ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ
— సుబ్రహ్మణ్య శివ (అక్టోబర్ 4, 1884 – జూలై 23, 1925) భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత.[3]
జననం
సుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు.
ఉద్యమంలో
ఈయన్ని 1908లో బ్రిటీష్ వారు అరెస్టు చేశారు. మద్రాసు జైలులో మొదటి రాజకీయ ఖైదీ సుబ్రహ్మణ్య శివనే. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కుష్ఠువ్యాధి రావడంతో సుబ్రహ్మణ్య శివను సేలం జైలుకు మార్చారు. వ్యాధికి గురైన ఈయన్ను బ్రిటీష్ అధికారులు రైలులో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకన ప్రయాణించాడు. 1922వరకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన సుబ్రహ్మణ్య శివ అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. జ్ఞానభాను పత్రిక, రామానుజ విజయ, మాధవ విజయం పుస్తకాలు రచించాడు.[3]
గౌరవాలు
సుబ్రహ్మణ్య శివ మరణానాంతరం దిండుగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తియాగి సుబ్రమణ్య శివ మాళిగైగా పేరు పెట్టబడింది. ధర్మపురి జిల్లా పెన్నగడం సమీపంలోని పప్పరపట్టి వద్ద ఒక స్మారక చిహ్నం స్థాపించబడింది.[4]
మరణం
1925, జూలై 23న కుష్టువ్యాధితో చనిపోయాడు.[1]
మీ -గబ్బిట దుర్గాప్రసాద్-20-10-22-ఉయ్యూరు