ధర్మవీర పండిత లేఖరాం
సికందరాబాద్ శ్రీ గాయత్రీ ఆశ్రమ ట్రస్ట్ అనేక సిద్ధాంత ,నీతి గ్రంధాలు ,మహాపురుషుల జీవిత చరిత్రలు ప్రచురిస్తూ 25వ కుసుమంగా ధర్మవీర పండిత లేఖరాం గారి జీవిత ప్రచురించింది .బలిదానం లో ‘’వీర తృతీయ ‘’గా ఉన్న లేఖరాం తన 39సంవత్సరాలజీవితం లో 20ఏళ్ళు వైదిక ధర్మ ప్రచారానికే అంకితం చేశారు .35వ ఏట వివాహమాడి ,అయిదేళ్ళయినా వివాహ జీవితం గడపని నిరంతర కార్యశీలి. ధర్మపత్ని లక్ష్మీదేవి కూడా త్యాగమయ జీవితం గడిపిన ఆదర్శ మహిళ.భయం ఎరుగని మేరునగధీరుడు లేఖరాం నేటి తరానికి ప్రేరణగా నిలిచారు .ఈమహామహుని జీవిత చరిత్రను హిందీలో త్రిలోక చంద్ర విశారద రాస్తే ,శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు తెలుగు అనువాదం చేశారు .1997లో ప్రచురింపబడిన ఈపుస్తకం ఖరీదు 3 రూపాయలు .
రావల్పిండి జిల్లా పోఠోహార్ లో ,ఇప్పుడుగురుకులాలున్న చోట లేఖరాం వంశస్తులు ఉండేవారు .తాత మహతా నారాయణ్ సింహ్ తండ్రి సయ్యద్ పురగ్రామం లో స్థిరపడ్డాడు .ఈగ్రామం జీలం జిల్లా లో చక్వాల్ తాలూకాకు సుమారు 10కిలోమీటర్లదూరంలో ఎత్తైన కొండలమీద ఉంది .ఇక్కడే లేఖరాం జన్మించాడు .మూడువైపులా వర్షాకాల నదులు ప్రవహిస్తాయి. అయన శారీరక మానసిక స్థితిపై ఇవి గొప్ప ప్రభావం చూపాయి .దృఢమైన శరీరం ,తీవ్రమైన ఆలోచనలు ఆయనవి .
జననం
లేఖరాం తాత కు మహతా తారాసి౦హ్ ,మహతా గండా సింహ్ అనే ఇద్దరుకొడుకులు .తారా సింహ ముగ్గురు కుమారులలో లేఖరాం 1859లో జన్మించాడు .ఇండియాలో ఆంగ్లసామ్రాజ్య స్థాపన తర్వాత ప్రజలనుంచి ఆయుధాలు లాగేసుకొన్నారు .ఆంగ్లేయులకు స్వయంగా ఆయుధాలు అప్పగించటం అవమానంగా భావించి వాటిని పూంచ్ రాజ్యానికి తీసుకు వెళ్లి అమ్మేశారు .శ్యాం సిన్హ బ్రహ్మచారి. సిక్కు సామ్రాజ్యపతనం తర్వాత సాధువుగా మారాడు .దీనిప్రభావం లేఖరాం పై పడింది .
విద్యాభ్యాసం జీవితం
ఆరేళ్ళ వయసులో లేఖరాం తండ్రి గ్రామపాఠలలో పార్సేఉర్దూ లు నేర్చాడు .చలాకీ కుర్రాడు . ,ఒకసారి విద్యాశాఖాధికారి వస్తే తన బుద్ధిబలం ప్రదర్శి౦చి ,అనెకబహుమానాలు పొందాడు .పెషావర్ లో ఉన్న పినతండ్రి దగ్గరకు 11వ ఏట వెళ్ళాడు .ఆయన ఇతని విద్యకోసం ఒక ముస్లిం ఉపాధ్యాయుడిని నియమించాడు .ఆయన ముస్లిం భావాలు వ్యాప్తి చేస్తూడటం నచ్చక మానేశాడు .పినతండ్రి బదిలీ అయిన ప్రతి సారీ చదువుకు విఘాతకలిగి,చదువుసాగనందున స్వగ్రామానికి పంపెశాడుపినతండ్రి.14వ ఏట మళ్ళీ గ్రామపాఠశాలలో చేరి చదివాడు .హెడ్ మాస్టర్ ఇతనిపై మంచి అభిమానం చూపేవాడు .
ఇతడు చొక్కా గుండీలుసరిగ్గా పెట్టుకోనేవాడుకాదు .టోపీ ఊడినా సరి చేసుకొనేవాడుకాదు .ప్రతివిషయం చదివి స్వయంగా గ్రహించేవాడు .కవిత్వంపై మక్కువకలిగింది .
పోలీసు ఉద్యోగం
21-12-1875న పెషావర్ లో పోలీసు ఉద్యోగంలో17వ ఏట చేరి ,అయిదేళ్ళు పని చేశాడు .మనసు నిరంతర౦ ఈశ్వర లగ్నమై ఉండటం వలన ఉద్యోగం మానేశాడు .నిత్యభజనలు చేసే సిక్కు సిపాయి ప్రభావం ఇతనిపై పదడి ,నిర౦తర ఈశ్వరోపాసనలో గడిపాడు .నిత్యం గీత చదివేవాడు .శ్రీ కృష్ణునిపై అమిత భక్తి ఏర్పడింది .కృష్ణ నామ జపం అర్ధసహిత౦ గా చేసేవాడు .ఉద్యోగం మానేసి బృందావనం చేరాడు .
వైదిక ధర్మం వైపు దృష్టి మరలటం
క్రమంగా అన్నిమతాలపై ప్రేమ భావం కలిగింది .పంజాబ్ సంఘ సంస్కర్త కన్హయాలాల్ అలక్ ధారి పుస్తకాలు చదివి మహర్షి దయానంద రచనలతో పరిచయమేర్పడింది .అద్వైతం కనుమరుగైంది .మహర్షి గ్రంథాల అధ్యయనం చేసి వైదికధర్మ సేవకుడైనాడు
పెషావర్ లో ఆర్య సమాజం
పండిత లేఖరాం ఆర్య సమాజ సిద్ధాంతాలపై జీవించాలని నిర్ణయించుకొన్నాడు .1880లో పెషావర్ లో ఆర్య సమాజాన్ని స్థాపింఛి ,మాయీ రంజీ ధర్మశాలలో ఉన్నాడు .దైనిక సమావేశాలు జరుపుతూ ధర్మాన్ని ప్రచారం చేశాడు .
మహర్షి దర్శనం
దయానందసారస్వతం చదివినప్పటినుంచీ ఆయన్ను ఎప్పుడు దర్శిస్తానా అని తహతహ లాడేవాడు .ఒక నెల సెలవు తీసుకొని అజ్మీర్ లో సేఠ్ ఫతెమల్ దేవిడీలో మహర్షిదయానందుని దర్శించాడు .వ్యాపక పదార్దాలైన ఆకాశం ,బ్రహ్మతత్వం ఒకే స్థానంలో ఎలాఉ౦టాయి అని ఋషిని అడిగితె, ఆయన ఒకరాయిని చూపించి అందులో అగ్ని, మట్టి, పరమాత్మ ఉన్నాయాలేదా అని అడిగి ఒకసూక్ష్మ వస్తువు ఒక స్థూల వస్తువులో వ్యాపించి ఉంటుంది అని చెప్పగా పరమానందం పొందాడు లేఖరాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు