రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -5
14-సాహితీ విమర్శకుడు కధాశిల్పం ఫేం ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ,,లెక్చరర్ –శ్రీ వల్ల్మపాటి వెంకట సుబ్బయ్య
, వల్లంపాటి వెంకటసుబ్బయ్య (మార్చి 15, 1937 – జనవరి 2, 2007) సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.[1]
జననం
వల్లంపాటి 1937, మార్చి 15 న చిత్తూరు జిల్లా రొంపిచర్ల లో జన్మించాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, ఇంగ్లీషులో ఎం.ఏ చేసి, తరువాత హైదరాబాదు లోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ నుంచి ఎం.లిట్ పొందాడు. మదనపల్లె బీసెంట్ థియేసాఫికల్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాడు.
వల్లంపాటి కథకుడిగా తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు. పరిష్కారం, మిథ్య మొదలైన కథానికలు 40 దాకా ప్రచురించాడు. ఆయన రాసిన ఇంధ్రధనస్సు, దూర తీరాలు నవలలు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో బహుమతులు పొందాయి. వల్లంపాటి సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధుడు. ఆయన రాసిన కథా శిల్పం, నవలాశిల్పం, విమర్శా శిల్పం పుస్తకాలు తెలుగు సాహిత్య విమర్శకు ప్రామాణికాలు. అనువాదకుడిగా కుడా ఆయన ప్రసిద్ధుడే. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలను అనువదించాడు. తస్లీమా నస్రీన్ రచించిన లజ్జ, బ్రిటిష్ రచయిత ఇ.హెచ్.కార్ రచించిన చరిత్ర అంటే ఏమిటి…? ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.
ఆయన రాసిన కథాశిల్పం రచనకు 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇదే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా ఎంపిక చేసి, సత్కరించింది.
మరణం
2007, జనవరి 2 న వల్లంపాటి మదనపల్లెలో మరణించాడు.
రచనల జాబితా
నవలలు
· ఇంద్ర ధనుస్సు – 1962
· దూర తీరాలు – 1964
· మమతలు – మంచుతెరలు – 1972
· జానకి పెళ్ళి – 1974
కథలు
· బండి కదిలింది
· రానున్న శిశిరం
· బంధాలు
సాహితీ విమర్శ, పరిశోధన
· కథా శిల్పం – 1996
· నవలా శిల్పం – 1995
· నిమర్శా శిల్పం – 2002
· అనుశీలన – 1985
· నాటికవులు – 1963
· వల్లంపాటి సాహిత్య వ్యాసాలు – 1997
· రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ – 2006
అనువాదాలు
· ప్రపంచ చరిత్ర
· చరిత్ర అంటే ఏవిటి?
· చరిత్రలో ఏమి జరిగింది?
· ప్రాచీన భారతదేశం ప్రగతి
· సంప్రదాయ వాదం – 1998
· భారతదేశం చరిత్ర – (ఆర్.ఎస్.శర్మ 2002)
· బతుకంతా (కన్నడ నవల)
· లజ్జ
· నవల-ప్రజలు
ఇంకా
· ఎన్నో సంకలనాలు, సంపుటాలకు ముందు మాటలు వ్రాసాడు
· తెలుగు, కన్న, ఇంగ్లీషు భాషలలోకి, వాటినుండి అనువాదాలు చేశాడు
· ఇండో – ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన షుమారు 15 పరిశోధనా పత్రాలను లిటరరీ క్రిటేరియన్ వంటి పత్రికలలో ప్రచురించాడు.
సత్కారాలు
· తాపీ ధర్మారావు అవార్డు – 1993
· కొండేపూడి సాహిత్య సత్కారం[2]. – 1995
· తెలుగు యూనివర్శిటీ అవార్డు – 1997
· గజ్జల మల్లారెడ్డి అవార్డు – 2000
· కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2000
15-సుప్రసిద్ధ కదా రచయితా ,కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత ,డా అంబేద్కర్ యూని వర్సిటి డైరెక్టర్ –శ్రీ కేతు విశ్వనాధ రెడ్డి
కేతు విశ్వనాథ రెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయితగా ప్రసిద్ధుడు. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు
వ్యక్తిగత జీవితం
జూలై 10, 1939 న వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురం గ్రామంలో జన్మించాడు.
విద్యాభ్యాసం, వృత్తి
కడపజిల్లా గ్రామనామాలు అనే అంశంపై పరిశోధనకు గాను డాక్టరేట్ పొందాడు. పాత్రికేయుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా పదవీవిరమణ చేశాడు. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో SCERT సంపాదకుడుగా వ్యవహరించాడు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయస్థాయి దాకా అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించాడు. పాఠ్యప్రణాళికలను రూపొందించాడు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి పత్రికాసిబ్బందికి శిక్షణ ఇచ్చాడు.
సాహిత్య రంగం
ఈయన తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన రాసిన సాహితీవ్యాసాలు “దృష్టి” అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ఆధునిక తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ప్రసిద్ధుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. ప్రస్తుతం “ఈభూమి” పత్రికకు సంపాదకుడుగా పనిచేస్తున్నాడు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) కథా సంపుటులు కూడా వెలువరించాడు. ఈయన కథలు అనేకం హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాష ల్లోకి అనువాదితమయ్యాయి. వేర్లు, బోధి ఈయన రాసిన నవలలు. వేర్లు రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల. విశ్వనాధరెడ్డి, పోలు సత్యనారాయణ ఇద్దరూ కలసి చదువుకథలు[1] అనే కథల సంపుటిని సంకలనం చేశారు.
పురస్కారాలు
· కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ),
· భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా),
· తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాదు),
· రావిశాస్త్రి అవార్డు,
· రితంబరీ అవార్డు
· ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం[2].
అధ్యాపకుడుగా
· విశ్వవిద్యాలయ అధ్యాపకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అధ్యాపక పురస్కారం.
వివిధ పత్రికలలో ప్రచురితమైన వీరి కథలు కొన్ని…
· 1991 కేతు విస్వనాథరెడ్డి కథలు……. ఆంధ్రజోతి వార పత్రిక.
· 1975 ద్రోహం. విశాలాంధ్ర దిన పత్రిక.
· 1977 ఆత్మ రక్షణ. వీచిక మాస పత్రిక.
· 1977 మన ప్రేమకథలు. ఆంధ్ర జోతి మాస పత్రిక.
· 1978 విశ్వరూపం స్వాతి మాస పత్రిక.
· 1979 ఆరోజులొస్తే… నివేదిత మాస పత్రిక.
· 1980 పీర్ల సావిడి. స్వాతి మాస పత్రిక.
· 1991 ఎస్.2 బోగీలు. ఉదయం వార పత్రిక.
· 1997 ఒక జీవుడి ఆవేదన. ఆదివారం ఆంధ్రభూమి.
· 2001 కాంక్ష రచన మాస పత్రిక.
· 2003 అమ్మవారి నవ్వు. ఇండియా టుడే.[3]
ఇతరుల మాటలు
· ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందింది కాదు. అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు. కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో, స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ, రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది. ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-కాళీపట్నం రామారావు(కారా)
· 1960 నుంచి ఒకపాతిక, ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి-మధురాంతకం రాజారాం
· విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది. ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది. అలంకారాలుండవు-అనుభూతివుంటుంది; కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది. కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-సింగమనేని నారాయణ
· నీల్లు లేని రాయలసీమలో జీవన ప్రవాహంలో తనుమోసిన, అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-అల్లం రాజయ్య
· ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి. కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది. అంటే అంత కఠినమైనది. తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-చేకూరి రామారావు
· …సానుభూతితో, మానవతావాదంతో, వర్గచైతన్యంతో, స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ, స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-ఓల్గా
· ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-అఫ్సర్
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-10-22-ఉయ్యూరు