హాస్యానందం
41- ప్రత్యుక్తి (రిపార్టీ )
హాస్యంగా అన్నమాటకు అవతలివాడు గోడకు బంతి తగిలి తిరిగి వచ్చినట్లు అంతకన్నా హాస్యంతో లాగి కొట్టటమే ప్రత్యుక్తి .రిపార్టీ అంటారు మ్లేచ్చులు .ఉదాహరణ –భార్య ఇంటిఖర్చులకోసం పది రూపాయలు అడిగితె ,ఇది వరకు ఇలా ఇస్తే నిమిషం లో హుష్ కాకి చేసిందని కోపమొచ్చి ‘’ఎప్పుడూ డబ్బు గోలే .డబ్బు డబ్బు డబ్బు అని కలవరిస్తావు.ముందూ వెనకా ఆలోచించవు .అసలు నీకు తెలివి తేటలు ఏడ్చి చచ్చాయా ?”’అన్నాడు అగ్గిరాముడై .’’భార్య ‘’అది మీదగ్గర దొరకదుకదండీ .అందుకే డబ్బు అడుగు తున్నాను ‘’.ఇది సరసంగా అంటించిన మాట. మేధా పౌష్కల్యం ఉన్న వారే ఇలా అంటించగలరు అన్నారు ముసిముసి నవ్వులతో మునిమాణిక్యం మాస్టారు .మరో కత –‘’ఒక సారికోపంతో మా కాంతాన్ని ‘’ఇలా స్టుపిడ్ లా మాట్లాడతావెం ?’’అన్నా ఎక్కడోకాలి .ఆవిడ పరమ శాంతంగా ‘’అలా మాట్లాడితేకానీ మీకు తెలియదాయె చచ్చి. మరేం చేద్దును మహానుభావా ?’’అంది .అందులో ఉన్న చమక్కు కాస్త ఆలోచిస్తేకాని నాకు బోధ పడలేదు. బల్బు వెలిగాక ఎంత దెబ్బకొట్టింది కాంతం ‘?’అనుకున్నాను అని మాస్టారు కథ చెప్పారు .
‘’టైమూర్ ది లంగ్’’ హాస్యం –టైమూర్ మనదేశం పైకి దండెత్తి వచ్చాడు అప్పుడొక నగరంలో ఉన్నప్పుడు జరిగిన వృత్తాంతం .ఆ వూళ్ళో ఉన్న సంగీత విద్వా౦సురాల్ని పిలిపించి సంగీతంపాడమంటే అద్భుతంగా పాడింది .మెచ్చి పారితోషికమిచ్చి ‘’అమ్మా !నీగానం మనోహరం.కానీ నీ గాన దేవత గుడ్డిదై ఉండాలి .లేకపోతె నీలాంటి కురూపిని ఆశ్రయించి ఇంతటి ప్రజ్ఞావంతు రాలని చేస్తుందా ?’’అన్నాడు .ఆమెధైర్యంగా ‘’ నిజమే మీరన్నది .ఆమెఒక్కతే గుడ్డిది కాదు జహాపనా .లక్ష్మీదేవి కూడా గుడ్డిదే .లేకపోతె ,మీ వంటి కుంటి వాడి ని వరించి ఇంతటి మహా దైశ్వర్యమిస్తుందా ??అని రిపార్టీతోకొడితే గురుడు అవాక్కై,గింగిరాలు తిరిగిపోయాట్ట .
అడిదం సూరకవి ఒకసారి వీధిలో వెడుతుంటే ,భయంకరమైన కుక్క ఒకటి కరవటానికి వచ్చింది .ఆయన పరుగు లంకించుకొన్నాడు .ఆ వీదిచివర గుమిగూడిన వాళ్ళు ‘’అంతభయ పడ్డావేం ?గాడిదలాగా పరిగెత్తుకోచ్చావు??’’అన్నారు ..ఆయన ‘’అవును కుక్క కరుస్తుందని పరిగెత్తుకొచ్చా .ఇక భయంలేదు స్వజనం లో పడ్డా.’’అని అందర్నీ గాడిదల్ని చేశాడు .అందరూ ఫకాల్న నవ్వారని మాస్తారువాచ ‘
రిపార్టీ కత్తి యుద్ధం లాంటిది స్వోర్డ్ ప్లే అన్నారట .ఇందులోని వ్యక్తులు ఒకర్నొకరు మాటలతో గాయపరచాలను కొంటారు .మెరుపు మెరిస్తే కలిగే ఆనందం రిపార్టీలో పొందచ్చు నంటారు నరసింహారావు జీ .ఇద్దరు మాట్లాడుకొంటున్నారు .తీవ్రత పెంచారు ఒకాయనకు కోపం వచ్చివెళ్ళిపోతూ ‘’నాకు తెలివి తక్కువ స్టుపిడ్ మనుషులతో మాట్లాడే ఓపిక తీరికా లేవు ‘’అన్నాడు .రెండో వాడు అతి నిర్వికారంగా ‘’నాకు చాలా ఉంది రావయ్యా ‘’అన్నాట్ట .అని మాస్టారన్నారు .మరో పుంజీడు రిపార్టీలు ఈ సారి .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-10-22-ఉయ్యూరు
‘