’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -3
సత్య హరిశ్చంద్రుని పేరు తనపేరుకావటం భారతేందు అని అందరూ గౌరవంగా పిలవటం ఆయనకు గర్వంగా ఉండేది.ఉదారస్వభావుడుగానేకాక సత్యధర్మ పాలకుడుగా కూడా ఉండేవాడు .ఆలిగగడ్ విశ్వ విద్యాలయం స్థాపించిన సయ్యద్ అహ్మద్ ఖాన్ న్యాయవాదిగా వారణాసి బదిలీ మీద వస్తే ,ఇతని పై వేసిన దావాలో ఈయన కోర్ట్ కు హాజరవ్వాల్సివచ్చింది .ఆదావాలో ఈయన ఒక వ్యాపారికి 3వేలరూపాయలు తీర్చాల్సి వస్తే ,వ్యాపారి ఒక నావను అమ్మి కొంతడబ్బు ఇచ్చినట్లు తెలుస్తోంది .డబ్బు ఎగగొట్టటానికి మంచి అవకాశం .న్యాయమూర్తి ఈయన నిజాయితీ గుర్తించి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే ‘’డబ్బుకోసం మతధర్మం , సత్యాన్ని త్యాగం చేయలేను .ఆవ్యాపారి నన్ను ప్రోనోట్ రాసిమ్మని అడగలేదు ,అతని షరతులకు నేను ఒప్పుకొని తీసుకున్నాను .అప్పు తీర్చే టప్పుడుఎ౦దుకుకు మాట తప్పాలి ?సత్యానికి ప్రతీకగా నిలబడిన హరిశ్చంద్రుని పేరే నా పేరు ‘’అన్నాడు .న్యాయమూర్తి ఆయన సత్య సంధత గుర్తించి సాక్షుల విచారణ చేయకుండా తీర్పు చెప్పాడు .అతని నీతి నిజాయితీలకు ఇలాంటివి కోకొల్లలు .చిన్న అప్పులకు కూడా ఎక్కువ డబ్బు చెల్లించేవాడు .
ఒకసారి కుటుంబంతో పూరీ యాత్రకు బయల్దేరి వెడుతుంటే గోపాల్చంద్ర స్నేహితుడు రెండు బంగారు నాణాలు అప్పుగా ఇచ్చాడు తనకు డబ్బు అవసరం లేదని ఎంత చెప్పినా వినకుండా .వెళ్లిరావటానికి కొన్ని రోజులుపట్టింది .నాణాలను డబ్బుగా మార్చాడు .ఆయన దగ్గర డబ్బున్న సంగతి తెల్సి కొంతకాలం అక్కడే ఉందామన్నారు కుటుంబ సభ్యులు .డబ్బు పూర్తిగా ఖర్చైపోయింది .రెండు నాణాల అప్పు తీర్చటానికి ఆతర్వాత ఆయన 15వేలు ఖరీదు చేసే ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ఆయనే ఒకసారి చెప్పాడు .ధనార్జన ,పొదుపు ఆయనకు తెలీనివి .పూర్వం వ్యాపారంలో కుటుంబం కుబేర స్థానంలో ఉంటె ఇప్పుడు ‘’బేర్’’మనే స్థితికి వచ్చింది .వ్యయం తప్ప ఆదాయం హుళక్కి.కుటుంబ సభ్యులు కాశీ రాజు దగ్గరకు వెళ్లి ఈయనతో ఎలాగైనా దుబారాఖర్చు తగ్గించెట్లు చేయమనికోరితే ఆయన ఈతన్ని పిలిపించి సూచన చేయబోతే ‘’అయ్యా డబ్బు మాపూర్వీకుల్ని హరించి వేసింది .నేను డబ్బును హరి౦చాలనుకొన్నాను. నాకు డబ్బుపై వ్యామోహం లేదు ‘’అన్నాడు .ఇక ఎవరూ ఆయన్ను ఆపలేకపోయారు .
