మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -319
319–పార్లమెంట్ సభ్యుడు చిలకమ్మ చెప్పింది ,సినీ నిర్మాత ,ఫిలిం అభివ్రుద్ధిమండలి చైర్మన్ –చేగొండి హరిరామ జోగయ్య
చేగొండి వెంకట హరిరామజోగయ్య (జ: 5 ఏప్రిల్, 1937) భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.
వీరు నారాయణ స్వామి, కమలమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో 1937 సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం విజయవాడలో జరిగింది.
1960-1966 మధ్యకాలంలో పంచాయితీ సమితి ప్రెసిడెంటుగా ఆ తరువాత 1971 వరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు.
వీరు 1972 – 1988 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 1983, 1988 లో నర్సాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. వీరు 1984-85 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం మినిస్టర్ గా, 1990-91లో అటవీశాఖ మంత్రిగా తరువాత 1993-95లో గనులు, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.
ఇతడు 2004 సంవత్సరంలో 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో మొదలైన ఏడు తెలుగు సినిమాలు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు చేగొండి హరిబాబు గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద దేవుళ్లు సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది, నాలాగేఎందరో
320-కురుక్షేత్రం సినీ కళాదర్శకుడు –కుదరవల్లి నాగేశ్వరరావు
కుదరవల్లి నాగేశ్వరరావు ప్రముఖ సినీ కళా దర్శకుడు.
వీరు సృష్టించిన అపూర్వ కళాఖండం 1977లో కృష్ణ నిర్మించిన కురుక్షేత్రం.[1]
డ్రైవర్ రాముడు
చిత్ర సమాహారం
· 1949 : గుణసుందరి కథ
· 1963 : తిరుపతమ్మ కథ
· 1967 : భామా విజయం
· 1968 : రణభేరి
· 1970 : లక్ష్మీ కటాక్షం[2]
· 1974 : తిరపతి [3]
· 1975 : మాయామశ్చీంద్ర [4]
· 1977 : కురుక్షేత్రం
· 1979 : డ్రైవర్ రాముడు
· 1979 : శ్రీమద్విరాట పర్వము
· 1980 : ఆటగాడు [5]
321-అల్లుడు శీను నిర్మాత –బెల్లంకొండ సురేష్
బెల్లంకొండ సురేష్ ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు పొందారు.
జీవిత చరిత్ర
బెల్లంకొండ సురేష్ సతీమణి పద్మావతి. వీరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ బాబు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ 2014లో అల్లుడు శీనుతో అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఆయన రెండో కుమారుడు బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాత. కాగా 2022లో స్వాతిముత్యం సినిమాతో ఆయన హీరోగా పరిచయం కాబోతోన్నాడు.
వివాదం
టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 2004 జూన్ 3న జరిగిన కాల్పుల ఘటనలో ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్, అతని అసోసియేట్ సత్యనారాయణ చౌదరిపై నటుడు కాల్పులు జరిపాడు. అనంతరం క్షతగాత్రులిద్దరినీ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.[1] ఈ కేసు విచారణ, దానిని హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రశ్నించడం లాంటివి అప్పట్లో చాలా వివాదానికి దారితీశాయి.[2]
322-మరోచరిత్ర మిషన్ ఇంపాజిబుల్ నిర్మాత ,న్యాయవాది ,రాజకీయ నాయకుడు –నిరంజన్ రెడ్డి
సిర్గాపుర్ నిరంజన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, సినీ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు. ఆయనను 2022 మే 17న వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[1
జననం, విద్యాభాస్యం
నిరంజన్‌రెడ్డి 1970 జులై 23న తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, దిలావర్‌పూర్ మండలం, సిర్గాపూర్ గ్రామంలో విద్యాసాగర్ రెడ్డి, విజయ లక్ష్మి దంపతులు జన్మించాడు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నత విద్యంతా పూర్తి చేసి పుణెలోని సింబయాసిస్ లా కాలేజీలో న్యాయవిద్య పూర్తి చేశాడు.[2]
వృత్తి జీవితం
నిరంజన్‌రెడ్డి సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులు ఒ.మనోహర్‌రెడ్డి, కె.ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్‌గా పని చేసి రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై 1992 నుంచి హైకోర్టులో, 1994 నుండి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 2016లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేపని చేసి, రాష్ట్ర విభజన అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నియమితుడయ్యాడు.[3]
రాజకీయ జీవితం
నిరంజన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా 2022 మే 17న ప్రకటించింది.[4]
నిర్మించిన సినిమాలు
ఆయన 2002లో హైదరాబాదులో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ తెలుగు సినీ నిర్మాణ సంస్థను స్థాపించాను. ఆయన మొదట దిల్ రాజు సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధ సంస్థగా ఈ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభించి ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తరువాత, పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి, 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించింది.
క్రమసంఖ్య
సంవత్సరం
సినిమా పేరు
భాష
గమనిక
1
2010
మరోచరిత్ర
తెలుగు
అనుబంధ సంస్థగా
2
2011
గగనం
తెలుగు
అనుబంధ సంస్థగా
3
2016
క్షణం
తెలుగు
4
2017
ఘాజీ
తెలుగు, హిందీ
5
2017
రాజు గారి గది 2
తెలుగు
అనుబంధ సంస్థగా
6
2021
ఆచార్య
తెలుగు
7
2021
వైల్డ్ డాగ్
తెలుగు
8
2021
అర్జున ఫల్గుణ
తెలుగు
[5]
9
2022
మిషన్ ఇంపాజిబుల్
తెలుగు
సశేషం
-మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-22-ఉయ్యూరు