హాస్యానందం
47- వ్యాజోక్తి
అసలు దాన్ని వేరే నెపం తో చెప్పటం వ్యాజోక్తి .నాయికకు నరస భూపలుడిని చూస్తె ,ఆనంద బాష్పాలు వస్తే ,ఆమాట చెప్పటానికి సిగ్గుపడి అగరు ధూపం వలనఆనంద బాష్పాలు కారాయని చెప్పింది .ఒక కధకుడు ‘’ఆమెకు భర్తపై చాలా దయ ఉంది . .భర్తపై ఆమెకు అమితమైన ప్రేమ దయా ఉన్నాయి ఆమెకు కోపం వస్తే మొగుడి చెవి మేలేసినా ,దానివల్ల వచ్చే వాపు తగ్గటానికి వెంటనే మందు రాస్తుంది ‘’అని తమాషా ఉదాహరణ ఇచ్చారు మునిమాణిక్యం .మేలేయటం లో ధూర్త లక్షణం కనిపించినా ,మందు రాయటం తో దాన్ని కప్పేసింది .మరోటి ‘’అప్పుడప్పుడు ఆమె మొగుడిపై కాఫీ కప్పు విసుర్తుంది .కనీ ఆయన బట్టలు ఖరాబుకాకుండా కాఫీ వేరే దాన్లో పోసి ఖాళీ కప్పే విసుర్తుంది .అందులో స్పూన్ తేసేసి మరీ విసుర్తుంది అది తగిలి ఆయనముఖం వాచిపోతు౦ దేమోననే భయంతో ‘’.మునిమాణిక్యం గారి మామ్మ ఒక కత చెప్పిందట –ఒక కోడలు లేచిపోతూ ‘’అత్తానీకొడుకు ఆకలికి ఆగలేడు జాగ్రత్తగా చూసుకో అందట .
చేసే పనివలన బయట పడే గుణం ఒకటి ,దాని తర్వాత అన్నమాటలవలన స్పురించే భావం వేరొకటి .ఆ మాటల్లో అప్రకటిత భావాన్ని దాచే ప్రయత్నం ఉంటుంది లక్షణ కర్త చెప్పింది కాదుకానీ తానె సరదాగా దీన్ని వ్యాజోక్తి కింద జమ కట్టానని మాస్టారువాచ. హాస్యంలో పారిభాషిక పదాలు లేవుకనుక సాహిత్యం లో ఒక అర్ధం లో స్థిరపడిన ఉన్నమాటకే విశేషార్ధం కల్పించి ఇలాంటి పారిభాషిక పదాలు సృష్టించాల్సి వచ్చిందని ఇదివరకే చెప్పాననీ ఇప్పుడు చేస్తుంది అదే అని మునిమాణిక్యం సార న్నారు.
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-22-ఉయ్యూరు .