ధర్మవీర పండిత లేఖరాం -3
విదేశాలలో ప్రచారం చేయాలన్న కోరిక
విదేశాలలో కూడా ధర్మ ప్రచారం చేయాలని లేఖరాం భావించాడు .డా.షా రాసిన సత్యార్ధ ప్రకాశికను పార్సీ భాషలో అనువాదం చేయాలనే కోరిక కలిగింది .ఆఫ్ఘనిస్తాన్ పర్షియా ,ఆరబ్ దేశాలకు వెళ్లి ధర్మప్రచారం చేయాలనుకొన్నాడుకానీ ఆయన జీవితకాలం లో జరగలేదు .
కుంభ మేళా
12-4-1891నాటి కుంభమేళా కు నెలరోజులముందే స్వామి శ్రద్దానంద్ తోకలిసి ప్రచార ప్రకటన చేశాడు .పంజాబ్ ,ఉత్తరప్రదేశ్ ప్రతినిధులు అత్యంత ఉత్సాహంగా కార్యరంగంలోకి దూకారు .లేఖరాం ఎన్నో చోట్లకు తిరిగి విరాళాలు సేకరించాడు .కుంభ మేళాలో ఆర్య సమాజం చేసిన సేవను ఒక పుస్తక రూపం వెలువరించాడు . సింథ్ లో
సి౦థ్ లోని హైదరాబాద్ లో హిందువులు కొందరు క్రైస్తవ ,ఇస్లాం మతాలలోకి మారుతున్నారని పంజాబ్ ఆర్యప్రతినిధి ప్రధాన్ లేఖ రాయగా ,సింధీ భాష తెలిసిన స్వామి పూర్ణానంద ను తనతో తీసుకు వెళ్లి ,వారివాదాలను ఖండించి ‘’ఆడం ,అవ్వ లు మన తలిదండ్రులా ?’’అనే పుస్తకం రాసి సమస్త మానవ సృష్టి ఒకేతలిదండ్రుల సంతానం కాజాలదని అనేక రుజువులతో ,ప్రమాణాలతో వివరించాడు .అక్కడి పదిమంది యువకులను మతం మారకు౦డాకాపాడి ,అక్కడి ఆర్య సామాజికులను అప్రమత్తం చేశాడు .ఒక సింధీ ధనికుడు దివాన్ సూర్యమల్ ముసల్మాన్ గా మారటానికి సిద్ధపడితే ,విషయం తెలిసి ఆయన్నుకలవటానికి వెడితే ,ఆయన ఆలీపూర్ వైపుకు పారిపోగా ,అతని కొడుకుల్ని ముట్టడించగా పెద్దకొడుకు తప్పించుకొనే ప్రయత్నం చేస్తే ,నాలుగు సార్లు వెళ్లి శాస్త్రార్ధా నికి పిలిచి ఉత్తరాలవర్షం కురిపించగా మౌల్వీలు వచ్చి పాల్గొనగా వాదంలో వారిని నిరుత్తరుల్ని చేశాడు .ప్రసిద్ధబ్రహ్మ సమాజ వ్యాఖ్యాత టిఎల్. స్వామి హృదయమ లో ధర్మ శాస్త్రాలపై గౌరవం కలిగించాడు .లర్కానాలో కొందరు హిందువుల్ని బలవంతంగా ముస్లిం లుగా మార్చారు .ఆదుకోమని అక్కడివారు లేఖ పంపితే ఆరోగ్య౦ బాగాలేక వెళ్ళ లేక పోయాడు .ఆతర్వాత ఎన్నోప్రయత్నాలతర్వాత వాళ్ళంతా వైదిక ధర్మం లోకి వచ్చారు .
లేఖరాం ఎక్కువగా పంజాబ్ లోనే పని చేశాడు .అమృతసర్ ఆర్యసమాజ వార్షికోత్సవం లో చారిత్రకదృష్టితో ,పరిశోధనాత్మక ప్రసంగం చేయగా అమరవీరుడు స్వామి శ్రద్ధానంద దాన్ని ప్రశంసిస్తూ,హిందీలో’’షార్ట్ హాండ్’’ అవసరమని ఆయన ప్రసంగం రుజువుచేసిందని అంతటి వాక్ ప్రవాహంతో ఉత్తేజంగా ఆయన ఉపన్యాసం సాగిందని తెలిపాడు .నాహన్ రాజ్ లో సాధు కేశవానంద ఉదాసి పెద్ద దుమారం లేపితే పండిట్ జీకి టెలిగ్రాం ద్వారా తెలియబరిస్తే వెళ్లి ,ఆయనతోమాట్లాడి మనసులో మార్పు తెచ్చి ఆయనతోనే అక్కడ ఆర్యసమాజం స్థాపించేట్లు చేశాడు
రాజపుఠానా లో ప్రచారం
దయానందుని జీవన సామగ్రి సేకరణకు పండిట్జీ అజ్మీర్ కు వెళ్లి అక్కడ అందరినీ కలిసి విషయ సేకరణ చేసి దయానందుని జీవిత చరిత్ర రాశాడు .నిత్యానంద ,విశ్వేశ్వరానంద లు బూందీ రాజ్యంలో శాస్త్రార్ధ చర్చల్లో మునిగిపోయారు .వారికి సాయంగా ఈయనకూడా వెళ్ళాడు .అక్కడినుంచి షాహాజ్ పూర్ ,వెళ్లి వ్యాఖ్యానం చేస్తుంటే ఒక ముసల్మాన్ సుబేదార్ లేచి ‘’30దెబ్బలుతిని బూందీ నుంచి ఎందుకు పారిపోయి వచ్చావ్ ?’’అని ప్రశ్నిస్తే పండిట్ ‘’విరోధులు శాస్స్త్రార్ధానికినికి రమ్మంటే రాకపోతే ఏం చెయ్యాలి ?మేము హజరత్ మహమ్మద్ లా పారిపోయి రాలేదు ‘’అనగా హర్షధ్వానాలు మిన్నుముట్టాయి .
ఉపనిషత్తులకు టీకా తాత్పర్యాలు రాయలనుకొన్నాడు .మనుస్మృతిలో ఒక అధ్యాయానికి భాష్యం రాశాడు. కాశ్మీర్ లో అరుదైన మనుస్మృతి గ్రంథం ఆయనకు లభించింది .మనుస్మృతి తర్వాత వాల్మీకి రామాయణం అనువది౦చా లనుకొన్నాడు .శ్రద్ధానంద శాస్త్రాల అనువాదాలకు ఒక ప్రణాళిక తయారు చేశాడు .దురదృష్టవశాత్తు లేఖరాం అకాల మృత్యువు పాలయ్యాడు .అమీర్ లో పీరజేతో శాస్త్రార్ధం చేశాడు .మొత్తం మీద ఇక్కడ 15వ్యాఖ్యానాలు చేశాడు .
కథియవాడ లో
దయానంద జన్మస్థలం నిర్ధారించటానికి కథియవాడ వెళ్ళాడు .అక్కడ బాన్కానేర్ ,మౌర్వీ రాజ్యాలలో తిరిగాడు .మహర్షి పుట్టిన అక్కడ ఆర్యసమాజం చాలా దుర్దశలో ఉండటం గమనించి బాధపడ్డాడు .పంజాబ్ లో మాంసం తినటం ఎక్కువ .ఆర్యసమాజ సభ్యులుకూడా అలవాటు మార్చుకోలేక పోయారు .వేదం లో మాంస భక్షణ ఉందని మొండిగా వాదించేవారు .ఆర్యప్రతినిధి సభ ప్రాధాన్ ఈయనను పంజాబ్ కు రమ్మని కోరగా ,రాజపుఠానా వెళ్లి మా౦సభక్షణం విరుద్ధమని,పాపం అనీ అనేక ప్రమాణాలతో నిరూపించాడు .ఆయనవాదానికి జవాబు చెప్పగలమోగాడు అక్కడ లేకపోయాడు .అప్పటికి ఒకటి ఆర్యసమాజంలో సంస్కృత శిక్షణ ను సమర్ధించేది ,రెండోది కాలేజి పక్షంగా,పాశ్చాత్య శిక్షణ అనుసరించాలి అనేది ఉన్నాయి .
గృహస్థ జీవనం
వైశాఖమాసం లో దయానందుని ఆజ్ఞాపాలనలో 25 ఏళ్ళు గడచిపోయి పండిట్ కు 35ఏళ్ళు రాగా వివాహం చేసుకొన్నాడు .జహాలం నుంచి కహూటకు వెళ్ళాడు .అక్కడ భాన్న గ్రామవాసి,అక్షరంకూడా రాని లక్ష్మీదేవి ని ఆమె 26ఏట వివాహం చేసుకొన్నాడు .తర్వాత ఆమెకు తానె చదువు చెప్పాడు.ఆమెకు ధార్మిక శిక్షణ ఇవ్వటానికి గ్రామమే తగినదని అనుకొన్నాడు.
జోథ్ పూర్ లో
పంజాబ్ లో ఆర్యసమాజం రెండు పక్షాలు అయ్యాక ,మాంస పక్షం నుంచి శ్రద్ధానంద ,జోథ్ పూర్ వెళ్ళాడు .రాజు మేజర్ జనరల్ ప్రతాప సింహా మహర్షి భక్తుడైనా యుద్ధం చేసే రాజపుత్రులకు మాంసభక్షణ తప్పదు అని వాదించేవాడు .రాజు భయంతో ధనికులు పత్రికలవారూ తలలూపారు .రాజు తనకు సపోర్ట్ గా నిలుస్తారని పండిట్ గంగాప్రసాద్ ,పండిట్ ఎం ఎ మీరట్ లను పిలిపించాడు .కానీ డబ్బు, హోదా తమల్ని ధర్మమార్గం నుంచి తప్పించలేవు అని రాజుకు కౌంటర్ ఇచ్చారు .లేఖరాం జోథ్ పూర్ వెళ్లి కొన్ని రోజులు౦డిచర్చల్లోపాల్గొని మాంస వ్యతిరేకతకు మద్దతు కూడ గట్టాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-22-ఉయ్యూరు —