లాభం లేదని కుటుంబంలోని వారంతా భాగాలు పంచుకొందామని నిర్ణయించి ,ఈయన అనాసక్తత వలన ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టగా ఉన్నదంతా వాళ్ళే పంచేసుకొన్నారు .ఆయన చిన్నతనం లోచేసిన అప్పులు కూడాఆయన భాగంలోనే చూపించార్రు .తర్వాత అమ్మమ్మ ఆస్తిపంపకాలలో కూడా ఇలానే ఆయన్ను అన్యాయం చేశారు .అయినా ఉమ్మడిగానే ఉన్నారు .హరిశ్చంద్ర ఉన్నభాగం తో మిగిలినవారు సంబంధం పెట్టుకోలేదు .ఆదాయం లేకపోవటం వలన అప్పులు చేయాల్సి వచ్చి తీర్చటానికి ఆస్తి అమ్మాల్సి రాగా సోదరుడు గోకుల్ చంద్ర ,ఈయన అప్పులు తీర్చేసిఅస్తి స్వాధీనం చేసుకొన్నాడు .ఆస్తి పోయినందుకు బాధపదలేదుకానీ అప్పు పుట్టనందుకు ఎక్కువ బాధ పడ్డాడు .ఇంతజరుగుతున్నా ఆయన సాహిత్య సంపదమాత్రం పెరుగుతూనే ఉంది . హరిశ్చంద్ర హిందీ సాహిత్యానికి చేసిన సేవ తెలియాలంటే ,అతనికి ముందు హిందీ సాహిత్యం ఎలా ఉందో తెలియాలి .అప్పటి ఉత్తర హిందూస్థాన్ లో అంటే ఇప్పటి బీహార్ హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ ,మధ్య ప్రదేశ్ లలో మాండలిక భాషలనుంచే ఇప్పటి హిందీఎర్పడింది .ఇక్కడి మాండలీకాలు మేవతి ,మార్వారీ ,జైపూరి,రాజస్థాన్ లకు చెందిన ఖడీబోలీ అంటే బంగారుభాష ,బ్రజ్ ,కనౌజీ ,బుందేలీ ,అవధి ,బాగ్ హెలి ,చత్తీస్ ఘడీ ,మైధిలి ,భోజ్ పూరి ,మాగధి ,.వీటిని దేవనాగరిలిపిలోనే రాసేవారు .మార్వాడీ వ్రజ్ ,అవధి మైధిలి భోజ్ పూరి లను కేవలం కవులే వాడేవారు .సాహిత్యం పద్యరూపం గా ఉండేది .వచనం అరుదు.మొగలాయీ దండయాత్రతో కొంత మార్పు జరిగింది .అరబిక్ పర్షియన్ టర్కి పదాలు ఆయా ప్రాంత మా౦డలీకాలలో చేరిపోయాయి .దీనివలన ఉర్దూ భాష వచ్చింది .ఉర్దూ అంటే టర్కీ భాషలో’’ మిలిటరీ బస’’ అని అర్ధం.ఈ ఉర్దూ హిందీభాషలలో కలిసిపోయింది .ఢిల్లీ లో మాండలికంగా ఉన్న రెఖటా లేక హిండ్వీభాష మహమ్మదీయ రాజుల్నించి ఫకీరులా ‘’జాలియాస్ ‘’వరకు అలవాటైంది .షామిరాన్ బుర్హనుద్దీన్ ,మహమూద్ గౌస్ మొదలైనవారు ‘’హిండ్వీ’’లోనే రచన చేశారు .మంచి హిందీభాషగా చెలామణి అయింది ఈభాషలోనే అమీర్ ఖుశ్రు ,జాయాసి, కబీర్ లు కవిత్వం రాశారు .అక్బర్ ఈభాషను బాగా ప్రోత్సహించాడు అక్బర్ హిండ్వీభాషలో రాసిన పద్యాలనూ ‘’అక్బార్ రే ‘’అనే కలం పేరుతొ రాశాడు .అతని సమకాలికులు తోడర్ మల్ బీ ర్బల్, అబ్దుల్ రహీం, ఖాన్ ఖానా ,అబుల్ ఫైజి, ,గంగాకవి తులసీదాస్ సూర్ దాస్ లుకూడా హిండ్వీలోనే రాశారు .జహంగీర్ షాజహాన్ ,ముర్షిదాబాద్ ,జీడ్,దక్కన్ సుబెదార్లు అందరూ దీన్ని ప్రోత్సహించారు .మొగలుల చివరి చక్రవర్తి బహదూర్ షా హిందీలోమంచికవి చాలారచనలు చేశాడు .
మొగలాయికాలం లో పద్యమే ఏలింది .రాం ప్రసాద్ నిరంజన్ రాసిన భాషా యోగవశిష్ట -1741,పండిత్ దౌలత్ రాం అనువదించిన పద్మపురాణం -1761వంటివి అతితక్కువ వచన రచనలు. క్రైస్తవ కాలం లో మత ప్రచారం కోసం ఆయా మా౦డలీకాలనే వాడేవారు .హిందీ రచయితలకు అవకాశాలు బాగా వచ్చాయి. ప్రజలు ఎక్కువమంది అర్ధం చేసుకొనేవారు .కానీ బ్రజ్ భాషలోనే రచన జరిగింది .మొగలాయీలతర్వాత వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఉర్దూ పిచ్చపిచ్చగా నచ్చి ఉర్దూ-ఇంగ్లీష్ డిక్షనరీ, ఉర్దూ వ్యాకరణం గిల్ క్రైస్ట్ తో రాయించారు , రచయితలూ బాగా పండితులవటంతో ఉర్దూ పర్షియన్ భాషల్లో రచనలు చేశారు .ఆగ్రానుంచి వచ్చిన లల్లూ జూలాల్ కి ఉత్తరప్రదేశ్ లో మాట్లాడే ఖడ్ బోలీ బ్రజ్ లలో మంచి పరిచయముంది .భాగవతాన్ని హిందీలోని అనువదించి ప్రేమ సాగర్ పేరుతొ ప్రచురించాడు .హితోపదేశ ,పంచ తంత్రాలకు బ్రజ్ భాషలో అనువాదం చేశాడు .బైతాల్ మొదలైన వాటిని ఉర్దూ-హిందీ మిశ్రమభాషలో రాశాడు .నాసికేలో పాయాన్ ను సాదత్ మిశ్రా 1803లో రాశాడు .ఖేత్ కికహాని అనే సంప్రదాయ గ్రంథాన్నిన ఇన్సాల్లాఖాన్ రాశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-22-ఉయ్యూరు
.