మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -314-
-ప్రపంచ సౌందర్య రాశి ,’’ఏ రాస్తా హాయ్ ప్యార్ ‘’సినీ ఫేం ,జిడ్డు కృష్ణమూర్తి శిష్యురాలైన మదనపల్లి నటి-శ్రీమతి లీలా నాయుడు
లీలా నాయుడు (1940 – జులై 28, 2009) ప్రఖ్యాత నటీమణి, గొప్ప సౌందర్య రాశి. ప్రపంచములో మహా సౌందర్యవతులలో ఒకరిగా ఎన్నుకొనబడింది[2]. పెక్కు హిందీ చలన చిత్రములలో నటించి పేరు సంపాదించుకున్నది. “యే రాస్తే హై ప్యార్ కే” చిత్రములో లీల నటన పలువురి మన్ననలు పొందినది.
బాల్యము
లీల 1940 సంవత్సరములో జన్మించింది. మదనపల్లె (చిత్తూరు) నకు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు కుమార్తె. రామయ్య పారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేయుచున్నపుడు ఫ్రెంచి వనిత మార్తాను వివాహమాడాడు. మార్తా భారతదేశానికి సంబంధించిన విషయములలో పరిశోధకురాలు (Indologist).
జీవనగమనము
· 1954లో (పదిహేను సంవత్సరముల వయసు) Femina Miss India గా ఎన్నుకొన బడింది.
· వోగ్ పత్రిక (Vogue) లీలను మహారాణి గాయత్రీ దేవి సరసన పది మహాసౌందర్యవతులలో ఒకరిగా పరిగణించింది.
· 1956లో ఓబెరాయ్ హోటళ్ళ స్థాపకుడు మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ ను పెళ్ళాడింది.
· మాయ, ప్రియ అను కవలకుమార్తెలను కన్నపిదప తిలక్ రాజ్ తో విడిపోయింది.
· విడాకుల తరువాత జిడ్డు కృష్ణమూర్తి బోధలకు ఆకర్షితురాలయ్యింది.
· 1969లో గోవాకు చెందిన ప్రఖ్యాత రచయిత డామ్ మొరేస్ ను వివాహమాడింది.
చిత్ర రంగము
1960లో విడుదలైన “అనూరాధ” లీల మొదటి చిత్రము. హృషికేశ్ ముఖర్జీ దర్శకుడు, బలరాజ్ సాహ్ని కథానాయకుడు. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రముగా పురస్కారము పొందింది. లీలకు పండిత్ రవి శంకర్ పాటలు కూర్చాడు. 1962లో “ఉమ్మీద్” (అశోక్ కుమార్), పిమ్మట మర్చంట్-ఐవరీ వారి “The Householder” (1963), శ్యామ్ బెనెగల్ “త్రికాల్” (1985) లలో నటించింది. కొద్ది చిత్రములలో నటించిననూ లీల వాటిద్వారా చిత్రరంగముపై చెరగని ముద్ర వేసింది. 1992లో నటించిన “Elctric Moon” లీల చివరి చిత్రం.
మరణము
లీల జులై 28, 2009 న ముంబాయిలో మరణించింది[3].
315-లోక్ సభ సభ్యుడు ,డేంజర్’’సినీ విలన్ ,నంది అవార్డీ,కొక్కొరోకో దర్శకుడు,విచిత్ర వేష దారి –డాక్టర్ నాగమల్లి శివ ప్రసాద్
నారమల్లి శివప్రసాద్ (జూలై 11, 1951 – సెప్టెంబరు 20, 2019) తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు. 2009, 2014 లలో చిత్తూరు లోకసభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు.
తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఖైదీ లాంటి హిట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈయన 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. అనేక సినిమాల్లో ఈయన చిన్న పాత్రల్లో నటించాడు.పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వివాదం సాగినన్ని రోజులూ రోజుకో వేషంతో అందరినీ ఆకట్టుకున్నాడు.[1] కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన 2019 సెప్టెంబర్ 21న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[2][3
బాల్యము
శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి లో, నాగయ్య, చెంగమ్మ దంపతులకు 11 జూలై 1951న జన్మించాడు.
విద్య
శివప్రసాద్ తిరుపతిలోని వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.
కుటుంబము
శివప్రసాద్‌కి విజయలక్ష్మి తో 26 పిబ్రవరి 1972 లో వివాహము జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు మాధవీలత, నీలిమ.
సినిమారంగం
సాహిత్యం, కళలు, సినిమా నటన మొదలగునవి ఇతనికి ఇష్టమైన విషయాలు. చిన్నప్పటి నుంచి నాటకంపై ఉన్న ఆసక్తితో అనేక నాటకాల్లో నటించాడు. ఆ తర్వాత సినిమారంగానికి వచ్చి పలు చిత్రాలలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించాడు. 2005 లో విడుదలైన దొంగ సినిమాలో నటనకు గాను ఇతనికి ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరో కో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2006 సంవత్సరంలో విడుదలైన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నాడు.
నటించిన చిత్రాలు
- ఖైదీ
- యముడికి మొగుడు
- మాస్టర్ కాపురం
- ఆటాడిస్తా
- ఆదివారం ఆడవాల్లకు సెలవు
- సత్యభామ
- సుభాష్ చంద్రబోస్
- యమగోల మళ్లీ మొదలైంది
- ఆదిలక్ష్మి
- జై చిరంజీవా
- డేంజర్
- లక్ష్మి
- కితకితలు
- తులసి
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- ఒక్కమగాడు
- ఆటాడిస్తా
- బాలాదూర్
- కుబేరులు
- ద్రోణ
- మస్కా
- బ్రహ్మలోకం టు యమ లోకం వయా భూలోకం
- తకిట.. తకిట
- పిల్ల జమీందార్
- అయ్యారే
- దూసుకెళ్తా
- సై ఆట
- సౌఖ్యం (2015)[4]
- సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016)[5]
రాజకీయరంగం]
చంద్రబాబు నాయుడు , శివప్రసాద్ బాల్యస్నేహితులు, చంద్రబాబునాయుడి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి, 1999లో సత్యవేడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. 1999-2001 మధ్య సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశాడు. చిత్తూరు పార్లమెంటు సీటు ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయాడు.
మరణం
కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 21న మరణించాడు.[2]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-22-ఉయ్యూరు