హాస్యానందం54- నవ్య సాహిత్యం లో హాస్యం

హాస్యానందం
54- నవ్య సాహిత్యం లో హాస్యం
నవ్య సాహిత్యమంటే ఇరవై వ శతాబ్దిలో పుట్టిన సాహిత్యం .నవ్య సాహిత్యానికి పితామహుడు కందుకూరి .చిలకమర్తీ ,పానుగంటి ఈయన సమకాలికులు .ఈ ముగ్గురుహాస్యరచయితలే.చిలకమర్తి వారిహాస్యం ‘’మడి’’వదల్లెదన్నారు మునిమాణిక్యం .నవలలో హాస్యపు చెణుకులున్నాయి .వీరి మందపాలుడు సంస్కృతతనాటకాలలో విదూషకుని సంతతి వాడే అన్నారుమాస్టారు .వీరి గణపతి అనాకారితనం ,అసభ్యపనులు చూసి నవ్వుతాం .కానీ అది సభ్యతా హాస్యంకాదన్నారు గురూజీ .హాస్యంలో ప్రతిభా ప్రదర్శన మృగ్యం అన్నారు .
వేదం వారి హాస్యం తురకభాషా సంపర్కం తో ‘’మైలపడింది ‘’అన్నారు సార్..మనహాస్యం తురకం నేర్చున్నట్లు కనబడుతుంది .దానితో ఆహాస్యం తెలుగుకాకుండా, మనదికాకుండా పోయిందని తేల్చారు .గురజాడ హాస్యం ఇంగ్లీష్ సంపర్కం తో మైలపడి ,అదీ మనదికాదేమో అనిపిస్తు౦దన్నారు .కన్యాశుల్కం కొందడు భట్టీయాలలో ఇంగ్లీష్ సంపర్కం లేని హాస్య కుశాలమైన పరిహాస భాశితమైన ఘట్టాలులేకపోలేదన్నారు .ముదిగొండ వీరభద్రమూర్తి గారు రాసిన ‘సువర్ణ ధార ‘’కావ్యం హాస్య రచనకాదుకానీ ,కొన్ని ఘట్టాలు హాస్యాశ్రయం కలవి . మార్కండేయం అనే పద్యకావ్యంలో బహు సున్నితహాస్యాన్ని కవి సాధించాడు ,గుప్తంగా దాచిన బంగారు నగలా ఉంది .మార్కండేయుడికి చివరిఘడియలు వచ్చాయి .యమధర్మరాజే స్వయంగా వచ్చి పాశం వేశాడు .అప్పుడు కవి ‘’పాశ బంధిత కంఠుండాబాలకుండు పలికె’’నో దండధర నన్ బలిమిన్ గట్టి కొంచు బో దలచితే కోవిదుడవు .రాను ఫో .శివపూజ పూర్ణమగు వరకు ‘అ౦టాడుకవి ఇందులోహాస్యం పైకి కనబడదన్నారుమాస్టారు .అంతభయంకారాకార భారీ శాల్తీ వస్తే భయపడకుండఈ నాలుగేళ్ల చిన్నిపిల్లాడు ‘’రాను ఫో ‘’అన్నాడుకనుక నవ్వొస్తుంది .అందులోని అసంగత్వం అసహజత్వం హాస్య హేతువులయ్యాయన్నారు మునిశ్రీ .నిజంగా యముడికి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటె పసివాడు తన్ను సవాల్ చేయటం ఏమిటని నవ్వి ఊరుకోవాలి .అలాచేయకుండా కోపం తెచ్చుకోవటం హస్యస్ఫోరకమే అయింది కుర్రడిపై యముడికోపమూ అనుచితమే .అనుచితం ఎప్పుడూ నవ్వు పుట్టిస్తు౦దన్నారు సార్.యముడు ‘’ఇప్పటికే నీపూజలు పూర్తవాల్సింది.ఇప్పటికే చాలాలస్యమయింది ‘’అన్నాడు .తనతో సమానమైన వాడితో అనాల్సినమాటలవి. కుర్రకుంకతో అనాల్సినవికావు అంటారు మునిమాణిక్యం .ఏకళన ఉన్నాడో యముడు దున్నపోతుదిగి వస్తుంటే గురుడిలో ఏదో మార్పు గమనించిన మృకండ సూతి ‘’నా వంటి భక్తుణ్ణి హి౦సిస్తావా ?చస్తావురా అబ్బాయ్ ‘’అన్నాడు ఈ క్షీర కంఠడు లోకపాలకునికినీతి బోధించటం మరీ హాస్యాస్పదం అని తేల్చారు సార్.అంతటితో ఊరుకోక యముడిని ‘’మహిష వాహనా ‘’అన్నాడు అంటే ఇంత బుద్ధిలేని వాడివా అని అర్ధం. తనకు ఆమాటకు మాస్టారికి ఫక్కున నవ్వోచ్చిందట .అప్పుడాబాలుడు ‘’నీతోమాట్లాడటానికి నాకు తీరికలేదు ‘’అంటాడు .ఎంతధీమా ?ఈ సామాన్యుడుఒక అసామన్యుడిని అంత మాట అనటం పూర్తిగా హాస్యాస్పదమే అన్నారు మునిమాణిక్యం .
యముడు గమ్మున ఊరుకొంటే బాగుండేది .’’నేను ఎంత గొప్పవాడినో తెలుసా అని తనడబ్బా తాను బాగా వాయి౦చు కొని ‘’అట్టి ప్రతాపవంతుని ,మహాత్ముని నన్ను తృణీకరిస్తావా చిట్టెముగట్టు భక్తిగల జిట్టెడ బొట్టెడ ‘’అన్నాడు. తనగొప్ప తానె చెప్పుకోవాల్సిన అవస్థ వచ్చినందుకు మనకు నవ్వూ జాలీ వస్తాయి .ఆతర్వాత ఆబొట్టెడు యముణ్ణి ‘’పదంబు రావడి ఎత్తి దండధరు బోర ఫెడీలున ‘’తన్నాడు .ఆతన్నుకు యముడు ఒరిగి నిలబడి నెత్తురు కక్కుకొన్నాడు .ఇదంతా శివ మాహాత్మ్యం అనుకోండి .ఆతర్వాత గ్రంథకర్త ఒక విసురు విసుర్తాడు ‘’నెత్తురులను గ్రక్కుచు యముడు దోరెను దున్నయు బారెనయ్యడన్ ‘’యముడు చచ్చాడట ,దున్న మాత్రం పారిపోయిందట. ఇవన్నీ తనకు విపరీతంగా నవ్వు పుట్టి౦చాయని మునిమాణిక్యం నరసి౦హారావుగారు చెప్పారు ..
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-10-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.