ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -2
తండ్రి మరణం తో కుటుంబ బాధ్యతలుమోస్తూ ఆడంబరంగా డబ్బు ఖర్చు పెట్టాడు హరిశ్చంద్రరంగురంగులబట్టలు పీతాంబరాలు ,సెంట్లు అత్తరు లతో విలాస పురుషుడుగా ఉండేవాడు .అత్తరు ,తమలపాకుల్లో వాడేఅత్తరు ఖర్చు చూసి గుండెలు బాదుకోనేవారు .ఎప్పుడూ మహారాజుగా ఘుమ ఘుమ లాడుతూ ముస్తాబులో ఉండేవాడు .వివిధ ప్రాంతాలనుంచి అమ్మకానికి వచ్చిన చిత్రాలు చిత్ర సంపుటాలు పురాతన గ్రంథాలు ఎంత ఖరీదైనా కొని తండ్రి ఏర్పాటు చేసుకొన్న స్వంత గ్రంథాలయానికి వన్నె తెచ్చేవాడు .అనాదిగా వస్తున్న కళాకారులపోషణ తలకు మించిన భారమూ అయ్యేది .ప్రముఖ దేశీయులు ,విదేశీయులు ఇంటికి అతిధులుగా వస్తే వారిని భారీ ఖర్చుతో సన్మాని౦చేవాడు .ఆధునికత ఏరూపం లో ఉన్నా అతడు ఆదరించేవాడు .గడియారాలపై మోజు ఎక్కువ .వందలాది వాటిని కొని వందిమాగధులకు ధారాదత్తం చేసేవాడు,కొత్తగా వచ్చిన ఫోటో పరిశ్రమ లో నిలదోక్కుకోనేవారికి పెట్టుబడి పెట్టి జీవనోపాధి కల్పించాడు. హోమియోపతి వైద్యాన్నీ ప్రోత్సహించాడు .ఉచిత హోమియో చికిత్సాలయం నెలకొల్పి నెలకు నూట పాతిక రూపాయలు ఖర్చు చేసే వాడు .
లితో ప్రింటింగ్ తో తండ్రి పుస్తకాలు ముద్రించేవాడు .’’సుందరీ తిలక్ ‘’పేరుతొ ప్రఖ్యాత కవుల కవితా సంకలనాలు ప్రచురించాడు .కొత్తగా అప్పుడప్పుడే ప్రవేశం అయిన ముద్రణా యంత్రాలు కొని ముద్రించే వారికి ఆర్ధిక సాయం చేసేవాడు .కుస్తీపోటీలకు ,ఇంద్రజాల ప్రదర్శనాలకు గొప్ప ప్తోత్సాహం కల్పించేవాడు .దానాలు చేసేటప్పుడు స్వంత ఉంగరాలు రవ్వలు కూడా ఇచ్చి దాన కర్ణుడు అయ్యాడు .చలిలో వణుకుతున్న బిచ్చగానికి తన వంటిపై ఉన్న ఖరీదైన శాలువా ఇచ్చేసిన మానవతా మూర్తి .ఆపదలలో ఉన్న బ్రాహ్మణుడికి తన వజ్రాల ఉన్గారమే ఇచ్చేసిన త్యాగి .తన వెండి పెట్టె చూసి ముచ్చటపడ్డ ఒక బాలుని తండ్రికి విలువైన ఆపెట్టెను బహూకరించిన త్యాగధనుడు .రూపం ,ధనంపుష్కలంగా ఉన్న ఈ నవయవ్వనుని చుట్టూ అవకాశవాదులు చేరి స్తోత్రాలు చేసి ,డబ్బు గుంజుకొనేవారు .హిందీ భాషలో మొట్టమొదటగా వచ్చిన స్వీయ చరిత్ర హరిశ్చంద్ర రాసి౦దె ,ఇలాంటి వారినందరి మనస్తత్వాన్ని నాటి సామాజిక స్థితి ని అందులో వర్ణించాడు.’’