రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2
6-గువ్వల చెన్న శతకకర్త –శ్రీ గువ్వల చెన్నుడు
సా.శ. 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక నీతిని, రీతిని పరిశీలించి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించాడు. వేమన వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నడు సాంఘిక దురాచారాలను, దుర్జన వృత్తిని నిశితంగా విమర్శించాడు. “ఇల వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటిరావు గువ్వల చెన్నా” అంటాడు. తెలుగు పద్యం గొప్పదనాన్ని ఇలా వివరిస్తాడు.
గుడి కూలును నుయి పూడును
వడి నీళ్ళన్ చెరువు తెగును, వనమును ఖిలమోన్
చెడనిది పద్యం బొకటియె
కుడి యెడమల కీర్తి గన్న గువ్వల చెన్నా!
కాలము
గువ్వల చెన్న శతక కర్తృత్వం గురించి, కవికాలాదుల గురించి చరిత్రలో నిర్థిష్టమైన అభిప్రాయం లేదు. శతక కవుల చరిత్రము రాసిన వంగూరి సుబ్బారావు అభిప్రాయం ప్రకారం ఈ శతకం 1600 ప్రాంతమువాడైన పట్టాభిరామ కవి కృతమని నిర్ణయించాడు. దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. శతక నామావళి ననుసరించి గువ్వల చెన్నడు ఈ శతకాన్ని రాసినట్లు ఊహించవచ్చును. శతకమునందు ఉదహరించబడిన పాశ్చాత్య సంస్కృతి తెలుగువారిపై దాని ప్రభావం పరిశీలించిన పిదప ఈ శతకం బహుశా 18వ శతాబ్దినాటిదని భావించవచ్చు.[
7-భారత దేశ రెండవ మహిళా చర్చి బిషప్ –రెవరెండ్ ఎగ్గోని పుష్పలత
రెవరెండ్ ఎగ్గోని పుష్పలత మహిళా బిషప్. నంద్యాల చర్చి బిషప్. పుష్పలలిత భారతదేశంలో చర్చి బిషప్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ[4].
పదవులు
ఐర్లాండ్ చర్చి బిషప్‌గా ఒక మహిళ రెవరెండ్ ప్యాట్రిక్ స్టోరేను నియమించిన తర్వాత రోజే పుష్పలలితను నంద్యాల చర్చి బిషప్ నియమించడం జరిగింది.సెప్టెంబర్ 30న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి బిషప్ జి. దేవకదాశం చేతులమీదుగా పుష్పలలిత బాధ్యతలు స్వీకరించారు[5] .
బాల్యం
.కర్నూలు జిల్లాలోని దిగువపాడు గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించింది[6] . నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్న ప్రొటెస్టంట్ మరియు కాథలిక్ మిషనరీల ప్రభావాన్ని ఆమె గుర్తించింది మరియు ఆమె అలాంటి జీవితాన్ని గడపాలని చాలా కోరుకుంది మరియు CSI ఆర్డర్ ఆఫ్ సిస్టర్స్‌లో సభ్యురాలైంది . పుష్పలలిత 1984లో క్రైస్తవ మత గురువుగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలోని పలు చర్చి సమాజాలకు పుష్పలలిత ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. 2005 నుంచి రెండేళ్లపాటు నంద్యాల చర్చి ప్రాంతీయ పరిధిలో కోశాధికారిగా కూడా ఆమె విధులు నిర్వహించారు. 400 గ్రామాల్లోని ప్రజలకు విద్యా, ఆరోగ్య విషయాలపై అవగాహన కలిగించారు. దేశంలో రెండో బిషప్‌గా పుష్పలలిత నియామకం కాగా మొదటగా 1996లో రెవరెండ్ అలివేలి కాదక్షమ్మను గుడ్ సమరిటన్ ఎవంజిలికల్ లూథరన్ చర్చి తన బిషప్ గా నియమించుకుంది[7]
