పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం )

పద్మ భూషణ్ తారా శంకర్ బంధ్యోపాధ్యాయ-9(చివరిభాగం )

తారాశంకర్ రాసిన ‘’నాగిని కన్యార్ కాహిని ‘’-నాగకన్య కథ అందరూమెచ్చినది .ఆయన ఆరోగ్య నికేతన్ నవలపై చర్చోపచర్చలు చాలా జరిగాయి .భారతీయ తత్వాన్ని ప్రతిబింబించే నవల ఇది .టాగూర్ తర్వాత వచన సాహిత్యంలో గోప్పస్థానం తారాశంకర్ దే.1930లో ఉత్తమ నవలారచయితగా పేరుపొందాడు .బిభూతి భూషణ్ ప్రతిభ నభూతో నభవిష్యతి .ఈయన ఏ రచయిత ప్రభావానికి లోనుకాని అరుదైన రచయిత .తారాశంకర్ సంప్రదాయబద్ధుడైన రచయిత .ఆయన ఎన్నుకొన్న ఇతి వృత్తాలే ఆయనకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టాయి .తనకు బాగా తెలిసిన పల్లె సీమలనే ఆయన రాశాడు .వంగదేశంలో ఉత్తమ రచనలన్నీ గ్రామ సీమలకు చెందినవే .ఆయనది నిర్మోహమాటమైన కథాకథనం .భాషలో రామణీయకత ,పదును ఉంటాయి .ఆయన తన ప్రత్యక్ష అనుభావాలకుదూరంగా వెళ్లి రాసినవి ఆకట్టుకోలేకపోయాయి .వంగసీమ సాహిత్యకారులలో నిజమైన భారతీయత ఉన్న కొద్దిమందిలో ఆయన ఒకడు .అణువణువునా భారతీయత తొణికిసలాడే నూతనతర రచయితలుఆవిర్భవిస్తె, తారాశంకర్ బంధ్యోపాధ్యాయ కృషికి సంపూర్ణ సార్ధకత లభిస్తుంది .

తారాశంకర్ బందోపాధ్యాయ (23 జూలై 1898[1] – 14 సెప్టెంబర్ 1971) ప్రముఖ వంగ నవలా రచయిత. ఈయన 65 నవలలు, 53 కథా సంకలనాలు, 12 నాటకాలు, 4 వ్యాస సంకలనాలు, 4 ఆత్మకథలు, 2 యాత్రా వర్ణనలు వ్రాశాడు. ఇతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన రబీంద్ర పురస్కార్, సాహిత్య అకాడెమీ పురస్కారం, జ్ఞానపీఠంతో పాటుగా పద్మభూషణ్ కూడా అందుకున్నాడు.

జాతీయోద్యమ సమయంలో ఆయన బీర్బూం స్థానిక కాంగ్రెస్ నాయకుడిగా పరిగణింపబడ్డారు.ఈ సందర్భంలో విదేశీ ప్రభుతవ ఆగ్రహకోపాలకు లోనయినారు. అందుఫలితంగా 1930లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనటం ఇతడు వలన జైలుకు వెళ్ళవలసి వచ్చింది. అయితే సంవత్సర కాలం తరువాత విడుదలయ్యాడు. ఆ తరువాత ఇతడు పూర్తి స్థాయిలో సాహిత్యాన్ని వృత్తిగా చేపట్టాలనుకున్నాడు[3] . 1932లో రవీంద్రనాథ్ ఠాగూరుని శాంతినికేతన్ వద్ద మొదటి సారి కలిశాడు. ఇదే సంవత్సరంలో బందోపాధ్యాయ మొదటి నవల చైతాలి ఘుర్నీ వెలువడింది (వేసవి గాలిదుమారం) [2] దీనిలో ఆయన సృజన ఉత్తమ రచనా లక్షణాలు ఈ నవలలో కనిపిస్తాయి.

1940లో ఇతడు తన కుటుంబాన్ని కలకత్తాలోని బాగ్బజార్‌కు మార్చాడు. 1941లో ఇతడు బారానగర్‌కు మకాం మారాడు. 1942లో బీర్భూం జిల్లా సాహిత్య సదస్సును నిర్వహిస్తూ, కలకత్తా ఫాసిస్ట్-విరుద్ధ రచయితల, కళాకారుల సంఘానికి అధ్యక్షుడయ్యాడు. 1944లో కాన్పుర్ బెంగాలీ సాహిత్య కాన్ఫరెన్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1947లో ఇతడు ప్రవాసి వంగ సాహిత్య సమ్మేళనాన్ని కలకత్తా ప్రారంభించాడు. బొంబాయిలో జరిగిన ప్రవాసి వంగ సాహిత్య సమ్మేళనం రజతోత్సవానికి అధ్యక్షత వహించాడు. 1948లో కలకత్తా యూనివర్సిటీ ఇతనికి శరత్ స్మారక పతకం ప్రదానం చేసింది[2]. సాహిత్యంలో అకలుషితమైన, సహజమైన గ్రామసీమల సొగసును మునుపెన్నడూ లేని మౌలికతతో చిత్రించడానికి, సజీవమైనదాని కోసం, కొత్తదనం కోసం తహతహలాడే దేశవ్యాప్త ప్రజానీకానికి ఆసొగసును ఇంటింటికీ అందజేయటానికి తారాశంకర్ విస్తృతభూములు, వాని సంప్రదాయాలు, ప్రజల ఇతివృత్తాలను గాఢమైన ప్రేమతో చిత్రించటం ప్రారంభించారు.హసూల్ బకేర్ ఉపకధా , నాగినీ క్న్యార్ కహానీ అనే నవలలో ఆయన ఉపేక్షిత ప్రాంతాలను, నీల సఊందర్యాన్నీ, అడవి పూవులను, నాగరికతా విహీనమైన మానవదేహ సుగంధాన్నీ, నిర్మానుష్య, నిర్జనభూముల సొగసును, ప్రాచీనమైన మతాచారాలను, కొత్తవిధంగా వాస్తవ జీవితానికి తెచ్చారు.

1952లో ఇతడు పశ్చిమ బెంగాల్ శాసనమండలికి నామినేట్ చేయబడ్డాడు. 1952-60ల మధ్య ఇతడు పశ్చిమ బెంగాల్ విధాన పరిషత్తు (శాసన మండలి) సభ్యునిగా కొనసాగాడు. 1955లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇతనికి ఆ రాష్ట్రపు అత్యున్నత సాహిత్య పురస్కారమైన రవీంద్ర పురస్కారాన్ని అందజేసింది. 1956లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఇతడిని వరించింది. 1957లో ఇతడు ఆఫ్రో – ఆసియన్ రచయితల సంఘపు సన్నాహక కమిటీ సభ్యుడిగా సోవియట్ యూనియన్ దేశంలో పర్యటించాడు. తరువాత చైనా ప్రభుత్వం ఆహ్వానంపై భారతీయ రచయితల ప్రతినిధి వర్గ సభ్యుడిగా తాష్కెంట్ పర్యటించాడు[2].

1959లో ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయం నుండి జగత్తరణి స్వర్ణపతకం పొందాడు. మద్రాసులో జరిగిన అఖిల భారత రచయితల సదస్సుకు అధ్యక్షత వహించాడు. 1960లో పశ్చిమ బెంగాల్ విధాన పరిషత్తులో సభ్యత్వం ముగిసిన తర్వాత రాజ్యసభకు భారత రాష్ట్రపతిచే నామినేట్ చేయబడి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగాడు. 1962లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1963లో శిశిర్‌కుమార్ పురస్కారాన్ని చేజిక్కించుకున్నాడు. 1966లో నాగపూర్‌లో జరిగిన బెంగాలీ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. అదే సంవత్సరం భారత అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠంను గెలుచుకున్నాడు. 1969లో ఇతనికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. 1970లో వంగీయ సాహిత్యపరిషత్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఇతనికి కలకతా విశ్వవిద్యాలయం, జాధవ్‌పూర్ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించాయి. ఇతడు విశ్వభారతి విశ్వవిద్యాలయం, కలకతా విశ్వవిద్యాలయాలలో స్మారకోపన్యాసాలు చేశాడు[2].

ఇతడు 1916వ సంవత్సరంలో ఉమాశశీదేవిని వివాహం చేసుకున్నాడు. ఇతనికి సనత్‌కుమార్ బందోపాధ్యాయ, సరిత్‌కుమార్ బందోపాధ్యాయ అనే ఇద్దరు కుమారులు, గంగ, బులు, బని అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు[2].

ఆయనలోని ఆశ్చర్యకరమైన సర్జనశక్తి 70ఏండ్ల వార్దక్యంలోను తొణికిసలాడింది.ఆయన యత్రంలాగా పనిచేసి పలు రచనలు చేసారు.నాటకకర్తగా కూడా ఆయన విశేష కీర్తినిగాంచారు. అవి అప్పట్లో కలకత్తా నాటకరంగాలలో నిరంతరం ప్రదర్సించబడేవి. ఆయన రచన కవి మూలాధారంగా తీసిన సినిమా బహుప్రజాకర్షణ పొందింది.

అమృత అనే వారపత్రికలో ఆయన వ్రాసిన వ్యక్తి స్వభావచిత్రణలు మానవుని నాగరికత అస్తవ్యస్తతను తెలుపుతూ గీసారు.

బందోపాధ్యాయ తన స్వగృహంలో 1971 సెప్టెంబర్ 14న కన్నుమూసాడు. ఉత్తర కలకత్తాలోని నింతలా శ్మశానవాటికలో ఇతని అంతిమసంస్కారాలు జరిగాయి[2].

అవార్డులు
1955 – ఆరోగ్య నికేతన్ అనే నవలకు రవీంద్ర పురస్కారం 1956 – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1966 -గణదేవత నవలకు జ్ఞానపీఠ పురస్కారం.[4] 1962 – పద్మశ్రీ పురస్కారం 1969 – పద్మభూషణ్ పురస్కారం[5] 1948 – శరత్ స్మృతి పురస్కారం 1959 – కలకత్తా విశ్వవిద్యాలయంచేజగత్తరణి స్వర్ణపతకం

రచనలు]
ఇతడు అనేక నవలలను, కథలను రచించాడు. ఇతని కథలు బంగశ్రీ, ప్రబాసి పత్రికలలో ఎక్కువగా ప్రచురింపబడ్డాయి.[6]

ఇతని రచనల జాబితా

కవిత్వం
· త్రిపాత్ర (1926)

నవలలు
· చైతాలి ఘుర్ని (1928)

· పషన్‌పురి (1933)

· నీలకంఠ (1933)

· రాయ్‌కమల్ (1935)

· ప్రేమ్‌ ఓ ప్రయోజన్ (1936)

· ఆగన్ (1938)

· ధాత్రిదేవత (1939)

· కాళింది (1940)

· గణదేవత (1943) – మద్దిపట్ల సూరి తెలుగులో అనువదించాడు.

· పంచగ్రామ్‌ (1944)

· మన్వంతర్ (1944)

· కవి (1944)

· బింగ్‌షో శతాబ్ది (1945)

· సాందీపన్ పాఠశాల (1946)

· ఝర్ ఓ ఝరాపాత (1946)

· అభిజన్ (1946)

· ఛోటోదర్ సాందీపన్ పాఠశాల (1948)

· పాదచిహ్న (1950)

· ఉత్తరాయణ్ (1950) – ఇది రెండవ ప్రపంచయుద్ధం యొక్క దారుణఫలితాలను చిత్రీకరించిన విషాదాంత నవల. మద్దిపట్ల సూరి తెలుగులోనికి అనువదించాడు.

· హంసులి బ్యాంకర్ ఉపకథ (1951)

· తమస్ తపస్య (1952)

· నాగిని కన్యార్ కహిని (1952)

· ఆరోగ్య నికేతన్ (1953)

· చంపదంగర్ బవ్ (1954)

· పంచపుత్తలి (1956)

· బిచారక్ (1957)

· సప్తపది (1958)

· బిపాష (1959)

· రాధ (1959)

· మనుషెర్ మాన్ (1959)

· డాక్ హర్కరా (1959)

· మహాశ్వేత (1961)

· యోగభ్రష్ట (1961)

· నా (1961)

· నాగరిక్ (1961)

· నిషిపద్మ (1962)

· యతిభంగ (1962)

· కన్నా (1962)

· కల్‌బాయిశాఖి (1963)

· ఏక్‌తి చరువై పాఖీ ఓ కలో మేయె

కథా సంపుటాలు
· చలనమొయి (1937)

· జల్‌సాగర్ (1938) – మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించాడు

· రాసకేళి (1939)

· తీన్ శూన్యొ (1942)

· ప్రతిధ్వని (1943)