నన్ను నిజంగా ప్రేమించేవారెవరో ,వందిమాగధులు ఎవరో తెలీని అమాయకుడిని కాను,అజ్ఞానినీకాను .నీదగ్గరున్నవి పావురాలా దివి నుంచి దిగివచ్చిన దివ్య గరుడ పక్షులా ?నా గుర్రాల్ని మెచ్చేవాడొకడు నా క౦చర గాడిదల్ని పోగిడేవాడొకడు .ఈ పొగడ్తల కుంభ వృష్టికి నేను తట్టుకోన్నానుకాని ,ఇంకొడైతే పారిపోయేవాడు .ఇదంతారోజూ మాకచ్చేరి గదిలో జరిగే తంతు .ఇవన్నీ నీటి బుడగలలా చల్లగా జారిపోయేవి ‘’అని యదార్ధ చిత్రణ చేశాడు
.’’మెట్లగది దగ్గర మరోరకమైన తంతు జరిగేది .నలుగురైదుగురు హిందూ ముసల్మానులు కాపలావారు ,ఇద్దరుముగ్గురు ఉద్యోగాలకోసం వచ్చేవారు,ఇంకొందరు చిల్లరమల్లర పనులకోసం వచ్చినవారు .కొందరు నిలబడి కొందరుకూర్చుని అందరి ప్రార్ధనా డబ్బు కోసమే .ఇందులోఅందరూ స్వార్ధ పరులుకారు .భక్తిప్రపత్తులున్నవారూ ఉండేవారు .ఒకడు తార్పుగానితోబేరాలుపెట్టేవాడు ‘’రూపయకి బేడా నాకు ఇవ్వకపోతే నీ అంతు చూస్తా .నువ్వు వెనకేసుకొచ్చే బీబీ జాన్ ఈ ఇంటి గడపకూడా దాటి లోపలి రాలేదు ‘’అనేవాడు .బట్టలవ్యాపారితో ఒక లంచగొండి ‘’ఆ నల్లశాలువా నాకు ఇస్తేనే లోపలి వెళ్లి బట్టలు అమ్ముకోగలవు. నా మాట శాసనం ఇక్కడ.అమ్మినదానికి నీకుడబ్బు చేతిలో పడాలంటే నా చేయి తడపాల్సి౦దే,శాలువా కప్పాల్సిందే ‘’అని బెదిరిస్తాడు .ఇంకో మధ్యవర్తి ‘’నేను అయ్యగారి తలలో నాలుక ‘’అని హడల గోడతాడు .మరోఘనుడు ‘’నాముందు తల ఎత్త టానికి నీకెన్ని గుండెలు?ఆడాళ్ళకు డబ్బు పంచేది నేనే ‘’హడలగొడతాడు ‘’ఇంతనిర్మొహమాటంగా తన జీవిత చరిత్ర చెప్పుకొన్నాడు .
హర్స్చంద్ర భార్య మన్నో దేవి వలన ఇద్దరుకొడుకులు ,ఒకకూతురు పుట్టారు .ముగ్గురూ చిన్నప్పుడే చనిపోయారు .వివాహ జీవితం లో అన్యోన్యత లేదు .ఇంటి వైద్యుడు అతన భార్య అనారోగ్యానికి కారణం భర్త నిరాదరణ.అని చెప్పి , ఆయనకు సూటిగా చెప్పటం కంటే ఆ సున్నిత మనస్కుడికి ఉత్తరం ద్వారా తెలియజేస్తే మంచిదని జాబురాశాడు .ఈయన దీనికి జవాబు బెంగాలో దేవనాగరలిపిలో తనకు ఇంట్లో సుఖం లేదని భార్యను ఇబ్బంది పెట్టటం లేదని ,అన్ని సౌకర్యాలు ఆమెకు కల్పిస్తున్నాననీ ,,అయితే తన హృదయాన్ని అదుపులో పెట్టుకొనే సామర్ధ్యం తనకు లేదనీ,తానూ ‘’అసహాయుడను ‘’అనీ ‘’రాశాడు .
1870లో కాశీలో సంపన్నులు తమకున్న ఇంటిని బట్టి ఉంచుకున్న కళావంతుల్ని బట్టి స్టేటస్ అంచనా వేసుకొనేవారు ‘’.గురూజీ’’ ఇందులో ఏమీ తీసిపోలేదు .ఉమ్మడికుటుంబం కనుక సరదాలు బయటనే తీర్చుకోనేవాడు .కళావంతుల ఇళ్ళకు వెళ్ళేవాడు వాళ్ళు ఈయన వసతి గృహానికి వచ్చేవారు .ఈయన సాహిత్యం లోనూ జీవితం లోనూ ,పాలుపంచుకొన్న ఇద్దరు స్త్రీలలో ఒకామె ఆలీజాన్ .ఆమె చేసిన అప్పు తీర్చటానికి వీళ్ళ ఇంటికి వచ్చేది .ఈయనతో పరిచయం పొందిన మహమ్మదీయ స్త్రీ .ఆమె పేరు మాధవిగా మార్చి హిందూమతంలోకి మార్చి అండన చేర్చుకున్నట్లు కథనం.ఆమె ఇంట్లోనేదర్బారుపెట్టి పగలురాత్రి అక్కడే గడిపేవాడు .ఇల్లంతా దంతపు శోభ చేకూర్చాడు .ఇతని మరణం తర్వాత గోకుల్ చంద్ర ఆయిల్లు స్వాధీనం చేసుకొని నెలకు పదిరూపాయలు మాత్రమె ముట్ట చెప్పేవాడు .ఇతని చావుతర్వాత ఆమెకు ఆ ఆధారమూలేకుండా పోయింది .మల్లిక అనే బెంగాలీఅమ్మాయికూడాహరిశ్చంద్ర జీవితంలో ప్రవేశించి ,ఆమెకున్న సాహిత్య పరిజ్ఞానంతో మరీ దగ్గరైంది .గేయాలురాసేది .మూడు బెంగాలీనవలలు హిందీ లొకిఅనువది౦చి౦ది .ఒక అనువాఫం ఇతనికే అంకితమిచ్చి అతడిని ‘’నేను ఆరాధించే ప్రభువు ‘’అన్నది .ప్రభువు ప్రోత్సాహంతోనే తనపుస్తలు ప్రచురితాలయ్యాయని కృతజ్ఞత తెల్పింది ఇతని రచనలకు సహాయపడుతూ ప్రచురణాలయం పెట్టి ,ఇతనిపుస్తకాలు విక్రయించేది .
భారతే౦దు అనే ముందుపేరు హరిశ్చంద్ర నడవడికను బట్టి వచ్చి, జీవితాంతం ఉండిపోయింది .ఒకపెద్ద మనిషిని ఒకసారి యితడు హేళన చేస్తేసున్నితంగా మందలిస్తూ నువ్వేమైనా తోపువా ?నీ నడవడినిర్మలమా ?నీ ప్రవర్తన నిజానికి చంద్రుని లాంటిది. చంద్రునిలో మచ్చలున్నట్లే నీ ప్రవర్తనలోనూ ఉన్నాయి అందుకే నిన్ను ‘’భారతేందు’’అనవచ్చు అనగా,తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు మనవాడు .ఆపేరుతోనే స్నేహితులు పిలిచేవారు. 1870-80కాలం లో హరిశ్చంద్ర హిందీలో వివిధ సాహిత్య ప్రక్రియలలో ప్రఖ్యాతుడయ్యాడు .తోటి రచయితలు ఇతన్ని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించాలని కోరారు .ప్రభుత్వం స్పందించక పోవటంతో పాటు, అతని ప్రత్యర్ధి రాజా శివ ప్రసాద్ కు ‘’సితార ఎహిందూ ‘’ఇవ్వటం బాధాకరంగా అనిపించి కలకత్తాలోని సారసుధానిధి పత్రికాసంపాదకుడు హరిశ్చంద్ర ‘’భారతేందు ‘’ అంటే ‘’భారత చంద్రుడు’’ అని ప్రకటించగా సాహిత్యలోకమంతా ఏకీభవి౦చగా ఆనాటినుండి సాహిత్యలోక౦ ఆయన్ను ‘’భారతేం హరిశ్చంద్ర ‘’అని అత్య౦త గౌరవంగా సంబోధించింది .ఇదే స్థిరపడిపోయింది .జార్జి గ్రీసన్ ,గర్కాన్ డిటాసీ వంటి పాశ్చాత్య ప్రముఖులు ఇలాగే సంబోధిస్తే చిరునవ్వు నవ్వేవాడు .తన లెటర్ పాడ్ పై చంద్రోదయం ముద్రించుకొన్నాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-13-10-22-ఉయ్యూరు
.