పుష్ప లలిత తన మినిస్ట్రీ ఏర్పాటు చేశారు . ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ , హైదరాబాద్‌లో మొట్టమొదటి యూనివర్శిటీకి అనుబంధంగా ఉంది , సెరాంపూర్ కాలేజ్ (యూనివర్శిటీ) యొక్క సెనేట్ పాత నిబంధన పండితులు , విక్టర్ ప్రేమసాగర్ కాలంలో ఆమె చదువుకుంది. సెల్లీ ఓక్ కాలేజీలు , బర్మింగ్‌హామ్ , యునైటెడ్ చర్చ్ ఆఫ్ జమైకా , కేమాన్ ఐలాండ్స్‌లో పరిచయం కలిగింది . ఆమె బెంగుళూరులోని విశ్రాంతి నిలయం డైరెక్టర్‌గా మరియు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉమెన్ ఫెలోషిప్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా ఉన్నారు . ఆమె డీనరీ కమిటీకి చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.ఎగ్గోని పుష్ప లలిత నంద్యాల డియోసెస్ బిషప్‌గా 25 సెప్టెంబర్ 2013న నియమితులయ్యారు. ఆమెను 29 సెప్టెంబర్ 2013న నంద్యాలలోని ఆంగ్లికన్ కేథడ్రల్‌లో మోడరేటర్ జి . దేవకాదశం డిప్యూటీ మోడరేటర్ జి. దైవాశీర్వాదం ద్వారా బిషప్‌గా నియమించారు[8]
8-భారత అగ్రగణ్య విప్లవకారుడు –శ్రీ చండ్ర పుల్లారెడ్డి
చండ్ర పుల్లారెడ్డి భారత విప్లవకారులలో అగ్రగణ్యులు. సిపి అనే పేరుతో పిలవబడేవారు.
పుట్టుక-విద్యాభ్యాసం
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగోడు గ్రామంలో 1917 జనవరి 19 న జన్మించారు.[1] మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టిన సీపీ గారు ఐదవ తరగతి వరకు వెలుగోడులో, ఆపైన మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ విద్యను కర్నూలు ఉస్మానియా కాలేజీలో పూర్తి చేశారు. ఇంజనీరింగ్ విద్యకై మద్రాస్ గిండి ఇంజినీరింగ్ కాలేజీలో చేరారు.
ఉద్యమ జీవితం
అక్కడ ఇంజనీరింగ్ చదువుతూవుండగా నాటి బ్రిటిష్ పాలకులు జవహర్లాల్ నెహ్రూను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు.దాంతో కాలేజీ యాజమాన్యం ధర్నాకు ముఖ్య కారకులైన చండ్ర పుల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి గార్లను క్షమాపణ చెప్పాలనికోరగా వారు నిరాకరించారు. కాలేజీ ప్రిన్సిపాల్ వారిరువురిని కాలేజీ నుండి బహిష్కరించారు.అప్పటికే స్వతంత్ర భావాలు,నాటి మద్రాస్ కమ్యూనిస్టు నాయకులు కుమారమంగళం లాంటి వారి ప్రసంగాల వల్ల కమ్యూనిస్టు భావజాలం సీపీ గారిలో బలంగా ఉండేవి.1937 మే 1 వ తేదీన నాటి ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు జిల్లా కొత్తపట్నంలో 15 రోజులపాటు జరిగిన రాజకీయ పాఠశాలలో వెలుగోడు గ్రామం నుండి ఔత్సాహిక యువకులతో పాటు చండ్ర పుల్లారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.