రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు
1-కళంకారీకి అలంకారం తెచ్చిన తులసీ సమ్మాన్ గ్రహీత ,శిల్ప గురు ,పద్మశ్రీ-శ్రీ జొన్నల గడ్డ గురప్ప శెట్టి
జొన్నలగడ్డ గురప్పశెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన కళాకారుడు. ఇతడు 14 మార్చి 1937 న శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా లో జన్మించారు ఇతడు మెట్రిక్యులేషన్, ఉపాధ్యాయశిక్షణలో (టి టి సి) ఉత్తీర్ణులు అయ్యారు.
గుర్తింపులు :
· 1976 కలంకారీ కళకు గాను భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారము తోనూ, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
· 2002వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర్ప ప్రభుత్వంచే తులసీ సమ్మాన్ పురస్కారము తో సత్కరించబడ్డారు.
· కలంకారీ కళకి ఆయన చేసిన విశిష్ఠసేవలకి గానూ ఆయనకి శిల్పగురు బిరుదు వరించింది.
2-తంజావూర్ శైలి చిత్రకారుడు ,శిల్ప గురు ,పద్మశ్రీ –శ్రీ పన్నూరు శ్రీపతి
పన్నూరు శ్రీపతి : చిత్రకళారంగంలో ప్రముఖ పేరు, చిత్రకళోపాధ్యాయునిగా చిరపరిచితుడు, ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డు అయినాడు. రెండు చేతులతో చిత్రించడం ఇతని ప్రత్యేకత, శిల్పకళాకారునిగా మంచిపేరు గలదు. పలుభాషలలో వ్రాయగల దిట్ట. హైదరాబాదు లోని తెలుగు లలిత కళాతోరణంలో సభ్యుడు కూడానూ.
సత్కారాలు
· పద్మశ్రీ : ఇతని కళా తపస్సును గుర్తించి భారత ప్రభుత్వం 2007 సంవత్సరంలో పద్మశ్రీ గౌరవంతో సత్కరించింది.
· శిల్పగురు : భారత ప్రభుత్వం ఇతనికి 2008 శిల్పగురు అవార్డు ప్రదానం చేసింది.[1]
ఇతని శిష్యగణం కూడా కళారంగంలో రాణిస్తోంది.
3-మహాదాత శ్రీ బుడ్డా వెంగళరెడ్డి
మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి 1900 డిసెంబరు 31న శివసాయుజ్యాన్ని పొందాడు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.
శ్రీవెంగళరెడ్డిగారి గురించిన ఐతిహ్యం
ఒక పేదబ్రాహ్మణుడు వెంగళరెడ్డిని తన యింటిలో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తంగా ఏదైనా ద్రవ్యసహాయం చేయమని అర్థించాడు. రెడ్డిగారు అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇచ్చారు. అది చిన్నమొత్తం. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి రెడ్డిగారు అర్థితో, “అయ్యా, మీ ప్రాప్తం అంతే ఉన్నది” అన్నారు. కానీ బ్రాహ్మణుడికి నమ్మకం కలుగలేదు. అప్పుడు రెడ్డిగారు తన కోడలిని పిలచి ఒక చేటలో బియ్యమూ, దానిలో గూడంగా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన నోటుతో పాటు మరొక వందనోటును కూడా ఉంచి తీసుకొని రమ్మన్నారు. అలా ఆవిడ తెచ్చిన పిదప, బ్రాహ్మణోత్తముడు స్వయంగా చేయిపెట్టి బియ్యపుచేటలోనుండి తీసుకొంటే మొదట రెడ్డిగారు ఇచ్చిన నోటే తిరిగి లభించింది. తదుపరి, రెడ్డిగారు రెండవనోటుని బియ్యపుచేటనుండి ఆ బ్రాహ్మణుడికి వెలికి తీసి చూపి, తన వాక్యం సత్యం అని ఋజువు చూపారట.
· ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి గురించి నాకు తెలిసిన పూర్వీకులు చెప్పిన మాటలు చివరి దాన ధర్మములు.
