’ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతే౦దు హరిశ్చంద్ర -6
విక్టోరియా రాణికాలం లో హరిశ్చంద్ర 11వ ఏట నే ప్రిన్స్ ఆల్బర్ట్ ను అభినందిస్తూ ఒకపద్యం రాశాడు .తాను స్థాపించిన పాఠశాలలో ప్రతియేటా రాణి పుట్టినరోజు జరిపేవాడు . దేపాలతొఅల౦క రింప జెసి ,కాశీ పండితులతో యువరాజుకు ఆశీస్సు పద్యాలు చెప్పించి ,ప్రశంసా పత్రాలు అచ్చువేయించి యువరాజుకు బహుమతిగా పంపేవాడు .బ్రిటిష్ వారి ఆదరాభిమానాలు పొందటం చేత ,ఆయన్ను మునిసి పల్ అదికారిగా ,గౌరవ న్యాయాధికారిగా చేసి గౌరవించేవారు .న్యాయవిచారణ సంఘ గౌరవ స్థానం చాల చిన్న వయసులోనే పొందాడు .కాశీలో ఇలాంటి గౌరవం పొందినవారిలో ఇతడే అతి చిన్నవాడు .అతని పత్రికలకు పోషకులుగా ప్రభుత్వం ఉండటంకూడా గౌరవానికి గుర్తే .డైరెక్ట్ గా లండన్ లోని సె౦ట్ జేమ్స్ రాజగృహంతో సంబంధాలు నెలకొల్పుకున్నాడు .1871లోచక్రవర్తి ఆధ్వర్యం లో జరిగిన జగద్విఖ్యాత ప్రదర్శనకు యితడు పంపిన పురాతన వస్తువులకు వేల్స్ యువరాజు స్వయంగా యోగ్యతా పత్రం బహూకరించాడు .ఇంగ్లాండ్ రాజు రాణీలతోనేకాకుండా రష్యా జార్ చక్రవర్తి ,జర్మనీ ఖైజర్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు .తన పుస్తకాలు వారికి పంపటంతో మొదటిసారిగా విదేశాలకు హిందీ సాహిత్యాన్ని పరిచయం చేసిన ఘనకీర్తి పొందాడు .తూర్పు దేశ భాషలతో బాగా పరిచయమున్న గార్కాన్ డిటాస్, తోనూ పరిచయం పొందాడు .రష్యా ఆలోచనా సభ సభ్యుడు సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి ఇతనికి రాసిన లేఖను బట్టి 1870లో తూర్పు దేశ భాషలలో పరిజ్ఞానమున్న రష్యా దేశీయులకు హరిశ్చంద్ర రచనలతో బాగా పరిచయంన్నట్లు తెలుస్తోంది .బ్రిటిష్ వారిద్వార బెర్లిన్ కు, పిట్స్ బర్గ్ కు పంపిన పుస్తకాలు అందినట్లు ఇండియా గవర్నర్ కు, ఉత్తరప్రదేశ్ గవర్నర కు వ్రాతపూర్వక సమాచారం చేరేది .
యువరాజు ఇండియావస్తే అతనిపై ప్రశంసా పద్యాలు,రాణి హంతకుల తుపాకి దేబ్బలనుంచి తప్పించుకొన్న దానిపై కవితలు అల్లాడు .భారతీయులతో ఉన్న బ్రిటిష్ సైన్యం విజయాలు సాధిస్తే ఉత్సాహంగా కవితలు కూర్చాడు . కాశీ వచ్చిన రాజ కుటుంబీకులతో స్నేహభావంగా మెదిలేవాడు .ఇవన్నీ రాజా శివరాం ప్రసాద్ కు కంటకంగా ఉండేది .వారిని సరదాగా ఆటపట్టి౦చి యేదడిపించేవాడు .ఇలాంటి బ్రిటిష్ వీరాభిమాని 1870విదేశీ వస్తు నిషేధానికి ఉద్యమించాడు అంటే ఆశ్చర్యమేస్తుంది .స్వదేశీ వస్తువులే వాడమని ప్రమాణాలు చేయించాడు .కొద్దికాలం తర్వాత ఇతని ఈరకమైన అభిప్రాయాన్ని బ్రిటిష్ వారు సహించలేకపోయారు .పత్రిక పోషణ మానేశారు .దీనికి నిరసనగా ఈయన మున్సిపిల అధికార,గౌరవ న్యాయాధీశ పదవులకు రాజీనామా చేసి తన దేశభక్తి నిరూపించాడు .దేశమే అత్యున్నతమైనది అన్న భావం నిలబెట్టాడు .ఇతని పత్రికలూ అందులోని వ్యాసాలూ ప్రభుత్వ వ్యతిరేకం గా ఉన్నాయని ప్రత్యర్ధులు కాకిగోల చేశారు .ప్రభుత్వం చెప్పుడుమాటలకు లొంగి ఈయన ప్రత్యర్ధి శివరామ ప్రసాద్ ను దగ్గరకు చేర్చుకున్నది.దీనిఫలితంగా ఇతని కవి వచన సుధ పత్రిక ఆర్ధికంగా నష్టపోగా,చివారికి దివాలా తీసింది .పత్రికను స్నేహితుడికి ఇచ్చేశాడు .బాలబోధిని పత్రికకూ ఇలాంటి స్థితి ఏర్పడగా ,దాన్నీ మూసేశాడు .మిత్రునితో మాట్లాడి కవివచన కు దీన్ని అనుబంధం చేసినా దాని ప్రత్యేకత కోల్పోయింది .చివరికి కవి వచన సుధ ఆయన ప్రత్యర్దిశివ రామప్రసాద్ చేతికి చిక్కింది .
ఒక్క చంద్రికను మాత్రమేకొంతకాలం నడిపి తర్వాత మిత్రుడు మోహన చంద్ర దాన్ని తనపత్రికలో కలిపేయమని కోరగా చివరికి అది ‘’హరిశ్చంద్ర మోహన చంద్రిక’’గా వెలువడింది .మోహన్ లాల్ విష్ణూ లాల్ పాండ్య కు ఉద్యోగం రాగా పత్రిక ఉదయపూర్ కు మారి,తర్వాత నఢ్ధావాలాకు మారి చివరికి ఎడారిలో కలిసిపోయింది .చనిపోవటానికి కొంతకాలం ముందు హరిశ్చంద్ర తన ప్రియమైన చంద్రికను ‘’నవోదిత చంద్రిక ‘’గా ముద్రించాడు .కానీ ఎంతోకాలం కాకుండానే కన్ను మూశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-22-ఉయ్యూరు
.