ఆ రాజకీయ పాఠశాలకు పుచ్చలపల్లి సుందరయ్య,చండ్ర రాజేశ్వరరావు వంటి ప్రభుతులు అధ్యాపకులుగా ఉండేవారు.1941 నాటికి పూర్తి స్థాయి కమ్యూనిస్టుగా మారి కర్నూలు జిల్లా కమిటీ సభ్యుడిగా వున్నారు.1946 లో కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.1949 మధ్యకాలంలో డిటెన్యూ కింద అరెస్టు కాబడి 1951లో విడుదలయ్యారు.1952 మద్రాస్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటీ చేసి తన ప్రత్యర్థి ,కాంగ్రెస్ అభ్యర్ధి, భూస్వామి అయిన మద్దూరు సుబ్బారెడ్డి మీద 10000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఎమ్మెల్యేగా మద్రాస్ అసెంబ్లీలో రాయలసీమ వెనకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ సీపీ గారు చేసే ప్రసంగాలకు ముఖ్యమంత్రి రాజగోపాలచారి గారిచే ” రాయలసీమ తరుపున పోరాడడానికి గట్టివాడే దొరికాడే ” అని అనిపించుకున్నాడు.1953 రాష్ట్ర విభజన తరువాత 1955 లో పోటీచేసి ఓడిపోయారు. మళ్ళీ 1962 లో జరిగిన ఉప ఎన్నికల్లో మిడుతురు నియోజకవర్గం నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు.అది మొదలు సీపీ గారు తన చివరి శ్వాస వరుకు ఎన్నడూ ప్రత్యక ఎన్నికల్లో పాల్గొనింది లేదు.1946-51 మధ్యకాలంలో సాగిన తెలంగాణ ప్రజల సాయుధ పోరాటంలో పలుమార్లు అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యారు.1964 లో భారత కమ్యూనిస్టు పార్టీలో మొదలైన సైద్ధాంతిక విభేదాల్లో పుచ్చలపల్లి సుందరయ్య ,మాకినేని బసవపున్నయ్య, తరిమెల నాగిరెడ్డి గార్లతో కలిసి సీపీఎం వైపుకు వచ్చారు. జైలు నుంచి విడుదలై 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.1975లో సి.పి., సీపీఐ (ఎం-ఎల్) కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. 1979లో యస్.యన్.యస్ స్థానంలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీ కాగలిగారు. 1980 ప్రత్యేక మహాసభలో కేంద్రకమిటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.[2]
మరణం
కార్మిక సంఘాల సమావేశాలకు హాజరై తిరిగి వస్తూ రైలులోనే కలకత్తా లో 1984 నవంబర్ 9 న తీవ్ర గుండెపోటుతో మరణించారు.[2]
రచనలు
• మానికొండ సుబ్బారావుతో కలిసి ‘ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం – దాని పరిణామం’
• వి.ఆర్.బొమ్మారెడ్డి తో కలిసి ‘ మావో సూక్తులు’ అనువాదం
• మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం – దాని గుణపాఠాలు.
• ఎన్నికల సంఘటనలు గుణపాఠాలు
• సీపీఐ, సీపీఎం, ఎపిసిసిసిఆర్ లలో వున్నప్పుడు ‘ జనశక్తి ‘ లో , సీపీఐ ( ఎం.ఎల్ ) లో తన పార్టీ పత్రిక విమోచన లోనూ అనేక సిద్ధాంత వ్యాసాలు రాసారు.
• సిద్ధాంత వ్యాసాలు ఏడు సంపుటాలుగా వెలువడ్డాయి.
• 9- ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీ స్థాపకుడు –శ్రీ తరిమెల నాగి రెడ్డి
•
జననం
అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917న రైతు కుటుంబములో జన్మించాడు.
పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ (10+2) చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా కళాశాల యాజామాన్యానికి, ఆచార్యులతో నాగిరెడ్డికి పొసగలేదు. లయోలా కళాశాల యాజమాన్యము నాగిరెడ్డికి జవహర్ లాల్ నెహ్రూ బహిరంగ ఉపన్యాసాలకు హాజరైనందుకూ, రామస్వామి ముదలియారుకు, సత్యమూర్తికి మధ్య జరిగిన ఎన్నికల ప్రచారములో పాల్గొన్నందుకు, వ్యాసరచనా పోటీలలో మహమ్మద్ బిన్ తుగ్లక్‌ను ప్రశంసించినందుకు, అనేకసార్లు జరిమానా విధించింది.
