మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -331
331-మీర్జాపురం రాజా ,కృష్ణ వేణి దంపతులకుమార్తే ,,చక్రధారి అనుబంధం నిర్మాత లక్ష్మీ కంబైన్స్ అధినేత్రి –ఎన్.అనూరాధా దేవి
ఎన్. అనూరాధాదేవి తెలుగు చలనచిత్ర నిర్మాత. బహుకొద్దిమంది మహిళా నిర్మాతలలో ఈవిడ ఒకరు. ఈమె మూడు తరాల హీరోలతో చిత్రాలను నిర్మించింది. ఈమె నిర్మించిన సినిమాలలో 80 శాతం విజయవంతమై స
జీవిత విశేషాలు
ఈమె 1947, అక్టోబరు 24న విజయవాడలో జన్మించింది. ఈమె తండ్రి శోభనాచల పిక్చర్స్ అధినేత మిర్జాపురం రాజాగా ప్రసిద్ధులైన రాజా వెంకట్రామ అప్పారావు. ఈమె తల్లి సుప్రసిద్ధ నటి, నిర్మాత సి.కృష్ణవేణి. ఈమె మద్రాసులోని గుడ్ షెపర్డ్ స్కూలులో ఎనిమిదవ తరగతి వరకు చదివింది. ఆ తరువాత ఈమెకు చదువు అబ్బకపోవడంతో అంతటితో ఆపివేసింది. ఈమెకు 1967లో వరంగల్లు వాస్తవ్యుడు నంగనూరు శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. ఈమె భర్త 2005లో మరణించాడు[1].
సినిమా నిర్మాణం
ఈమె తండ్రి మీర్జాపురం రాజా తన తరువాత కూడా చలనచిత్ర నిర్మాణ రంగ కార్యకలాపాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఈమెను నిర్మాతగా కొనసాగమని కోరాడు. అతనే లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ అనే బ్యానరు పేరు పెట్టాడు. ఈమె మొదట కన్నడ భాషలో రాజ్‌కుమార్ హీరోగా భక్త కుంబార అనే సినిమాను కలర్‌లో నిర్మించింది. ఈ సినిమా 1974లో విడుదలయ్యింది. తరువాత ఈ సినిమానే తెలుగులో చక్రధారి పేరుతో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రీమేక్ చేసింది. ఆ తరువాత హిందీలో హిట్ అయిన సినిమా “సమాధి”ని నిండు మనిషి పేరుతో నిర్మించింది. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తరువాత ఈమె అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, చిరంజీవి, వడ్డే నవీన్, అబ్బాస్, రవితేజ, జె.డి.చక్రవర్తి మొదలైన హీరోలతో, దాసరి నారాయణరావు, ఎ.కోదండరామిరెడ్డి, సి.వి.శ్రీధర్, టి.ఎల్.వి.ప్రసాద్ వంటి దర్శకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది.
సినిమాల జాబితా
ఈమె నిర్మాతగా లక్ష్మీ ఫిలిం కంబైన్స్ బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన సినిమాల పాక్షిక జాబితా:
- చక్రధారి (1977)
- నిండు మనిషి (1978)
- రావణుడే రాముడైతే (1979)
- శ్రీవారి ముచ్చట్లు (1981)
- రాముడు కాదు కృష్ణుడు (1983)
- అనుబంధం (1984)
- ఆలయదీపం (1985)
- ఇల్లాలే దేవత (1985)
- ప్రియా ఓ ప్రియా (1997)
- ప్రేమించేమనసు (1999)
- మా పెళ్ళికి రండి (2000)
క్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు సంపాదించుకుంది.
332-తెలుగు ,కన్నడ చిత్ర నిర్మాత ,తోడూ నీడా సినీ ఫేం –ఎన్.నిత్యానంద భట్
ఎన్.నిత్యానంద్ భట్ చలనచిత్ర నిర్మాత.
జీవిత విశేషాలు
ఇతడు 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో జన్మించాడు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశాడు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 1959 వరకూ వ్యవహరించాడు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మేనేజర్‌గా ఉద్యోగం నిర్వర్తించి, అక్కడి నుంచి వైదొలగిన తరువాత నిర్మాతగా మారాడు. తన స్నేహితుడు ఎ.రామిరెడ్డితో కలిసి విజయభట్ మూవీస్ పతాకంపై 1965లో ఎన్.టి.ఆర్., భానుమతి, జమునల కాంబినేషన్‌లో ‘తోడూ- నీడ’ సినిమాను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందించాడు[1].
ఫిల్మోగ్రఫీ
ఎన్.ఎన్.భట్ నిర్మించిన కొన్ని సినిమాలు:
తెలుగు
· తోడూ నీడా (1965)
· సుఖదుఃఖాలు (1967)
· భలే రంగడు (1969)
· సుగుణసుందరి కథ (1970)
· మూగ ప్రేమ (1971)
కన్నడ
· అత్తెగొందు కాల సొసెగొందు కాల (1968)
· శ్రీ రేణుకాదేవి మహాత్మె (1977)
· వీరాధివీర (1985)
· ఈ జీవ నినగాగి (1986)
· జీవనజ్యోతి (1987)
· ఒందాగిబాళు (1989)
· రెడీమేడ్ గండ (1991
· 333-సామాజిక చైతన్య సినీ నిర్మాత ,,శ్రీరాములయ్య ,జైబోలో తెలంగాణా నిర్మాత ,నటుడు ,నంది అవార్డీ,ఆస్కార్ స్క్రీనింగ్ కమిటి సభ్యుడు ,తెలంగాణా సినీ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ –నిమ్మల శంకర్
·
నిమ్మల శంకర్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. జయం మనదే రా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించాడు. 2011లో శంకర్ తీసిన జై బోలో తెలంగాణ సినిమా ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. 2011 సెప్టెంబరులో గోవాలో జరిగిన 6వ దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో [1][2] ప్రదర్శించబడింది.
జననం
గురువయ్య, సక్కుబాయమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో 1968 అక్టోబర్ 3 నా జన్మించాడు .[3]
సినీరంగం
దర్శకుడిగా
1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా,[4][5] భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
తెలుగు
- 2 కంట్రీస్ (2017)[6][7]
- జై బోలో తెలంగాణా – (04.02.2011)
- రామ్ -(30 మార్చి 2006)
- ఆయుధం -(2003)
- భద్రాచలం – (2001)
- జయం మనదేరా -(07.10.2000)
- యమజాతకుడు – (1999)
- శ్రీరాములయ్య – (28.09.1999)
- ఎన్‌కౌంటర్ – (14.08.97)
కన్నడ
- నమ్మణ్ణ (2005)
నటుడిగా
రామ్‌కీ హీరోగా, కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయమయ్యాడు.
అవార్డులు
నంది అవార్డులు
· 2011 లో సరోజినిదేవి ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం – జై బోలో తెలంగాణా, ఉత్తమ దర్శకుడు – ఎన్.శంకర్ కు అవార్డు, ఉత్తమ నేపథ్య గాయకుడు – గద్దర్.
పదవులు
· ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ సభ్యునిగా
· నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)
· గోవా ఫిలిం ఫెస్టివల్ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
· తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
· తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు (2
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు