49- వినోక్తి
gabbita prasad | Thu, Oct 20, 8:45 PM (13 hours ago) | ![]() ![]() | |
to sahitibandhu@googlegroups.com, Andukuri, Narasimha, Vuppaladhadiyam, Gopala, Krishna, గోదావరి, Lavanya, Padma, Padmasri, Durvasula, Sastri, mrvs, GITANJALI, Ramky, Sai, Pavan![]() |
హాస్యానందం
49- వినోక్తి
అని ఒక అలంకారం .ఒకదాన్ని వదిలేస్తే మరొకటి అందంగా ఉన్నట్లు చెబితే అది వినోక్తిఅని నిర్వచించారు మునిమాణిక్యం నరసింహా రావు గారు. కావ్యాలంకార కర్త ఉదాహరణ గా క్రూరతలేని చూపు సుందరం .రవిలేని నభం అసుందరం .మనింట్లో భార్యాభర్తల సంభాషణలలో ఇలాంటివి దొర్లుతాయన్నారుమాస్టారు .ఒకసారి మాస్టారిగది అంతా చిందర వందరగా,నానా కంగాళీగా ఉంటె కా౦త౦ గార్నిపిలిచి ‘’ఇల్లంతా ఇంత అసెయ్య౦గా ఉందేమిటి ?’’అని అడిగితె ‘’అలా ఉంటేనే అందం .అప్పుడే పిల్లలున్న కుటుంబం అని తెలుస్తుంది అవి లేకపోతె శోభే ఉండదు ‘’అన్నారని గురువాచ .
ఆవిడే ఇంకోసారి ‘’కిచకిచాలాడే పిచ్చికలు ,గలగలలాడే పిల్లలు లేనిఇల్లు ఇల్లెకాదు ‘’అన్నారట .ఇంకోసారి ఆమె ‘’గోడలకు బూజు కోడలికి పోజూ పనికి రావు ‘’అలానే మరోసారి ‘’వాసన లేనిమద్యం ,దోషం లేనిపద్యం సుందరం ‘’అన్నారు .అలానే ‘’ప్రాకారం లేనిగోపురాలు ,సహకారం లేనికాపురాలూ అందం లేని నవ్వు మకరందం లేనిపువ్వు ,కండలు లేని ఒళ్ళు ,ముండలు లేని ఊళ్లు అసు౦దరాలుఅని ఆయన స్నేహితుడు అదే ధోరణలో వాక్రుచ్చడట ..
ఇంకో ఇంచి ముందుకేసి ఒక కవి –బొజ్జలేని గణపతి ,లజ్జలేని కులపతి ,టాపులేనికారు ,పోపులేనికూర ,జుట్టులేని తల ,బొట్టులేనిముఖం ,ఎరుకలేనిచదువు ,ఎరుపులేని పెదవి ,ముక్కులేనిమోము ,ముద్దులేని ప్రేమ ,అని గిలికాడు .అదే బాణిలో మాస్టారు –ఒక గుణము బాసి వస్తు-వొప్పిదమును బాయు నననెడి –వింతయైన వినోక్తికి –సొంతమైన ఎక్సాంపూల్స్ –చొక్కమైన శాంపిల్స్ ‘’అని ‘’ముదురులేని ముంజలు ,ముసురులేని సంజలు ,ముండ్లు లేని బాటలు ముళ్ళు లేనిమాటలు ,మచ్చలేనజాబిలి ,రొచ్చులేనివాకిలి ,పుచ్చులేనిగింజలు ,పచ్చిలేని లంజలు ,మట్టిలేనిబుర్రలు ,పొట్టలేనిపిర్రలు ,-‘ఒకటి లేనికతన మొప్పిదమగునవి చెప్పేడు వింతయైన వినోక్తి –సొంతమైన ఎక్సాంపూల్స్ –చొక్కమైన శామ్పుల్స్ ‘’అని నాన్ స్టాప్ గా వాయించేశారు
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-10-22-ఉయ్యూరు