41- ప్రత్యుక్తి (రిపార్టీ-2
ఒకాయన డాక్టర్ దగ్గరకు వెళ్లగా అక్కడి పధ్ధతి నచ్చక డాక్టర్ పై ‘’ఏమయ్యా నువ్వు గొడ్ల డాక్టర్ వటగా ‘’అన్నాడు ఒక విసురు విసరాలని. ఆయన తక్కువవాడా ‘’అవునుకానీ,నీ జబ్బేమిటో చెప్పు .’’అన్నాడు పరమ ప్రశాంతంగా .’.మునిమానిక్యంగారు తనస్వంత అనుభవం ఒకటి చెప్పారు .’’నేను స్కౌట్ ట్రెయినింగ్ కు వెళ్లాను రావాల్సిన మాస్టర్లు ఇంకా రాలేదు .నాకంటే ముందుగా ఒక్కడ౦టే ఒక్కడే వచ్చాడు. ఆయన ఆస్కూల్ హెచ్ ఎం .ఆయనే ఆచంటసత్యనారాయణ .ఆయనే ముందు నన్ను పలకరించి తన ఊరుపేరూ వగైరా చెప్పాడు .’’నువ్వు ఎవరివిరా అబ్బాయీ ‘’అన్నాడు పుచ్చా పూర్ణా నందం గారిలాగా .’’నేను ‘’నా పేరు మునిమాణిక్యం నరసింహారావు ‘’ఆమాటకు బోల్డు ఆశ్చర్యపోయి వెనక్కి విరుచుకొని ‘’ఆ ! ఆ !అంటే నువ్వు ఆ కథలు గట్రా రాసేవాడివా ?’’అంటే అవునని ఒప్పెసుకొన్నాను .ఆయన కాసేపు గుడ్లు మిటకరించి చూస్తూ ‘’అయితే నువ్వు వాడి వే నన్నమాట .నీ కథలు చదివి నువ్వు ఎంతగొప్పవాడివో అనుకొన్నాను .ఓరి నీ దుంప తెగ నువ్వు వాడివేట్రా ?ఇట్లా అఘోరించావెం ?’’అన్నాడు .’’ఎట్లా ఉన్నాను ?’’అన్నాను .అమాయకం ఉట్టి పడుతూ .ఆయన నన్నో వింత మృగాన్ని చూసినట్లు చూసి ‘’ఎట్లా ఉన్నావా ?వెర్రి వెధవాయిలాఉన్నావు ‘’అన్నాడు .నాకు కోపం రాలేదు ఆయన మాట్లాడే పద్ధతిలో, ఆకంఠస్వరం లో ఏదో మాధుర్యం ఉంది ప్రేమ ఆప్యాయత కనిపించాయి .కాసేపు నవ్వుకొని ఇద్దరం స్నేహితులయ్యాం .
ఆచంట సత్యనారాయణ గారు అంటే మేము ఉయ్యూరు హైస్కూల్ లో చదువుతున్నప్పుడు 1954-55లో మా హెడ్ మాస్టారి పేరు ఆచంట సత్యనారాయణ గారే .ఇలాగే మాట్లాడేవారు ఆయనే ఈయనేమో !అయినా ఇలాంటి వారు చాలామంది ఉండిఉంటారు .
ట్రెయినింగ్ వారం రోజులూ ఇద్దరూ కలిసే తిరిగారు ఆయన వట్టి వెర్రి వాడిలాగా ప్రవర్తించాడు అందరూ ఇళ్ళకు వెళ్ళే రోజు వచ్చింది అప్పుడు నేను ఆయనతో ‘’ఏమయ్యా !మొదటి రోజున నన్ను వెర్రి వెంగళప్పలా ఉన్నావని అన్నావు .ఈ వారంరోజుల్నుంచి చూస్తున్నాను నువ్వూ వెర్రి వెధవాయి వే’’అన్నాను .మాటకు మాట అప్ప చెప్పాకదా అని సంబర పడ్డాను .ఆయన నన్ను మళ్ళీ వెర్రివాడుగా చూస్తూ ‘’ఈ సంగతి కనిపెట్టటానికి వారం రోజులు పట్టిందిరా సన్నాసీ!అనిఅనగా నా గూబ గు౦యి మన్నట్లయింది .అయితేనేం ఈ శబ్ద వ్యాపారం పరమ మనోహరంగా ఉంది ‘’అన్నారు మాస్టారు .
రిపార్టీలు రెండు రకాలు. ఒకసారి మనది అండర్ హాండ్ అవుతుంది దీన్ని డేరగోటరి రిపార్టీ అంటారు .మరోసారి మనదే పై చేయి అవుతుంది అప్పుడు దాన్ని కా౦ప్లి మెంటరి రిపార్టీ అంటారని మాస్టారు భాష్యం చెప్పారు .దీనికీ తనే ఉదాహరణ అంటూ ‘’హెడ్ మాస్టర్ కావాలని నాకు మహా ఉబలాటంగా ఉండేది .ఒక ప్రకటన చూసి మంగళగిరి జిల్లా పరిషత్ కు ఇంటర్వ్యు కు వెళ్లాను .ఏదో నామమాత్రపు ఇంటర్వ్యు .తమవాడికెవడికో దాన్ని కట్టబెట్టాలని కమిటీ ఆల్రేడి ననిర్ణ యించిందట .రోట్లో తలపెట్టాగా ?.వెళ్లి కమిటీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నా ..అది వాళ్లకు అవిధేయతగా తోచింది. నన్ను ఏడిపించాలనుకొన్నారు పరిషత్ అధ్యక్షుడు ముఖం చిట్లించి ‘’ఆకథలూ కాకరకాయలు రాసేవాడివి నువ్వేనన్నమాట ‘’అన్నాడు అవును అన్నాను .’’కథలు గీకేవాడివి హెడ్ మాస్టర్ గా ఎలా పనికొస్తావ్ ‘’అన్నాడు .నేను తలవంచుకొని అతి వినయంగా ‘’మాస్టారు గా పనికి రానని నాకూ తెలుసు కనీసం హెడ్ మాస్టర్ గానైనా పనికొస్తానని –అనీ ‘’అంటూ నసిగాను .ఇందులోనాదే పైచెయ్యి అయింది చివరికి .వాళ్ళ అహం దెబ్బతిని షాక్ అయ్యారు ‘’వెళ్ళండి మీ సంగతి మాకెందుకు?’అంటే ,’’’నేనూ అదే అనుకొన్నాను’’అంటే .మీ సంగతి నాకూ తెలుసు ‘’అంటూ బయటికి వచ్చేశాను .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-10-22-ఉయ్యూరు .
వీక్షకులు
- 1,010,113 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.6వ భాగం.6.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు 6 వ భాగం.6.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.9 వ భాగం 6.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .5 వ భాగం.5.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (514)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు