హాస్యానందం
42- అజ్ఞోక్తి
అజ్ఞానం వలన అన్నమాటలు నవ్వుపుట్టి౦చటమే అజ్ఞోక్తిఅన్నారు మునిమాణిక్యంగారు .ఒకసారి ఆయనక్లాసుకు వెళ్లి ‘’నైషధం రాసింది ఎవరు ?’’అని అడిగితె ఆపద్యాలు వారి పాఠ్యగ్రంధం లో ఉన్నా ఒఖరూసమాధానం చెప్పకపోతే ,ఎక్కడోకాలింది మాస్టారికి .ఒక చిన్న కుర్రాడివంక ఉరుముతూ చూసి’’ఎవర్రా నైషధం రాసి౦దీ’’అని అడిగితె వాడు కంగారుతో భయపడి ‘’సార్ నేను రాయలేదండి మదర్ ప్రామిస్ ‘’అన్నాడు .పిల్లల తెలివి తేటలు ఇలా అఘోరించాయికదా అని హెడ్ మాస్టారి దగ్గరకి వెళ్లి చెప్పగా ఆయన తనతోపాటు నవ్వి ‘’చిన్న వెధవ భయపడి లేదన్నాడు కానీండి వాడేరాసి ఉంటాడు ‘’అన్నాడు ట .ఇదే అజ్ఞానోక్తి .ఇంకోక దాహరణ ఆయనే చెప్పారు .పూర్వం జిల్లాబోర్డ్ ప్రెసిడెంట్ లు ఉండేవారు. చదువులేకపోయిన ,ధనవంతులైన కారణంగా పలుకుబడితో వోట్లు పోగేసుకొని ప్రెసిడెంట్ అయ్యేవారు .అలాంటి ఒక జిల్లాబోర్డ్ ప్రెసిడెంట్ గురించి చెప్పిన కథ .జిల్లాలో కలరా వ్యాపించింది చావుల రిపోర్ట్ వచ్చింది .అందులో కలరాచావులు 12.5శాతం అని తేలింది .ఈ పాయింట్ ఫైవ్ సంగతి ఆయనకు అర్ధంకాక బుర్ర వేడెక్కింది .అందర్నీ అడిగి ఎవరూ చెప్పలేకపోతే చివరికి వైస్ ప్రెసిడెంట్ నుపిల్చి 12తర్వాత చుక్కపెట్టి 5ఎందుకు రాశారు అని అడిగాడు .ఆయన కాసేపు ఆలోచించి ‘’కలరావల్ల నూటికి 12మంది ,చనిపోయారు అని తెలుస్తోందికదా .ఇంకో అయిదుగురు చావటానికి సిద్ధంగా ఉన్నారని కాస్త చుక్క అడ్డం పెట్టారన్నమాట .ఇహనో రేపో ఆ అయిదుగురూ టపాకడతారన్నమాట ‘’అన్నాడు .
మూర్ఖోక్తి –అంటే మొండి యుక్తి అన్నారు ముని సార్.ఉదాహరణ ఆయనే చెప్పారు –నేను మద్రాస్ కు వెడుతుంటే మా ఆవిడ వచ్చి ‘’ఎలాగూ వెడుతున్నారుకనుక బెజవాడలో దిగి మా అన్నయ్యను చూసి రండి.ఈమధ్యనే జబ్బుపడి లేచాడు.చూడకపోతే బాగోదు ‘’అన్నారు .సరే అన్నారు మాస్టారుకానీ వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ కుదరక బెజవాడలో దిగలేక ఆయన్ని చూడకుండానే వచ్చేశారు .ఇంటికిరాగానే అడిగితె ‘’శుక్రవారం సాయంత్రం 6.౩౦ కి చూశాను అని అబద్ధమాడి, దాన్ని నిలుపుకోటానికి మళ్ళీ అరడజలు అబ్దాలు ఆడాల్సి వచ్చింది .ఆవిడ ఆవలిస్తే పేగులు లేక్కేసే గడుసరి. గురూగారు అబద్ధం ఆడారని గ్రహించి ‘’ఎందుకండీ అబద్ధమాడుతారు “”?అంది .తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ .’’శుక్రవారం సాయంత్రం ఆరుకు మా అన్నయ్యను బెజవాడలో చూశామనే అంటారు కదా ?అనగా’’ఆరున్నరకు ‘’అని సవరించారీయన .’’వాళ్ళ ఇంట్లోనే చూశారా ?’’ఆమె ప్రశ్న .’’ఓ.నిక్షేపంగా వాళ్ళింట్లోనే బెజవాడలో చూశా ‘’మేస్టారి బుకాయింపు .ఆవిడ ‘’ఆ రోజు ఆ వేళప్పుడు మా అన్నయ్య బందర్లో మని౦ట్లోనే ఉన్నాడు .గురు వారం సాయంత్రం మీరు మద్రాస్ బయల్దేరితే ఆయన శుక్రవారం ఉదయం ఇక్కడికి వచ్చాడు .ఆ రొజ౦తా ఉండి శనివారం సాయంత్రం వెళ్ళాడు .ఆయన ఇక్కడే ఉంటె మీకు బెజవాడలో ఎలా కనపడ్డాడు ?’’అంది .ఈయన దబాయింపు సెక్షన్ జోరు చేసి ‘’ఆ జ్ఞానం మీ అన్నయ్యకు ఉండాలి. బందర్లో నీకు కనిపించిన రోజే ,బెజవాడలో నాకు కనుపించకూడదని .అయినా మీ అన్నయ్య ఎక్కడబడితే అక్కడ ఎవరికీ బడితే వాళ్లకు కనబడుతూనే ఉంటాడు ‘’అన్నారు ఈమొండి జవాబుకు ఆవిడ ఫకాల్న నవ్వి ఊరుకొంది.మూర్ఖోక్తి లేక మొండి యుక్తి అంటే ఇదే మహానుభావా అన్నారు మాస్టారు .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-22-ఉయ్యూరు
‘