సార్ధకమైన కోపూరి శ్రీనివాస్ స్మారక సింగిల్ పేజీ కథలు
ప్రముఖ రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి దంపతల కుమారుడు శ్రీనివాస్ మరణాన్ని తట్టుకొని అతని స్మారకం గా సింగిల్ పేజీ కథలపోటీ నిర్వహించి బహుమతులు అందించి ఆ కథలను రమ్యభారతి ‘’ఆగస్ట్ –అక్టోబర్ ‘ప్రత్యేక సంచికగా తీసుకురావటం, శ్రీనివాస్ ఆత్మకు గొప్ప శాంతిని చేకూర్చి ఉంటుంది .ఈ కథల విశేషాలు సింగిల్ వాక్యాలలో మీముందుంచుతున్నాను .
మొదటి బహుమతిమరీదు వేణు పొందిన కథ –ఒకరిప్ తోసరి .ప్రేమ పిచ్చి ఒకడిని పాతాళంలోకి నెడితే ఆమెను అమెరికా పంపింది .కరోనాతో అతడు చనిపోతే ఆమెకు తెలిసి వాట్సాప్ లో ‘’రిప్ ‘’పెట్టి,లిప్ మూసుకొని సరిపుచ్చింది ప్రేమ ఒకరికి త్యాగం మరొకరికి భోగం అయింది .అది పొందలేని ప్రతివారిదీ దీర్ఘరోగమేఅయింది .
జి .రంగబాబు కథ’’అసలైన పూజ ‘’రెండవ బహుమతి పొందింది .ప్రతిదీ ఫోటోలు వీడియోలు తీసి పోస్ట్ చేసి బుర్రల్ని కంగాళీ చేయటం వెర్రితనం. అది భక్తి విషయంలో ముదిరి అతి అయితే, కొడుకే ‘’మనసు ముఖ్యంకాని మన భక్తి మనకు ముఖ్యం ‘’అని బుద్ధి చెబితే ఆర్ధం చేసుకుని తనకళ్ళు తెరిపించిన కొడుకును అభినందించింది కన్నతల్లి.
పాణ్యం దత్త శర్మ రాసిన ‘’నేను వస్తలేను’’కథ మూడవ బహుమతి పొందింది .హజ్ యాత్రకు మొహనత్ చేసి కమాయించిన డబ్బుతోనే వెళ్లాలని ఖుర్ ఆన్ చెప్పిందని ,ప్రభుత్వం డబ్బుతో పంపే యాత్రకు ‘’నేను వస్తలేను ‘’ అని చెప్పిన ముస్లిం పెద్దాయన ,ఆయన మనసు అర్ధం చేసుకొన్న కొడుకుఅభినందనీయులనిపిస్తారు .
తర్వాతవన్నీ ప్రోత్సాహక బహుమతులు పొందిన కథలు .విరిగిపోయిన బొమ్మలో అమ్మ ఉందని బొమ్మకొన్న అమ్మలేని పిల్ల ,నల్లగా ఉ౦డేకుర్రాడు చానళ్ళ ప్రభావంతో తెల్లబడటానికి పాలలో వాషింగ్ పౌడర్ కలిపితాగటం ,’’నాభర్తా,పిల్లలు చల్లగా ఉండాలి ‘’అనిడైరీలో అన్నిపెజీల్లో అమ్మరాసిన వాక్యాలు పేర్చిన అన్నం మెతుకుల్లా ఉండటం ,అమ్మా నాన్నల్ని ఇంకో ఫామిలీ గా లెక్కపెట్టే ఇల్లు అద్దెకు వద్దన్నఅతని మాటకు ఓనరమ్మ అమెరికాలో ఉన్న కొడుకుకుటుంబం ఫోటో చూసి ,కన్నపేగు కదిలినట్లు౦డటం ,నిజమైన సాహసం సెల్ఫీకాదు ప్రాణాలను కాపాడేవారిదే ,ముఖ్యంగా మన సైనికులది అని ,ప్రాణదానానికి ఉపయోగపడే రక్తానికి కులం అడ్డురాదని ,తెగించే దా ‘’రుణదాతలు ‘’గురించి తెలిసి అండగా ఉంటామన్న మెసేజ్ లు ,ఎవరో ఎప్పుడో రాసి ప్రసిద్ధి చెందినకథను శీర్షికమార్చి పత్రికకు పంపెసాహసి ,పని మనిషి రోగం కనుక్కొని జీత౦తో పాటు మందులూ కొనిచ్చి తనకు పెరిగిన జీతం ఇకనుంచి ఆ అమ్మాయికే ఖర్చు పెడతానన్న యజమానురాలు .ఇవన్నీ ఆయా కథలలోని దినుసులు .మనసునచ్చే విషయాలు .సామాజిక అంశాలు .
మొదటి మూడు బహుమతులు తో పాటు ప్రోత్సాహక బహుమతులు పొందినవారికీ ,ఎంపిక చేసిన సమర్ధులకు ,బహుమతి ప్రదానం చేసిన పుష్పాదేవి దంపతులకు ,ఇదంతా ప్రత్యేక సంచికలో పొందుపరచిన రమ్యభారతి సంపాదకుడు చలపాక ప్రకాష్ కు అభినందనలు .ఇదంతా ఈ సంచికలో ముఖ్యభాగమైన ప్రధాన ఆకర్షణ.
తర్వాత పుస్తకాల సమీక్ష,నానీలు ,సాహిత్య సమాచారం ,పాఠకుల చర్చ ,ఎందరో మహానుభావులు ,మంచికథలవలన మంచి సమాజం వస్తుందనే బిక్కునూరి వ్యాసం ,సాహితీ సభల సమాచార చిత్రాలు ,హైకూలు నానీలు ,అడిగోపులకవిత ,వంశీ స్వర్ణోత్సవ కథా సంకలనం పై చలపాక సమీక్ష తోపాటు ముఖ చిత్రంగా ఈయేటి కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ గ్రహీతలు లతో సంచిక ఆకర్షణీయంగా,విజ్ఞాన దాయకంగా ఉంది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు