వామి శమీ కొమ్మకు బియ్యాన్ని మూటలో కట్టి ,మనం రాసిన కాగితాలన్నీ కొమ్మ క్రింద పెట్టి అష్టోత్తర పూజ చేస్తాడు.  కాగితం బాణాలు తయారు చేసి ధర్మకర్త చేత నాలుగు దిక్కులకు బాణాలు వదిలిస్తాడు.

  జమ్మి చెట్టుకు ఇంతటి ప్రాధాన్యం రావటానికి కారణం ఆ వృక్షాధి దేవత అగ్ని దేవుడు అవటమే. అగ్నిదేవుని వలననే దేవతలకు హవిస్సులు అందిస్తాము. ఆయన ద్వారానే దేవతలను ఆహ్వానించటం సంప్రదాయం.. ‘హిరణ్య  వర్ణాంహరిణీ౦ సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీ౦లక్ష్మీం జాత వేదో   మమావహః. “ అనే వేదవాక్యం లో. “ అగ్నిదేవా !లక్ష్మీదేవిని నేను పూజించటానికి ఆమెను ఆహ్వానించు. “ అని ఉంది. ఇ౦తటిప్రభావం కల అగ్ని శమీ వృక్షానికి అధి దేవుడు. అందుకే జమ్మికి అంతటి ప్రాధాన్యం. అంతేకాదు. “ శమీ కీర్తనా దేవపాపం నశ్యతి వాచికం-స్మరణాన్మానసం

పాపం ,స్పర్శనాత్కాయజం తదా –నిత్యం తత్పూజ నా ,ధ్యానా ద్వంద్వ నా చ్చైవభక్తితః-నిర్విఘ్న కరమాయుష్య౦,జ్ఞానం ,పాప క్షయోపిచ. “ . అంటే శమి అని నోటితో అంటే  నోటితోచేసినపాపాలు ,మనసులో శమీ అనుకొంటే ,మనసుతో చేసిన పాపాలు ,,శమీ అని తాకి నమస్కరిస్తే శారీరక పాపాలు పోవటమేకాక ప్రతిరోజూ పూజిస్తే దీర్ఘాయువు జ్ఞానం కలుగుతాయి. ఆనంద రామాయణం లో శ్రీ రాముడు రోజూ శుద్ధుడై నిత్యకర్మలు చేసి ,వట వృక్షం, బిల్వ ,శమీ, ఆశ్వత్ధం తులసీ మొదలైనవృక్షాలను పూజిస్తాడని ఉంది.

  కర్ణాటక లో విజయదశమి పండుగనాడు’’ జంబూ సవారీ’’ అనే ఉత్సవం చేస్తారు. సాయంకాలం అందరూ కొత్తబట్టలు కట్టుకొని గ్రామానికి వెలుపల దగ్గరలో ఉన్న మరో గ్రామానికి నడచిలేక  బళ్లమీద బస్సులమీద ఊరేగింపుగా వెళ్లి అక్కడి దేవాలయం లో దైవ దర్శనం చేసి తిరిగి ఇంటికి వస్తారు. మా చిన్నతనం లో హిందూ పురం లో ఇలానే చేసే వాళ్ళం. హిందూ పురంనుంచి బెంగుళూరు రోడ్డులో ఉన్న సూగూరు వెళ్లి అక్కడి ఆంజనేయస్వామిని దర్శించి తిరిగి వచ్చేవాళ్ళం.జట్కాబండి వాళ్ళు బస్సులవాళ్ళు అందర్నీ ఉచితంగా ఎక్కించుకొని జంబూ సవారీ సరదాగా జరిపేవారు. దీన్నే సీమోల్లంఘనం అంటారు.

  అలాగే రాజులు ,జమీందార్లు పార్వేట ఉత్సవం చేసేవారు ఇదే విధానం లో. మన తిరుమల,వరదరాజస్వామి  మొదలైన ప్రసిద్ధ ఆలయాలలో కూడా స్వామి ఉత్సవ విగ్రహానికి క్షత్రియ వేషం వేసి కనుమ పండుగనాడు  పార్వేట ఉత్సవం చేస్తారు ,.

 ఇంకా దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభమూహూర్త దినం ఈ విజయదశమి రోజునే అని తెలియజేయబడింది. “శ్రవణా” నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి “విజయా” అనే సంకేతము ఉన్నది. అందుకనే దీనికి “విజయదశమి” అను పేరు వచ్చినది.

