అక్షరం లోక రక్షకం
సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
సరస భారతి 168వ కార్యక్రమ౦గా నాటక, టివి, సినీనటులు –శ్రీ ఉప్పులూరి సుబ్బరాయశర్మ గారికి ‘’జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ‘’
సరసభారతి ,స్థానిక శ్రీనివాస అక్షరాలయం సంయుక్తం గా 29-10-22 శనివారం ఉదయం 11గం.కు శ్రీనివాస కాలేజి లో సరసభారతి 168వ కార్యక్రమం గా ప్రయోగాత్మక నాటక నటులు ,ప్రదర్శకులు ,రేడియో ,టి.వి.చలనచిత్ర నటులు శ్రీ ఉప్పులూరి సుబ్బరాయ శర్మగారికి ‘’జీవనసాఫల్య పురస్కారం ‘’ప్రదానోత్సవం నిర్వహిస్తున్నాము .సాహితీ, సాంస్కృతిక అభిమానులు పాల్గొని జయప్రదం చేయప్రార్ధన .
పాల్గొనుఅతిధులు
ముఖ్య అతిధి – శ్రీ మండలి బుద్ధప్రసాద్ –ఆంధ్రప్రదేశ శాసనసభ మాజీ ఉపసభాపతి
విశిష్ట అతిధి -శ్రీ ఓలేటి పార్వతీశం – కవి పండితులు వక్త ,విశ్లేషకులు ,దూరదర్శన్ ఎక్సిక్యూటివ్
ఆత్మీయ అతిధులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు –కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు
శ్రీ జివి .పూర్ణచంద్-కృష్ణాజిల్లారచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
శ్రీ చలపాక ప్రకాష్ –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి
మొదలైన ప్రముఖులు
పూర్తి వివరాలతో ఆహ్వానపత్రం మరో వారంలో అంద జేస్తాం .
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
పరుచూరి శ్రీనివాసరావు –శ్రీనివాస అక్షరాలయం ప్రిన్సిపాల్
12-10-22-ఉయ్యూరు