· ఒకానొక రోజు ఒక నిరుపేద బ్రాహ్మణుడు దూర ప్రాంతం నుండి తన కూతురి వివాహం కోసం కొంత డబ్బులు అవసరం పడ్డాయి అంటా, అప్పుడు దానకర్ణుడు మన బుడ్డా వెంగళరెడ్డి గురించి ఎవరో చెబుతుంటే విన్నారంటా, విని ఆయనను కలిసి తన బాధ తెలిపి ఆయనను దానం చేయమని అడగాలని నిశ్చయించుకున్నారు. పూర్వం బైకులు, కార్లు, మరియు ఏ ఇతర సౌకర్యాలు లేవు. ఆయన కాలినడకన వచ్చి తన బాధ చెప్పుకుని తనకు కొంత డబ్బులు సహాయం చేయమని చాలా బాధపడుతూ విన్నవించాడు ఆ నిరుపేద బ్రాహ్మణుడు. అప్పుడు మీ కూతురి వివాహానికి సంబంధించిన ఖర్చులు మొత్తం డబ్బులు నీకు సహాయం చేస్తాను అని బ్రాహ్మణుడికి మాట ఇచ్చి ఫలానా రోజు రమ్మని సెలవిచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి ఆ దేవుడు తనువు చాలించారు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆ బ్రాహ్మణుడు కూతురి వివాహం నిశ్చయించుకున్నారు, ఆ నిరుపేద బ్రాహ్మణుడు కాలినడకన నడుస్తూ ఆ ఉయ్యాలవాడ గ్రామ సమీపానికి చేరుకున్నాడు, ఆ దారి మద్యలో ఆ దైవ స్వరుపుడూ ప్రత్యక్షం అయ్యాడు.
అప్పుడు ఏం స్వామి చాలా రోజులు తర్వాత వస్తున్నావు అని ఆ నిరుపేద బ్రాహ్మణుడిని అడిగారు , అప్పుడు ఆ బ్రాహ్మణుడు కొద్దిగా వివాహానికి ఆటంకాలు ఎదురై ఆలస్యం అయ్యింది అయ్యా గారు అని జరిగినా విషయం తెలియజేశారు. సరేలే నీ డబ్బులు ఫలానా గదిలో మూటకట్టి దంతెల మద్యలో ఉంచాను , మా కుటుంబ సభ్యులకు నేను చెప్పినాను అని చెప్పండి మీ కోసం దాచినా డబ్బులు మీకు ఇస్తారు మీరు జాగ్రత్తగా తీసుకెళ్లి సంతోషంగా మీ కుమార్తె వివాహం జరిపించండి అని తెలియజేస్తారు , ఆ దేవ దేవుడు బుడ్డా వెంగళరెడ్డి గారు.
ఆ బ్రాహ్మణుడికి ఆయన పరమాత్మను చేరుకున్న విషయం తెలియదు. బుడ్డా వెంగళరెడ్డి ఆస్థానంకు ( నివాసం ), వెళ్ళి దారి మద్యలో ఎదురై ఈ విధంగా చెప్పారు, మా కుటుంబ సభ్యులను అడగండి మీ డబ్బులు ఇస్తారు అని చెప్పారని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెబుతాడు ఆ బ్రాహ్మణుడు, ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పిండడు,కాని దారిలో ఆయన చివరి దాన ధర్మం విజయవంతం కావాలి, ఆ బ్రాహ్మణుడికి ఫలితం దక్కాలని ఆయన కైలాసం నుండి బ్రాహ్మణుడి కోసం భువి కి, దిగివస్తాడు ఆ దేవుడు. జరిగిన సన్నివేశం ఒక మిస్టరీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు డబ్బులు లేవు ఏం లేవు మాకు పోయేటప్పుడు మాకు చెప్పలేదు ,నీ మాటలు మేము నమ్మమము అని బదులిస్తారు. ఆ బ్రాహ్మణుడు చాలా బాధ పడుతూ కన్నీరు మున్నీరుగా తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు నేను ఇంటికి తీసుకెళ్ళక పోతే, మా కూతురి వివాహం ఆగిపోతుంది అని చాలా చాలా రోదిస్తాడు, అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పెది నిజమేనని భావించి మళ్ళీ ఒకసారి ఆయనను అడిగి విషయం తెలుసుకోని ఆ గదిలోకి వెళ్ళి ఫలానా దంతెను తొలగించి చూస్తారు, ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఒక మూటలో భద్రపరిచిన డబ్బులు కనిపిస్తాయి, వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిచి బాధపడకు అని సానుభూతి తెలియజేసి అ డబ్బును అ బ్రాహ్మణుడికి అందజేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాకోసం ఆ పరమాత్మ స్వరూపుడైన బుడ్డా వెంగళరెడ్డి గారు నా కోసం అదేపనిగా వచ్చి నాకు దర్శన భాగ్యం కల్పించడూ అని చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.
అలా ఆ దానకర్ణుడు ఇచ్చిన మాట కోసం తన ఆయన కోసం దాచిపెట్టిన దానం వృథా కాకుండా ఆ బ్రాహ్మణుడి కోసం భూవికి వచ్చి తన మాటను నిలబెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాకు తెలిసి ఈ కలియుగం ఉన్నంతకాలం మన హృదయాలలో ఎప్పటికీ ఆ దైవ స్వరుపుడూ చిరకాలం కలకాలం బ్రతికే ఉంటారు.
· ఆయనను తలుచుకోని దానధర్మాలు చేస్తే చాలు ఆయన ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మనకు లభిస్తాయి.
4-ఆంధ్రా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి –శ్రీ చల్లా కొండయ్య
చల్లా కొండయ్య (Challa Kondaiah) (జ. జూలై 4, 1918 – ?) ప్రముఖ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.[1]
వీరు అనంతపురం జిల్లాలోని చల్లావారిపల్లె గ్రామంలో చల్లా వెంకట కొండయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1918 సంవత్సరంలో జన్మించారు. వీరు తాడిపత్రిలో మెట్రిక్యులేషన్, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, చెన్నై లా కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. చెన్నైలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితికి ప్రధాన కార్యదర్శిగా కృషిచేశారు.
1944లో న్యాయవాదిగా నమోదుచేసుకొని కోకా సుబ్బారావు గారి వద్ద జూనియర్ గా చేరారు. 1948 నుండి సొంత ప్రాక్టీసు మొదలుపెట్టారు. చెన్నై, గుంటూరు, హైదరాబాదు పట్టణాలలో తమ వృత్తిని నిర్వహిస్తూ వచ్చారు. 1958లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖలో స్టాండింగ్ కౌన్సిల్ గా ఎనిమిది సంవత్సరాలు తమ విధి నిర్వహించారు.
1967లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 1976లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడి, 1977లో తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు. వీరు మార్చి 1979 నుండి జూలై 1980 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి కాలంలో అనేక విజయాలు సాధించారు:
· హౌసింగ్ బార్డు జడ్జిమెంట్ ఆర్టికల్ 226 ని 151 ఐ.పి.సి.తో కొట్టేసి విజయం సాధించారు.
· భారత ఎమర్జన్సీ కాలంలో అక్రమ కేసులను కొట్టేయించారు.
· 12 కోట్ల నిజాం నగల కేసు విషయంలో మార్గదర్శక సూత్రాలను సూచించారు.
· అర్బన్ లాండ్ సీలింగ్ ఛైర్మన్ గా ఆస్తుల పరిరక్షణకు న్యాయపరంగా సహాయం చేశారు.
· వీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఛైర్మన్ గా ఉండి దేవాలయాలలో వారసత్వం హక్కును తీసేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి ఆధ్వర్యాన జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ను నియమించింది. దేవాలయాల ఆస్తుల నిర్వహణపై ప్రభుత్వానికి పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. దీని ఆధారంగా ప్రభుత్వం 1987 లో దేవాదాయ చట్టాన్ని చేసింది.[2]
· తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నిత్యాన్నదాన పథకాన్ని అమలుచేశారు.
· అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్సులోని ఆడిటోరియాన్ని ఇతని పేరుమీద జస్టిస్ చల్లా కొండయ్య ఆడిటోరియం గా నామకరణం చేశారు.[3]
5-పౌర మానవ హక్కుల ఉద్యమనేత –శ్రీ కె.బాలగోపాల్
కె. బాలగోపాల్ స్వస్థలం: అనంతపురం జిల్లాలోని కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం. మాతామహుడు: ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మఈటీవీ2లో చాలాకాలం తెలుగువెలుగు కార్యక్రమానికి నిర్వాహకురాలిగా పనిచేసిన మృణాళిని ఈయన చెల్లెలు.
జీవితచరిత్ర
విద్యాభ్యాసం: ఒకటి నుంచి డిగ్రీ వరకు తిరుపతిలో. ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి, వరంగల్‌లోని ఆర్ఈసీ నుంచి గణితంలో పీహెచ్‌డీ, 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉద్యోగంలో చేరిక, 1985లో ఉద్యోగానికి రాజీనామా, అప్పటినుంచి హక్కుల ఉద్యమానికే పూర్తిగా అంకితం అయ్యారు. మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి సలిపిన ప్రముఖ హక్కుల నేత, న్యాయవాది, హేతువాది మేధావి. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రియాకాలనీలో నివసించారు. ఆయన భార్య వసంత లక్ష్మి ఆంధ్రజ్యోతి పత్రికలో పాత్రికేయురాలు. కుమారుడు ప్రభాత్. బాలగోపాల్ దీర్ఘకాలంగా అల్సర్‌తో బాధపడ్డారు. 8.10.2009 గురువారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.
హక్కుల ఉద్యమ రంగం
పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన బాలగోపాల్ జీవితాంతం ఉద్యమంలో కొనసాగారు. గణితశాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన మానవతా విలువలకోసం పోరాడారు. ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకుపోయిన నాయకుడాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లను వెలుగులోకి తేవడంతో పోలీసులు ఆయనపై నక్సలైట్‌గా ముద్రవేశారు. కొత్తగూడెంలో ఓసారి ఆయనపై దాడికి పాల్పడిన పోలీసులు చనిపోయాడని భావించి మురికికాల్వలో పడేసి వెళ్లగా పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆయన్ను కాపాడారు.
పౌరహక్కుల నుంచి మానవహక్కుల వైపు
రాజ్యహింసతోపాటు ప్రైవేటుహింసను ఆయన వ్యతిరేకించాడు. పౌరహక్కుల సంఘం నుంచి ఆయన 1996లో విభేదించి బయటకొచ్చి మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ను ఏర్పాటుచేశారు. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసీ నక్సలైట్లు రాజ్యహింసకు వ్యతిరేకంగా హింసా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఆయన ఖండించారు. రాజ్యహింసతో పాటు ప్రజలపై గుండాలు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిస్టులు చేసే హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించారు. మార్క్సిజం నుంచి ఆయన పక్కకు పోవడంపై అప్పట్లో రచయిత్రి రంగనాయకమ్మ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ పుస్తకం రాశారు. నక్సల్బరీ ఉద్యమానికి ఎంతోమంది కార్యకర్తలను అందించిన ఆయన ఆ తర్వాత క్రమంలో విప్లవపార్టీల వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు చేరువకావడంలో ఎం.ఎల్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆయన రాసిన ‘నక్సల్బరీ ఉద్యమం, గమ్యం, గమనం’, ‘చీకటి కోణం’ పుస్తకాలు సంచలనం సృష్టించాయి.
ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టని పల్లె లేదు, పట్టణం లేదు. అరణ్యాల నుంచి జనారణ్యాల వరకూ ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయనతప్పనిసరిగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం చేసేవారు. అందుకే మన భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై ఆయనకున్న జ్ఞానం అపారం. కాలుష్యం, విద్యా వ్యాపారం, సెజ్‌లు, నిర్వాసితులు, మురికివాడలు, కాశ్మీర్ సంక్షోభం, మైనారిటీ హక్కులు, మహిళా హక్కులు, విద్యార్థి హక్కులు, సంప్రదాయ వృత్తులు, అణుపరిజ్ఞానం, గిరిజనుల ఆనారోగ్యం.. ఇలా మన రాష్ట్రం, దేశం ఎదర్కొంటున్న ఏ సమస్యపైన అయినా ఆయన లోతైన అవగాహన కనబరుస్తూ మాట్లాడేవారు.
మేధోశక్తి, వ్యక్తిత్వం
26-27 సంవత్సరాలకే గణితశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన అసమాన ప్రతిభా సంపన్నుడు. చదివింది గణితశాస్త్రం అయినా.. సామాజిక శాస్త్రాలు, పౌరహక్కులు, చరిత్ర, సాహిత్యం, రాజ్యాంగం.. ఇలా భిన్నరంగాల్లో లోతైన అవగాహన గల మేథావి. నిరాడంబరుడు. సామాజిక పరిస్థితుల అధ్యయనంలో భాగంగా వందలాది కిలో మీటర్లు సైకిల్‌పై ప్రయాణించారు. విఖ్యాత రాజనీతిజ్ఞుడైన బెర్ట్రాండ్ రస్సెల్ దార్శనికత స్ఫూర్తిగా ప్రతి సామాజిక సంక్షోభంలోనూ ప్రజల తరఫున నిలబడటానికి ప్రయత్నించారు. ఎన్నో చరిత్ర గ్రంథాలను, డీడీ కోశాంబి వంటి తత్వవేత్తలను తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూ పుస్తకాలు రాశారు. హైకోర్టులో పేదలు, కార్మికులు, నిర్వాసితుల వంటి బాధితుల పక్షానే వాదించారు. నేల, నీరు, అడవులు వంటి ప్రకృతి సంపదను కోట్లాది మంది జీవనోపాధికి ఉపయోగించాలి. సెజ్‌లు వంటి అభివృద్ధి పథకాల పేరుతో ప్రభుత్వం స్థానిక ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తోందని, వారి జీవనోపాధికి విఘాతం కలిగిస్తోందని నిర్భయంగా చెప్పే వాడు. ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.
రచనలు
· దళిత
· నిగాహ్
· మతతత్వం పై బాలగొపాల్
· రాజ్యం సంక్షేమం
· సాహిత్యం పై బాలగొపాల్
· హక్కుల ఉద్యమం
· ముస్లిం ఐడెంటిటీ : హిందుత్వ రాజకీయాలు
· కల్లొల లోయ
· జల పాఠాలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-22-ఉయ్యూరు