హాస్యానందం
46-అసంభవోక్తి
జరగటానికి వీల్లెనిది అసంభవం .ఊహించటానికి కూడా ఆస్కారం లేని విషయాలను నవ్వు పుట్టించటానికి రాసే ఉక్తి విశేషమే అసంభావోక్తి అని నిర్వచించారు మునుమాణిక్యం జీ .ఉదాహరన –ఒకడు నీళ్ళు పల్చగా ద్రవంలాగా ఉన్నాయి కనుక సరిపోయి౦ది కానీ ,రాళ్ళలాగా ఉన్నట్లయితే కొట్టుకొని తాగటానికి చచ్చేంత పని అయ్యేది’’ .మరొకటి ఒకడిని అంతా ఏవగించుకొంటారని చెప్పటానికి ‘’వాడ్ని చూస్తేనే అసయ్యం .వాడి నీడే వాడి వెంటరాదు ‘’.మరోటి ‘’పడవ ఎంత తేలిక అంటే పొగమంచు మీద కూడా రయ్యిన దూసుకు వెడుతుంది .ఇంకోటి ‘’ఆమెకు ఎంతసిగ్గు అంటే బట్టలు మార్చుకోనేప్పుడేకాక మనసు మార్చుకోన్నప్పుడూ తలుపు వేసుకొంటుంది ‘’ఇవి అసంభావాలే అయినా చమత్కార భాజనాలు కనుక నవ్వు పుడుతుందన్నారు మాస్టారు
ఒకడు ఎంత బలం కలాడు అంటే ‘’ఒక చేత్తో తన జుట్టు పట్టుకొని తననే భూమ్మీంచి ఆరడుగుల ఎత్తుకు లెవ నెత్తగలడు ‘’మరొకడుడు ‘’నాదొక్కటే కోరికభయ్యా .చనిపోయాక మా ఆవిడ ఎలా ఏడుస్తుందో చూడాలని ఉంది ‘’జరగటానికి వీల్లెనిదాన్ని చెప్పి చమత్కారం సాధించటం అన్నమాట .పిసినారి గురించి ఒకడు ‘’వాడు మహా పీనాసి ఎంత పీనాసి సన్నాసి అంటే ఒకే పంచాంగాన్ని ఏళ్ళ తరబడి వాడుతాడు ‘’.మరోటి ‘’ఆమె యెంత ఎత్తు అంటే ,తనపళ్ళు తనకే అందకా ,కుర్చీ ఎక్కి మరీ తోముకుంటుంది’’ .ఇంకోతి-‘’ఆమెకు జ్ఞాపకశక్తి పోయింది .తాను బతికి ఉందొ లేదో పక్క వాళ్ళని అడిగి తెలుసుకొంటు౦ది .’’ఒక కొంటె కుర్రాడు ‘’నువ్వు బతికి ఉన్నావని ఎవరు చెప్పారమ్మా ఆ మాట శుద్ధ అబద్ధం .అన్నాడు వెంటనే ఆమె ‘’నేను చచ్చానన్న సంగతి నాకెందుకు చెప్పలేదు ‘’అని ఏడుస్తూ కూర్చుంది .’’స్నానానికి చన్నీళ్ళు మంచిదే కానీ అందులో కొన్ని వేన్నీళ్ళు కలిపితే ప్రశస్తం ‘’.మరోటి ‘’ఆకవి పద్యాలన్నీ వచనంలోనే అఘోరిస్తాడు ‘’.ఒక హాస్యరచయిత ‘’భార్యా విధేయుడు వేళకు కొంపకు చేరతాడు లేకపోతెభార్య చెవులు మేలేస్తు౦దనొ సాదిస్తు౦దనొనభయం .కానీ అటువంటి వాడుకాదట తనను ఇంటికి చేర్చే రైలు తప్పినా ఎక్కటంమానడుట .
ఒకాయన తనతో మాట్లాడటానికి వచ్చిన స్నేహితుడితో ‘’ఇక్కడే వెయిట్ చేయి నేను అలావెల్లి వస్తా .నేను లేనప్పుడు నేను రావచ్చు అప్పుడు నువ్వు నన్ను మిస్ అవుతావు –దీన్నే ఇంగ్లీష్ లో ‘’Imay come in my absence ‘’అని అంటారు .దీన్ని అబ్సర్డ్ అన్నారు అందులోనే మనోహర చమత్కారం ఉందన్నారు సార్. అబ్సర్డిటి చమత్కారానికి గని అన్నారు ముని జీ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-10-22-ఉయ్యూరు