· బెదెని (1943)

· ఢిల్లీ కా లడ్డు (1943)

· జాదూకారి (1944)

· స్థలపద్మ (1944)

· తెరొషొ పొంచాష్ (1944)

· ప్రసాద్‌మాల (1945)

· హరనో శూర్ (1945)

· ఇమారత్ (1947)

· రామ్‌ధను (1947)

· తారాశంకరెర్ శ్రేష్ఠ గల్ప (1947)

· శ్రీ పంచమి (1948)

· కామధేను (1949)

· తారాశంకర్ బందోపాధ్యాయయెర్ శ్రేష్ఠ గల్ప (1950)

· మాతి (1950)

· శిలాసన్ (1952)

· తారాశంకర్ బందోపాధ్యాయయెర్ ప్రియొ గల్పొ (1953)

· స్వ-నిర్బచితొ గల్పొ (1954)

· గల్ప-సంచయన్ (1955)

· బిస్ఫోరణ్ (1955)

· ఛోటోదర్ శ్రేష్ఠ గల్ప (1956)

· కాలాంతర్ (1956)

· బిష్పథర్ (1957)

· రబిబరెర్ ఆసర్ (1959)

· ప్రేమెర్ గల్ప (1961)

· పౌష్ – లక్ష్మి (1961)

· అలోకభిసర్

· చిరంతని (1962)

· ఆక్సిడెంట్ (1962)

· ఛోటోదర్ భలొ భలొ గల్పొ (1962)

· తమాషా (1963)

· గల్పొ పంచషట్ (1963)

· ఆయెన (1963)

· చిన్మయి (1964)

· ఏక్తి ప్రేమెర్ గల్పొ (1965)

· కిశోర్ సంచయన్ (1966)

· తపోభంగ

· దీపర్ ప్రేమ్ (1966)

· నారి రహస్యమయి (1967)

· పంచకన్య (1967)

· శిబనిర్ అదృష్ట (1967)

· గోబిన్ సింఘెర్ ఘోర (1968)

· జయ (1968)

· ఏక్ పష్ల బ్రిష్టి (1969)

· ఛోటోదర్ శ్రేష్ఠ గల్పొ (1969)

· మిచిల్ (1969)

· ఉనిష్ షో ఎకత్తర్ (1971)

నాటకాలు
· కాళింది (1942)

· దుయ్‌పురుష్ (1943)

· పథెర్ డాక్ (1943)

· ద్వీపాంతర్ (1945)

· యుగబిప్లబ్ (1951)

· కవి (1957)

· కాళరాత్రి (1957)

· సంఘట్ (1962)

· ఆరోగ్య నికేతన్ (1968)

ప్రహసనాలు
· చక్‌మకి (1945)

చరిత్ర గ్రంథాలు
· అమర్ కలేర్ కథ (1951)

· బిచిత్రొ స్మృతికహిని (1953)

· అమర్ సాహిత్య జీబన్, సంపుటం. I (1953)

· కొయిషొర్ స్మృతి (1956)

· అమర్ సాహిత్య జీబన్, సంపుటం. II (1962)

యాత్రాచరిత్రలు
· మాస్కో – తె – కోయెక్ దిన్ (1959)

వ్యాసాలు[మార్చు]
· సాహిత్యేర్ సత్య (1961)

· భరత్‌బర్ష ఓ చిన్ (1963)

· రబీంద్రనాథ్ ఓ బంగ్లర్ పాళి (1971)

సంకలనాలు[మార్చు]
· రచనా సంగ్రహ మొదటి భాగం (1959)

· రచనాబళి 25 భాగాలు

· గల్పగుచ్ఛ 3 భాగాలు

సినిమా రంగం]
ఇతని రచనల ఆధారంగా బెంగాలీ భాషలో బెదెని, అంతర్‌మహల్, జీవన్ మషాయ్, అగ్రదని, ఆంచల్, గణదేవత, దుయ్ పురుష్, హార్ మానా హార్, బిపాషా, హంసులి బాంకర్ ఉపకథ, సప్తపది, బిచారక్, జల్‌సాగర్, రాయ్‌కమల్, కవి మొదలైన సినిమాలు వెలువడ్డాయి. ఇతడు ఆమ్రపాలి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. గణదేవత, రాయ్‌కమల్ సినిమాలకు పాటలు కూడా రచించాడు.

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.