కొండను అద్దం లో

‘ ‘ కొండను అద్దం లో ‘’
ఇటీవల నాకు అందిన పుస్తకాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ పై శీర్షిక పెట్టాను .1-ఏదినిత్యం ?-బెజవాడ వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డా .మక్కేన శ్రీను గారు రాసిన కథా సంపుటి ఇది .ఇప్పటికే జీవనకవనం ,మట్టి కుదుళ్ళు ,వెన్ను విరిగిన కంకులు ,గోరంతకవిత వగైరా రచనలతో ప్రసిద్ధి కెక్కారు .ఆయన రాసి ప్రచురించినవి నాకు ‘’గౌ.మాస్టారు గార్కి ‘’అని పంపటం వెంటనే చదివి నేను స్పందించి రాయటం జరుగుతూనే ఉంది .ఈ పుస్తకం జులై 26 అందినా నాదృష్టి పడలేదిప్పటివరకు .దీన్నిఆయన తోబుట్టువులకు అంకితమిచ్చారు .ఇందులో నిత్యజీవిత సత్యాలను ఆవిష్కరించారు .సాంగత్యం నుంచి దేశభుక్తిదాకా 10కథల బంగారమిందులో ఉంది .భార్యాభర్తలమధ్య ఉండాల్సిన సాహచర్యం ,కొడుకులు లేని అత్తామామాలకు అమెరికాలో అల్లుడే కొడుకుగా వ్యవహరించటం ,విద్య వినయంతో వికసిస్తు౦దనటం ,రిక్షా తొక్కే పెద్దాయనలో మార్గదర్శిని చూచే సంస్కారం ,వృత్తి దర్మం తప్పకుండా పేద వాళ్ళ శ్రేయస్సుకోసం హాస్పిటల్ నడపటం ,,అవస్య ప్రాప్యమైన విధిని ఎవరూ తప్పించ లేరనటం ,వృత్తిపరంగా ఇష్టమైనదాన్ని రిటైర్మెంట్ వలన కోల్పోయినదాన్ని,కొన్ని విషయాలకు ప్రకృతి చెక్ పెడుతు౦దను కోవటం ఓష్టోష్టమాలు తప్ప ఏమీ లేని కవితా ప్రహసనం,చర్మాన్ని వెర్నియర్ కాలిపర్స్ ద్వారా పరీక్షించి రాంక్ లిస్తే ,తాను తోలు మ౦ద౦ గాడిని కాదనననుకోవటం,పల్లెలు పరిపుష్టిగా పరిఢవిల్లడమే దేశ ప్రగతి, బడి వ్యవసాయం కంటే ఊరికి మనం తీర్చుకొనే ఋణం ఏదీ లేదు అన్న సత్యాల కతా కమామీషు ఈసంపుటి. డాక్టర్ గారి పదునైన రచనకు సాక్ష్యం .
2-డా నాగులపల్లి భాస్కరరావు గారి ‘’గ్రామాలు గర్వించే లా ఉండాలిగా –మా ఊరే ఒక ఉదాహరణ .తాము పుట్టి పెరిగిన కృష్ణాజిల్లా ముదునూరు గ్రామం గురించి రాసి తలిదండ్రులకు అంకితమిచ్చారు భాస్కరరాగారు .1962లో ఢిల్లీ వెళ్లి ,తర్వాత 28సార్లు ప్రతి సంవత్సరం ముదునూరు వస్తూ అక్కడి వారిపరిచయాలతోకోద్దోగోప్పో నేర్చుకొని ఢిల్లీ వెళ్ళేవారు .ముదునూరు అంటే అన్నిటా ముదిరినవూరే .1920లో సంస్కృత సాహిత్యంలో చొరవ,1930లో స్వాతంత్ర్యపోరాటంలో చేయికలపటం ,1940లో సాంఘిక విప్లవానికి నాంది ,1960లో గ్రామాభి వృద్ధికి కృషి ,1970లో రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలికిన ఊరు ముదునూరు .సర్వశ్రీ అన్నే అంజయ్య ,కలాపాల సూర్యప్రకాశరావు ,కేశవాచార్య ,ముదునూరు చంద్ర శేఖరయ్య ఆనాటి తరం పెద్దలు అభి వృద్ధికి మార్గదర్శకులు .ఇక్కడి బూశమ్మ తిరుణాళ,పిల్లాకోటమ్మ పౌరుషం ,గోరాగారి సాంఘిక విప్లవం ఇక్కడే .కాకతి రుద్రమదేవి రాణీ కాకముందే ముదునూరు వచ్చింది ,ఇక్కడి శివాలయ రామాలయాలు రుద్రమకాలం నాటివే .ఆమెకు అక్కడి దేవాంగులు చీరలు బహూకరించారట .ఆమె మెచ్చి బహుమానాలిచ్చారట .ఇప్పటికీ ఆరేడు చెరువులున్నాయి .కొన్ని మఠాలుకూడా ఉండేవి .స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసిపని చేశాయి .గ్రంధాలయం ,శ్రీమతి కొల్లి అ౦బమ్మ గారు కట్టించిన పాఠశాల,వందేళ్ళ నుంచి జరుగుతున్న బూసేమ్మ తిరుణాళ అనే ముగురమ్మల ముదునూరుగా ప్రసిద్ధి
భాస్కరరావు గారి తండ్రి సీతారామయ్య గారు కో ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చేసిన హిందీ మాస్టారు . ఇలాంటి ఎన్నెన్నో గ్రామవిశేలతో ,గ్రామవికాసానికి రాష్ట్ర వికాసానికి తోడ్పడిన గ్రామ ప్రముఖుల విశేషాలతో ఇప్పుడు తాను గ్రామంలోన్ స్థాపించి నిర్వహిస్తున్న ‘’జీవిత చరిత్రల గ్రంథాలయం ‘’విషయాలు చెప్పారు .పేరుకే గ్రామంకానీ నగరాల కంటే అభివృద్ధి బాగా జరిగిందని గర్వంగా చెప్పారు డా భాస్కరరావు .కానీ ఆయన ఆగ్రామ చరిత్రలోఅక్కడ గ్రామ వికాసానికీ ,సాహిత్య సాంస్కృతిక వికాసానికి రాత్రి పాఠశాలలు పెట్టి హరిజనులకు విద్య నేర్పటానికి యువతలో వృత్తి విద్యా నైపుణ్యం పెంచటానికి కృషిచేసిన సోషల్ మాస్టార్ ఆతర్వాత నూజివీడులో ఇంగ్లీష్ లెక్చరర్ ప్రిన్సిపాల్ అయిన శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు గారి గురించి ఒక్కమాట కూడా రాయకపోవటం ఆశ్చర్యం కలిగించింది .’’మహాత్ముల బాటలో ‘’అనే ఆయన జీవిత చరిత్ర ఎందరికో మార్గదర్శనం చేసింది .బాలభారతి స్థాపించి ఎన్నోకార్యక్రమాలు చేసి,రేడియోలో ప్రదర్శనలిచ్చి ఇప్పించి మా ఉయ్యూరులో కూడా శ్రీ వంగల కృష్ణ దత్తు గారింట్లో బాలభారతిస్థాపించి మమ్మల్ని ఉత్తేజితులను చేశారు మాస్టారు .అలాంటి వెంకటేశ్వర రావు గారిగురించి భాస్కరరావుగారికి తెలీకా ,లేక కావాలనే వదిలేశారా ?వెంకటేశ్వరావు గారు మాలాంటి వారికి గొప్ప మార్గదర్శి ఆదర్శ ఉపాధ్యాయులు .అంటే కాదు అక్కడి హైస్కూల్ హెడ్ మాస్టర్లు శ్రీ ఘంట వెంకట్రామయ్యగారు ,శ్రీ సోమంచిరామం గారు చేసిన విద్యాభి వృద్ధి వీరి గ్రామ చరిత్రకు ఎక్కలేదు .