నాగిరెడ్డి లయోలా కళాశాల తరువాత వారణాసి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. వారణాసిలో ఉన్న నాలుగేళ్ళలో నాగిరెడ్డి కమలాదేవి ఛటోపాధ్యాయ, జయప్రకాశ్ నారాయణ్,అచ్యుత్ పట్వర్ధన్ వంటి వారిచే ప్రభావితుడయ్యాడు. కమ్యూనిజం, మార్క్సిజంతో ఈయనకు వారణాసిలోనే పరిచయమయ్యింది. రష్యన్ విప్లవము, స్టాలిన్ నాయకత్వము గురించి విస్తృతముగా చదివి, భారతదేశములో కూడా మార్క్సిజాన్ని అమలుచేయవచ్చని నమ్మటం ప్రారంభించాడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఉపకులపతిని నిలదీశారు. మహాత్మాగాంధీకి అది తెలిసి తరిమెల నాగిరెడ్డి వైస్ ఛాన్సలర్‌కి క్షమాపణలు చెప్పాలని ఉత్తరం రాశారు. నాగిరెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తిరస్కరించారు.
నాగిరెడ్డి తన ప్రభుత్వ వ్యతిరేక రాజకీయకలాపల వల్ల అనేకమార్లు జైలుకు వెళ్లాడు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధం, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం అన్న పుస్తకం వ్రాసి ప్రభుత్వము యొక్క ఆగ్రహానికి గురై జైలుకు వెళ్ళాడు. తిరుచిరాపల్లి జైలునుండి విడుదల కాగానే మరలా 1941లో భారతీయ రక్షణ చట్టము కింద అరెస్టయ్యాడు. 1946లో ప్రకాశం ఆర్డినెన్సు కింద అరెస్టయ్యి 1947లో విడుదల చేయబడ్డాడు.
1952లో నాగిరెడ్డి మద్రాసు శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. [1] జైలులో ఉండి కూడా, ప్రముఖ కాంగ్రేసు నాయకుడు, తన బావ అయిన నీలం సంజీవరెడ్డిపై విజయం సాధించి సంచలనం సృష్టించాడు. 1955లో కొత్తగా ఏర్పడిన పుట్లూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి తరిమెల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1957లో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1962లో పుట్లూరు నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సి.పి.ఐ అభ్యర్థిగా పోటీచేసి తరిమెల రామచంద్రారెడ్డి ఓడించి ఎన్నికైనాడు. 1967లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్లూరు నియోజకవర్గం రద్దుకాగా, సి.పి.ఐ (ఎం) అభ్యర్థిగా అనంతపురం నియోజకవర్గం నుండి మూడో పర్యాయం శాసనసభకు ఎన్నికయ్యాడు. 1969లో మార్చి నెలలో శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
1968లో నాగిరెడ్డి సి.పి.ఐ (ఎం) నుండి విడిపోయి ఆంధ్ర ప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిష్ట్ రెవల్యూషనరీస్ (ఎ.పి.సి.సి.ఆర్) – ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీని స్థాపించాడు. సి.పి.ఐ (ఎం) కార్యకర్తలను కొత్తపార్టీలోకి ఆకర్షించడంలో సఫలం అయ్యాడు. కొద్దికాలం ఎ.పి.సి.సి.ఆర్ అఖిల భారత కమ్యూనిష్టు ఉద్యమకారుల సమన్వయ కమిటీలో కలసివుంది. రెడ్డి 1976లో తను మరణించేదాకా ఎ.పి.సి.సి.ఆర్ నాయకునిగా కొనసాగాడు.
నాగిరెడ్డి రచనలలో ముఖ్యమైనది ఇండియా మార్ట్‌గేజ్‌డ్ (తాకట్టులో భారతదేశం). నాగిరెడ్డి 1976, జులై 28న మరణించాడు. ఆయన భౌతికకాయాన్ని తరిమెలకు తీసుకెళ్తుండగా కల్లూరు వద్ద పోలీసులు భౌతికకాయాన్ని అరెస్టు చేశారు. ప్రజలు తండోపతండాలుగా రావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పోస్టుమార్టం తర్వాత భౌతికకాయాన్ని బంధువులకప్పగించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-10-22-ఉయ్యూరు