ఈ విజయదశమినాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలుచుకుని పేరంటం పెట్టుకొని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.

అలాంటి విజయ దశమి రోజు మరింత ముఖ్యమైనది “శమీపూజ”. శమీవృక్షమంటే “జమ్మిచెట్టు” అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను వస్త్రములను ఈ శమీవృక్షముపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసము పూర్తిఅవగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న “అపరాజితా” దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు. తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారంకూడా ఉన్నది.

ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో;

శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

అని ఆ చెట్టుకు ప్రదక్షణలుచేస్తూ పై శ్లోకము స్మరిస్తూ ఆ శ్లోకములు వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగ, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

ఇలా మానవులు అసాధ్యాలను సుసాధ్యాలను చేయాలన్నా మనకు ఏర్పడిన దారిద్ర్యం తొలగిపోవాలన్నా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై. ఈ “శరన్నవరాత్రి” దసరావైభవంలో పాలుపంచుకుని సర్వులూ పునీతులు అవుదురుగాక…!

               ఇందులో ఉన్న అంతరార్ధాన్ని తెలుసుకొందాం. పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింపచేసేది లేదా నిగ్రహింపచేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధిప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి. విజయదశమిని’’ దశహరా’’ అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది.  పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమినాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైనది ‘శమీ వృక్షా’న్ని దుష్టఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.

శమీ శమయతే పాపం

శమీ నాశయతే రిపూన్‌

శమీ విత్తంచ పుత్రంచ

శమీ దిత్సతి సంపదమ్‌

అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని శమీవృక్షం వద్ద పఠించాలి. శమీవృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సం కేతం. మంచి బుద్ధి కలిగి తద్వారా లోక కళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.

మొత్తం మీద చెడు పై మంచి సాధించే విజయమే విజయదశమి అని గుర్తించాలి.