3-శ్రీ మహమ్మద్ సిలార్ గారు రాసిన ‘’కృష్ణా జిల్లా జమీందారులు –రైతాంగ ప్రజాపోరాటాలు ‘’. సిలార్ గారి ‘’పెరిప్లస్ యాత్ర ‘’గురించి ఇటీవలే చాలా విపులంగా రాశాను .ఇందులో చల్లపల్లి అనే దేవరకోట జమీన్ నుంచి మునగాల జమీన్ ల చరిత్ర అందులో జరిగిన రైతాంగ పోరాటాలు అత్యంత విస్తృతంగా పూసగుచ్చినట్లు వివరించారు .ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి .సిలార్ గారుకొండను తవ్వి ఎలుకను కాదు ఏనుగును ఎలుగుబంటిని పట్టుకొనే సాఃహసి . సతీసహగమన దురాచారన్నీ వివరించారు.బందర్లో సతీసహగమన ఉన్నట్లు ఇటాలియన్ యాత్రికుడు’’ పెట్రా డెల్లావల్లే ‘’రాశాడని చెప్పారు.ఒక మంగలి వానిభార్యమంగమ్మ భర్త చానిపోతే 19రోజులైతే తెల్ల చీరతో వంటినిండా నగలు ,తలనిండా పూలు పెట్టుకొని పెట్రో అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పగా ‘’నాకు ఆమెకన్నా ఎక్కువ దుఖం కలిగింది ‘’అని రాశాడు 1623-1624 యాత్రికుడు పెట్రో .సహగమనం చేసే స్త్రీకి ఉమ్మేత్తరసం సారాయిలో కలిపి తాగిస్తారని ఆమె తెరుపు మరుపులో పదడి విమూఢా వస్తలో మంటల్లో దూకేస్తుందనీ ‘’ఫ్రయర్ ‘’రాశాడు .బందర్లో ఒక నేత పనివానిభార్య ,ఒకకాపువాని భార్య ,ఒక స్వర్ణకారుని భార్య సహగమనం చేయటం తాను కళ్ళారా చూశానని ‘’మెత్ వోల్డ్ ‘’రాశాడు .సహగమనం జరిగాక చితాభస్మం పోగేసే నెపంతో ఆమె వంటి బంగారం వెండి ఏరుకొని ,ఆమెపేర కట్టినపేరంటాలు దేవాలయం హుండీ సొమ్ము కాజేసి బ్రాహ్మణ వర్గం పంచుకుంటారని చెప్పారు .బెర్నియర్ స్వయంగా సహగమనాలు ఆపాడు .అరుదైన విషయాలతో అలవోకగా చెప్పెకథల్లాఆద్యంతం అలరిస్తూ , ఈ జమీందారీ లగురించి రాసిన సిలార్ గార్ని అభినందిస్తున్నాను .
4-లయన్ శ్రీ బందా వెంకటరామారావు గారు రచించిన ‘’పాండవ పట్టమహిషి ద్రౌపది ‘’ద్రౌపదిపై గొప్ప పరిశోధన ,విషయ సంకలనం చేసి రాయారావు గారు రాసిన పుస్తకం .ఇప్పటికే భరద్వాజ, రావణబ్రహ్మ ,మహాలక్ష్మీ పురాణం వగైరా రచనలతో లబ్ధ ప్రతిష్టులయ్యారు .అన్న కృష్ణుడి లాగా చెల్లి కృష్ణా కూడా జగత్కల్యాణ౦ కోసం ,శిష్ట రక్షణకు దుష్టశిక్షణకు అవతరించిన ఒక శక్తి అంశ .సృష్టి,వర్ణాశ్రమధర్మాలు, కాలగణనన ,జ్యోతిష్య౦ తో ప్రారంభించి జయం అనబడే మహాభారతం గురించి చెప్పి ,,భారతపాలక వంశ వృక్షాలను వర్ణించి ,ఇతిహాస పురాణాలనాటి వివాహ వ్యవస్థ వివరించి ,పాంచాలరాజు ద్రుపదుని చరిత్ర చెప్పి ,ద్రౌపది జననం ,వివాహం గృహిణిగా ఆమె నిర్వర్తి౦చినధర్మం ,,పొందిన పరాభవం ,అరణ్య అజ్ఞాతవాసాలు వర్ణించి ఆమె రాజనీతిగురించి వ్యాఖ్యానించి ,ఆమె రణతంత్ర కౌశలం అభి వర్ణించి ,ఆశ్వత్థామాదులపై ఆమె చూపిన క్షమాగుణం లో ఆమె ఔన్నత్యాన్ని వివరించి , పాండవ పట్టమహిషిగా యుధిష్ఠిరుని గౌరవం పెంచిన విధానాలు వర్ణించి,చివరగా ద్రౌపది మహాప్రస్థాన౦ తో ముగించారు .పౌరుష ప్రతాపాలు చూపిన ఆశక్తి స్వరూపిణి భారత స్త్రీలకూ ఆదర్శప్రాయులన్నారు .మానవజాతి ఉన్నంతవరకు భారతం, ద్రౌపది ఉంటారు అన్నారు లయన్ రామారావు గారు .మధ్యమధ్యలో ‘’మనలో మాట ‘’అంటూ మరిన్ని విషయాలు జోడించారు .వయసుమీద పడినా ఆయనలో రచనాపటిమా ,పరిశీలనా దృష్టీ తగ్గలేదని నిజంగా’’ లయన్’’ గా నే ఉన్నారని ఈ పుస్తకం రుజువు చేసింది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-22-ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.