మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -323
323-శుభలగ్నం నంబర్ వన్ సినీ నిర్మాత,అనేక అవార్డులగ్రహీత –అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
అడుసుమిల్లి వేంకటేశ్వర రావు తెలుగు సినిమా నిర్మాత. నిర్మించిన తక్కువ చిత్రాలతోటే ఎక్కువ ప్రజాదరణ పొందిన నిర్మాత ఆయన.[1]
జివిత విశేషాలు
వెంకటేశ్వరరావు నంబర్‌వన్, శుభలగ్నంతోపాటు పలు సినిమాలు నిర్మించారు.[2]
మరణం
ఆయన అనారోగ్యంతో బుధవారం ఆగష్టు 19 2015 న మృతిచెందారు.పేగు సంబంధిత సమస్యతో బాధపడుతూ కొద్ది రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. [3
324-దూకుడు సినీ నిర్మాత రచయితా ,దర్శకుడు –అనిల్ సుంకర
అనిల్ సుంకర, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకుడు. ఇతడు నిర్మించిన దూకుడు సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది.[1][2]
సినిమారంగం
అనిల్ సుంకర, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నమో వెంకటేశ, 1 – నేనొక్కడినే, లెజెండ్, ఆగడు, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, హైపర్, లై మొదలైన సినిమాలను, ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిందాస్, ఆహా నా పెళ్ళంట, యాక్షన్ 3D, జేమ్స్ బాండ్, రన్, ఈడోరకం ఆడోరకం, ఈడు గోల్డ్ ఎహె, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, కిరాక్ పార్టీ, రాజుగాడు, సీత, చాణక్య మొదలైన సినిమాలను నిర్మించాడు. 2013లో యాక్షన్ 3D చిత్రానికి దర్శకత్వం వహించాడు. మహాసముద్రం సినిమా, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ బయోపిక్ నిర్మాణ దశలో ఉన్నాయి.[3][4][5]
సినిమాలు
నిర్మాతగా
క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు |
29 | 2021 | మహాసముద్రం |
28 | 2020 | సరిలేరు నీకెవ్వరు |
27 | 2019 | చాణక్య |
25 | 2019 | సీత |
24 | 2018 | రాజుగాడు |
23 | 2018 | కిరాక్ పార్టీ |
22 | 2017 | లై[6] |
21 | 2017 | అంధగాడు |
20 | 2017 | కిట్టు ఉన్నాడు జాగ్రత |
19 | 2016 | ఈడు గోల్డ్ ఎహె |
18 | 2016 | హైపర్ |
17 | 2016 | సెల్ఫీ రాజా |
16 | 2016 | ఈడోరకం ఆడోరకం |
15 | 2016 | రన్ |
14 | 2016 | కృష్ణ గాడి వీర ప్రేమ గాథ |
13 | 2015 | రాజు గారి గది |
12 | 2015 | జేమ్స్ బాండ్ |
11 | 2014 | ఆగడు |
10 | 2014 | పవర్ |
9 | 2014 | లెజెండ్ |
8 | 2014 | చందమామ కథలు[7] |
7 | 2014 | 1 – నేనొక్కడినే |
6 | 2013 | యాక్షన్ 3D |
5 | 2012 | వెన్నెల 1 1/2 |
4 | 2011 | దూకుడు |
3 | 2011 | ఆహా నా పెళ్ళంట |
2 | 2010 | నమో వెంకటేశ |
1 | 2010 | బిందాస్ |
దర్శకుడిగా
· యాక్షన్ 3D (2013)
అవార్డులు
· ఉత్తమ చిత్ర విభాగంలో సినీ’మా’ అవార్డు (2012): దూకుడు
· ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డు (2012): దూకుడు
· ఉత్తమ చిత్రంగా సైమా అవార్డు (2012): దూకుడు
· ఉత్తమ చిత్ర విభాగంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డు (2012): దూకుడు
· ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది అవార్డు (2013): దూకుడు
· తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర పురస్కారం (2015): చందమామ కథలు
325-టెన్త్ క్లాస్ ,నోట్ బుక్ సినీ దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత–చందు
చందు (సత్తి చంద్రశేఖర్ రెడ్డి) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.
జీవిత విషయాలు]
చందు 1975, అక్టోబరు 17న ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని వెదురుపాక గ్రామంలో జన్మించాడు. రాజమండ్రిలోని సెయింట్స్, ఎస్‌కెవిటి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.
సినిమారంగం
2003లో రాంప్రాసాద్ దర్శకత్వం వహించిన కళ్యాణ రాముడు, 2004లో వి. వి. వినాయక్ దర్శకత్వం వహించిన సాంబ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినిమారంగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 2005లో ఎస్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరులో శ్యామ్ ప్రసాద్ నిర్మించిన టెన్త్ క్లాస్ సినిమాకు చందు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1] ఇది 2006లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. తరువాత 2007లో నోట్ బుక్ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 2013లో ప్రేమ ఒక మైకం సినిమాకి దర్శకత్వం వహించాడు.[2]
సినిమాలు
దర్శకుడిగా
· టెన్త్ క్లాస్ (2006)[3]
· నోట్ బుక్ (2007)
· ప్రేమ ఒక మైకం (2013)
అసిస్టెంట్ డైరెక్టర్‌గా
· కళ్యాణ రాముడు (2003)
· సాంబ (2004)
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-22-ఉయ్యూరు