మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -316
316- బైజుబావరా హేందీ సినీ చాయాచిత్రదర్షక ఫేం ,ఇంటికి దీపం ఇల్లాలే దర్శకుడు –శ్రీ వి.ఎన్.రెడ్డి
వి.ఎన్.రెడ్డి గా ప్రసిద్ధి చెందిన కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి ప్రముఖ హిందీ చలనచిత్ర ఛాయగ్రాహకుడు.[1] ఆగ్, బైజూ భవరా, కాలిఘటా, జాన్వర్, చోరీ చోరీ, హల్‌చల్, ఉప్‌కార్ వంటి సినిమాలకు ఛాయగ్రహణం అందించాడు. ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. వి.ఎన్.రెడ్డి 1907లో వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో జన్మించాడు. 20 ఏళ్ల వయసులోనే 1937లో ఛాయగ్రహణంలో తన ఆసక్తిని అభివృద్ధి చేసుకొని ఆ రంగంలో స్థిరపడటానికి బొంబాయి చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఎస్.హర్‌దీప్ వద్ద సహాయకునిగా మడ్, చరణోంకీ దాసి, వసంతసేన సినిమాలలో పనిచేశాడు. ఐదేళ్లు కృషిచేసిన తర్వాత 1952లో ఛాయగ్రాహకునిగా పనిచేసే అవకాశం వచ్చింది.[2] రాజ్‌కపూర్ నటించిన ఆగ్ సినిమాకు వి.ఎన్.రెడ్డి కైయారొస్కూరో (Chiaroscuro) లైటింగ్ టెక్నిక్‌ను ఉపయోగించి అందించిన అత్యద్భుత ఛాయాగ్రహణం విమర్శకుల ప్రశంసలందుకున్నది[3] “వెలుగు నీడలను వెండితెరపై విభజించి వాటితో దాగుడు మూతలు ఆడుతూ ప్రేక్షకున్ని విస్మయంతో వినోదింపజేయగల ఘనత” వి.ఎస్. ది అని రూపవాణి పత్రికలో ఒక సినీ విలేఖరి అన్నాడు.[2]
రెడ్డి దర్శకత్వంలో కూడా ప్రవేశించి గంగా గౌరీ సంవాదం (1958),[4] సెంగొట్టయ్ సింగం (తమిళం – 1958)[5] ఇంటికి దీపం ఇల్లాలు (1961), ఆనంద జ్యోతి (తమిళం – 1963),[6], జహ్రీలీ (1977) తదితర సినిమాలు తీశాడు.[7]
ఈయన ఆరుగురు సంతానంలో ఒకడైన రవికాంత్ రెడ్డి 13-14 ఏళ్ల వయసులోనే తండ్రి వద్ద ఛాయాగ్రహణంలో అప్రెంటిసుగా శిక్షణ పొంది, ఆ తరువాత తనూ ఛాయాగ్రాహకుడయ్యాడు[8]
చిత్రసమాహారం
ఛాయాగ్రాహకుడిగా
· దిల్ కి రాణీ (1947)
· ఆగ్ (1948)
· హల్‌చల్ (1951)
· బైజూ భవరా (1952)
· చోరీచోరీ (1956)
· చిరంజీవులు (1956)
· కష్మీర్ కి కలీ (1964)
· ఉప్‌కార్ (1967)
· లాట్ సాహిబ్ (1967)
· యాద్‌గార్ (1970)
· పూరబ్ ఔర్ పశ్చిమ్ (1970)
· దో చోర్ (1972)
· ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే (1974)
· కాలిఘటా
· జాన్వర్
దర్శకునిగా
· సెంగొత్తయ్ సింగమ్ (తమిళం) (1958)
· గంగా గౌరీ సంవాదం (1958)
· ఇంటికి దీపం ఇల్లాలే (1961)
· మనప్పందనాళ్ (తమిళం) (1961)
· ఆనంద జ్యోతి (1963)
· జహ్రీలీ (1979)
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు