హాస్యానందం
39-వ్యతిరేకార్ధోక్తి
ఇందులో ప్రత్యేకత ఏమిటంటే చెప్పేవాడు ఒక అర్ధాన్ని ఉద్దేశించి ,దానికి వ్యతిరేకార్ధం వచ్చేట్లు మాట్లాడటం వలన కలిగే చమత్కారం అన్నారు మునిమానిక్యంగారు .ఉదాహరణ –ఒక తండ్రి తన కొడుకుతో పరిహాసానికి ‘’ఒరే.ఇప్పుడు రాత్రి ఒంటిగంట అయింది ఇంకా ఏం పడుకొంటావులే .ఇంకాసేపు గడిపేస్తే హాయిగా తెల్లార్తుంది ‘’అన్నాడు .ఇందులో ‘’ఇక చాల్లేరా కుంకా పడుకొని ఏడు ‘’అని అర్ధం అన్నమాట .మరోటి .భార్య భర్తతో ‘’నన్ను ముద్దుపెట్టుకోకండి అలా చేస్తే నాకు తిక్కరేగుతుంది ‘’’’అన్నది అంటే ముద్దుకోసం తహతహ లాడుతో౦దన్నమాట .మూడోది –ఒకాయనకు భార్యమీద పిచ్చకోపం వచ్చింది .’’భోజనానికి లేస్తారా ?అంది భర్త బు౦గ మూతిపెట్టి’’లేవను ‘’అన్నాడు .’’ఏం ఎందుకని’’ ?అని తేనెమనసులు సినీ పాటలాగా అంటే ‘’నాక్కోపం వచ్చింది ‘’అంటే ,’’ఎట్లాపోదో నేను చూస్తాగా ?’’అని ఆమె అంటే ‘’ఇది పోయేకోపం కాదు .నువ్వు లాగి వెనకనించితోసుకొంటూ తీసుకు వెడదామనుకోన్నావేమో ?అదేమీ సాగదు .చక్కిలిగింతలు పెట్టి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మా అమ్మను కేకేస్తాను ‘’అన్నాడు .ఇవన్నీ చేస్తే భోజనానికి లేస్తాను అని అర్ధం .ఇందులో ఉన్న చమత్కారం గ్రహించని ఆడది ఉండదన్నారు సార్.వ్యతిరేకార్ధ స్ఫురణ ఈ రకం గా ఒక చక్కని మనో వ్యాపారం అయింది .దీనివల్ల పుట్టే హాస్యమూ పరమ రమణీయంగా ఉంటుంది అని ఇలాంటి వాటిలో భార్య కా౦త౦గారితో తలపండిన మునిమాణిక్యం నరసింహారావు గారన్నారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మహర్నవమి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-10-22-ఉయ్యూరు