హాస్యానందం
44-పర్యాయోక్తి
ప్రశ్ననుంచే సమాధానం లాగే పద్ధతిని పర్యాయోక్తి అన్నారు మునిమాణిక్యం మాస్టారు.మనం ఏ ప్రశ్న అడిగినా ఇమ్మీడియట్ గా జవాబు వస్తుంది .ఆప్రశ్న జ్యోతిశ్శాస్త్రం కానీ మరేదైనా కానీ .తెలీదు అని అనడం ఉండదు .గారడీ లాగా ప్రశ్నలో౦ చే సమాధానం లాగుతాడు .ప్రశ్నలోనే ఉన్న మాటలనే మార్చిజవాబుగా ఇస్తాడు .ఉదాహరణ-‘’ఒంటె మెడ అంతఎత్తుకు ఎత్తి ఎందుకు నడుస్తుంది ?’’అని అడిగితె తెలివైనోడు’’దాని మెడ పొడుగయ్యా .అందుకని అలా ఎత్తక తప్పదు’’అంటాడు ఠప్పున. ఇంకోటి ‘’పిల్లి రాత్రిళ్ళు ఎలా చూడగలుగుతుంది ?’’’’చీకట్లో కళ్ళు కనబడతాయి కాబట్టి ‘’అని ప్రశ్న పూర్తిగా ఆడిగేలోపే జవాబు వస్తుంది .మరోటి –‘’సగోత్రీకులపిల్లను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ??’’’అది తప్పుకదయ్యా శాస్త్రాలు ఘోషిస్తున్నాయికాబట్టి ‘’.మరోటి ‘’అకాల వర్షాలకు కారణం ఏమిటి ?’’సకాలం లో వర్షాలు పడకపోవటమే ‘అంటాడు . ఒకసారి బీహార్ లో వరదలు ముంచేస్తుంటే ప్రధాని నెహ్రు చూడటానికి వెళ్లి తిరిగొచ్చాక విలేకరులు ‘’ఎలాగుంది వరద ?’’అని అడిగితె ‘’అంతా జలమయంగా ఉంది ‘’అన్నాడు ఇందులో తర్కం ఆత్మాశ్రయ ఉ౦దికనుక ఇదీ పర్యాయోక్తే అన్నారు నరసింహారావు జీ .
పునరుక్తి –ఒకసారి అన్నదాన్ని మళ్ళీ మళ్ళీ అనటమే పునరుక్తి అన్నారు .మొదట ఒకభాషలో అని తర్వాత అదే అర్ధాన్ని మరికొన్ని భాషల్లో అనటమూ పునరుక్తే అన్నారు మునిమాణిక్యం .మన సినిమాలో రాళ్ళపల్లి దీన్ని బాగా పండించాడు .గురజాడ కన్యాశుల్కం లో ఇది పుష్కలం అంటారు మాస్టారు ..భర్త భార్యతో ‘’ఖరీదైనది వద్దు మామూలు వాషింగ్ మెషిన్ కొందాము అంటే వినలేదు నామాట .అప్పు తీర్చటం యెంత కష్టమో నీకు తెలీదు ‘’అనగా భార్య తెలివిగా ‘’అదే మంత కష్టం లెండి .కాకపొతే ఆ అప్పు తీర్చటానికి నెలకు యాభై వంతున ఏడాది పట్టే బదులు పన్నెండు నెలలు కట్టాలి అంతేగా ?’’భర్త మాట కాదన్నట్లున్నా,నిజానికి ఇద్దర్దీ ఒకేమాట ఒకేబాట అన్నారు మునిమాణిక్యం .ఒకావిడ పక్కావిడతో ‘’ఆవిడ ఎంత చెవిటిది అంటే ఎవరన్నా పిలిస్తే వస్తున్నాను అని కూడా అనలేదు .మరో తమాషా .ఆమె మాటలు ఆమెకు వినిపించక ‘’నేనేమన్నాను ?’’అని అడుగుంది .ఆమె ఎంత మూగది అంటే ,ఆకలైతే అన్నం పెట్టమని కూడా అడగలేదు ‘’
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-10-22-ఉయ్యూరు