శమీ అష్టోత్తరం

ఈశాన్యైనమః

పాపశమన్యైనమః

వశన్యైనమః

శివాఫలాయైనమః

లోహిత కంకటాయైనమః

అర్జున బాణ సంరక్షకాయైనమః

రామస్య ప్రియ దర్శినిన్యైనమః

యాత్రాయాం సుఖ ప్రదాయైనమః

నిర్విఘ్న కర్త్రుకాయైనమ

10-శ్రీరామ పూజితాయైనమః

అగ్నికాంతిప్రతీకాయైనమః

విఘ్నేశ పూజా విధాయకాయైనమః

శని దోష నివారకాయైనమః

యుద్ధ విజయ సాధకాయైనమః

పాండవాయుధ రక్షకాయైనమ

కుష్ఠువ్యాధి నివారకాయైనమః

ఇభ వక్త్రాయనమః

గర్భ స్రావ నివారకాయైనమః

కఫ నివారకాయైనమః

20-శ్లేష్మధ్వ౦స కాయైనమః

ఏక వింశతి పత్రికా ముఖ్యైనమః

రోమనివారణాయైనమః

భూసార వృద్ధిదాయైనమః

పాంధఛాయా కల్పితాయైనమః

పోషకాహారాయైనమః

శాకపాక వినియోగాయైనమః

దంత వ్యాధి నివారిణ్యైనమః

సర్వ రోగనివారిణ్యైనమః

అపరాజితా దేవీ ప్రియాయైనమః

30-గోత్ర వంశాభి వృద్ధి దాయిన్యైనమః

క్షీర పక్షి ప్రియాయైనమః

కల్ప వృక్ష సమాయైనమః

పశు సంరక్షకాయైనమః

శ్రీ భద్రాయై నమః

పుణ్యదాయైనమః

పుణ్యరూపిణ్యైనమః

జానకీదుఃఖ శమన్యైనమః

సర్వ కల్మష సంహార్యై నమః

కామితార్ధ ప్రదాయై నమః

40-సత్య రూపాయయై నమః

శుభ ప్రదాయై నమః

శుద్ధాయై నమః

శక్త్యైనమః

పూతాత్మికాయై నమః

చతుర్వర్గ ఫలదాయైనమః

త్రిలోక జనన్యై నమః

మూల ప్రకృతిసంజ్నికాయైనమః

బ్రహ్మ రూపి ణ్యైనమః

అవాజ్మానస గోచరాయై నమః

50-పంచ భూతాత్మికాయైనమః

పంచ కలాత్మికాయైనమః

నిర్గుణాయై నమః

నిత్యాయైనమః

నిరాటంకాయనమః

దీన జన వత్సలాయై నమః

చతురానన సేవితాయైనమః

సిద్ధి ప్రదాయై నమః

అమలాయై నమః

కమలాయై నమః

60-లోక వందితాయై నమః

లక్ష్మైనమః

రామ ప్రియాయైనమః

విష్ణు ప్రియాయై నమః

తటిల్లతా౦గ్యై నమః

ప్రకృత్యై నమః

సర్వ భూత హిత ప్రదాయై నమః

విభూత్యై నమః

పరమాత్మికాయై నమః

శుచయే నమః

70-ధన్యాయై నమః

నిత్య పుష్టాయై నమః

దీప్తాయై నమః

రమాయై నమః

వసు ధారి ణ్యై నమః

క్రోధ సంభవాయై నమః

అనుగ్రహ ప్రదాయై నమః

అశోకాయై నమః

లోక శోక వినాశిన్యై నమః

అనఘాయై నమః

80-కరుణాయై నమః

ధర్మ నిలయాయై నమః

లోక మాత్రేనమః

దేవ్యై నమః

సుప్రసన్నాయైనమః

ప్రభాయై నమః

ఆహ్లాద జనన్యై నమః

విమలాయై నమః

విశ్వ జనన్యై నమః

వహ్ని ధరాయై నమః

90-యశస్విన్యై నమః

జయాయై నమః

మంగళ ప్రదాయై నమః

సర్వ దిక్ శుభ దాయకా యైనమః

వంశ ప్రవృద్ధయై నమః

గోత్రాభి వృద్యైనమః

ప్రసన్నాక్షాయై నమః

సర్వోపద్రవ వారి ణ్యైనమః

బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః

త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః

100-పూర్ణాయై నమః

అనంగాయై నమః

స్తవ్యాయై నమః

పరమాయై నమః

తరణాయై నమః

భగవత్యై నమః

తత్వ త్రయ్యై నమః

మత్యై నమః

మాత్రేనమః

హిత కారిణే నమః

110-మాన్యాయై నమః

రాజ్య లక్ష్మై నమః

సర్వ సంపత్తి దాయై నమః

భోగ లక్శ్మైనమః

మహా జయాయై నమః

మహా బోధాయై నమః

మహా బంధన సంహారి ణ్యై నమః

మహా వృక్షాయై నమః

మహా ఛాయాయై నమః

మహానఘాయై నమః

120-మహా శ్వాసాయై నమః

మహా సారాయై నమః

మహా క్షాన్త్యై నమః

యశస్విన్యై  నమః

మహారోగ వినాశిన్యై నమః

మహా క్షేమంకర్యై నమః

మహా విష నివారిణ్యై నమః

మహా శుభద్రాయై నమః

మహా సత్యై నమః

మహా నిత్యాయై నమః ‘

130-మహా శివ ప్రియాయైనమః

చిన్మయాకారాయై నమః

కాత్యాయిన్యై నమః

మాతృకాయై నమః

అజ్ఞాన శుధ్యైనమః

సృష్టి రూపాయైనమః

పురుషార్ధ ప్రదాయిన్యైనమః

వరదాయై నమః

భయ నాశిన్యైనమః

140-విశ్వ తోష్యణ్యైనమః

కుల సంపత్ప్రదాయై నమః

ప్రణవాత్మికాయై నమః

ఈశ్వర్యై నమః

చి౦తితార్ధ ఫల ప్రదాయి నమః

సర్వ మంత్ర మన్యైనమః

అమేయాయై నమః

అక్రూరాయై నమః

సర్వాస్త్ర ధారిణ్యై నమః

భూమిజాయై నమః

150-స్వ తేజసాయై నమః

బ్రాహ్మైనమః

జగద్ధితాయైనమః

మాన్యాయై నమః

నిరంజనాయై నమః

నిగమ గోచరాయై నమః

పూజ్యయైనమః

ధర్మ ప్రియాయై నమః

సర్వోపద్రవ వారిణ్యైనమః

లోకానంద దాయికాయైనమః

160-ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

ఓం శ్రీ శమీ దేవతాయై నమః

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.