మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -336
· 336-మన వూరిపాన్డవులు సినీ నిర్మాత ,ఫిలిం ఫేర్ అవార్డీ –కాకితజయకృష్ణ
· జయకృష్ణ (ఆగష్టు 18, 1941 – మార్చి 29, 2016) భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలుగు, తమిళ సినిమాలకు ప్రధానంగా నిర్మాతగా సేవలనందించారు.[1] ఆయన 1978 లో మనఊరి పాండవులుకు నిర్మాతగా కెరీర్ ప్రారంభించి తెలుగులో ఉత్తమ ఫిలిం పేర్ అవార్డును అందుకున్నారు. ఆయన ఇతర సినిమాలు మంత్రిగారి వియ్యంకుడు (1983), వివాహ భోజనం, ముద్దుల మనవరాలు, సీతారాములు, రాగలీల, నీకు నాకు పెళ్ళంట, కృష్ణార్జునులు, 420 మొదలగు సినిమాలను తెలుగులో నిర్మించారు. తమిళంలో ఆయన “ఆలవందం” సినిమాను నిర్మించారు.[2] 15 పైగా తెలుగు చిత్రాలు నిర్మించారు. మరో 20కిపైగా డబ్బింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.[3][4]
జీవిత విశేషాలు
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి సమీపంలోని కొమ్మర గ్రామానికి చెందిన జయకృష్ణ, తన బావ లైన ఎడిటర్ గోపాలరావు, మేకప్‌మ్యాన్ సురేశ్‌బాబుల ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. తొలుత కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అటుపైన మేకప్ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా తన ప్రయాణం మొదలుపెట్టారు. మేకప్ వృత్తిపై ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న జయకృష్ణ ఎన్నో మెళకువలు నేర్చుకుని పరిశ్రమకు వచ్చిన ఎనిమిదేళ్లకే చీఫ్ మేకప్‌మ్యాన్ స్థాయికి ఎదిగారు. ‘బంగారు తల్లి’ సినిమా సమయంలో కృష్ణంరాజుతో పరిచయం ఏర్పడి ఆయన పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా చేరారు. ఆ తర్వాత జయప్రదకు పర్సనల్ మేకప్‌మ్యాన్‌గా వ్యవహరించారు. అటుపై సినీ నిర్మాణ రంగంపై ఉన్న ఆసక్తితో నిర్మాతగానూ మారారు. ‘కృష్ణవేణి’, ‘భక్త కన్నప్ప’, ‘అమర దీపం’ తదితర చిత్రాలకు భాగస్వామిగా ఉంటూనే నిర్మాణ నిర్వహణ చేశారు. ప్రముఖ పంపిణీదారు ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగ మూర్తి ప్రోత్సాహంతో 1977లో జేకే మూవీస్ సంస్థను స్థాపించి, బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్ తదితరులతో ‘మనవూరి పాండవులు’ నిర్మించారు. దాసరి దర్శకత్వంలో ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, బాపు దర్శకత్వంలో ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘జాకీ’, ‘సీతమ్మ పెళ్లి’, జంధ్యాల దర్శకత్వంలో ‘ముద్దుల మనవరాలు’, ‘రాగలీల’, ‘వివాహభోజనంబు’, ‘నీకూ నాకూ పెళ్లంట’, క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘స్రవంతి’ తదితర చిత్రాలను నిర్మించారు.[5]
కెరీర్
కృష్ణం రాజు, జయసుధలకు మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ఆయన విద్యార్థి. ఆయన వద్ద మేకప్ ఆర్టిస్టుగా చేరి తరువాత నిర్మాతగా స్థిరపడ్డారు.[6] ఆయన ప్రముఖ సినిమా నటుడు చిరంజీవికి మొట్టమొదటిసారిగా పారితోషకాన్ని (రూ.1116/-) అందించిన నిర్మాత. ఆయన ప్రొడక్షన్ బానర్స్ లో ముద్దు ఆర్ట్ మువీస్, జయకృష్ణ మువీస్ కూడా ఉన్నాయి.[7]
గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా ‘దాసు’. సుదీర్ఘ విరామం తరువాత సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై ‘ఒక తార’ అనే సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ అది తెరకెక్కలేదు. జయకృష్ణ ఒక్కగానొక్క కొడుకు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం జయకృష్ణ జీవితంలో అత్యంత విషాదాత్మక ఘటన.[8]
· 337-భారత్ బంద్ సినీ నటుడు ,పెళ్లిపందిరి సినీ నిర్మాత –కాస్ట్యూమ్ కృష్ణ
కాస్ట్యూమ్స్ కృష్ణ ఒక సినీ నటుడు,, నిర్మాత.[1] అనేక చిత్రాలలో విలన్ గా, సహాయ పాత్రల్లో నటించాడు.[2] 8 చివ్యక్తిగత జీవితం
ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట.[3]
కెరీర్
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.[2] కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు.[3]
జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశాడు.[4]
సినిమాల]
నటుడిగా
· భారత్ బంద్
· అల్లరి మొగుడు
· దేవుళ్ళు
· మా ఆయన బంగారం
· విలన్ (2003)
· శాంభవి ఐపిఎస్ (2003)
· పుట్టింటికి రా చెల్లి (2004)
నిర్మాతగా
· పెళ్ళిపందిరి
· 338-మనీషా ఫిలిమ్స్ నిర్మాత ,యమలీల సినీ ఫేం –కె.అచ్చిరెడ్డి
· కె. అచ్చిరెడ్డి ప్రముఖ తెలుగు సినీ నిర్మాత. దర్శకుడు, స్నేహితుడైన ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు.[1] ఆయన కొబ్బరిబోండాం, రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించాడు.[2]
· వ్యక్తిగత జీవితం
· అచ్చిరెడ్డి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆరవల్లి. ఆరవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అప్పటి నుంచి ఎస్. వి. కృష్ణారెడ్డితో స్నేహం ఉంది.[1] తనకు సినిమా మీద ఆసక్తి లేకపోయినా కృష్ణారెడ్డి అవకాశాల కోసం మద్రాసు వెళ్ళినపుడు తనే నిర్మాత అయితే బాగుండుననిపించింది. హైదరాబాదుకు వచ్చి డబ్బు సంపాదించడానికి అనేక వ్యాపారాలు చేశాడు. మొదట్లో జంట నగరాల్లోని ఇరానీ కేఫ్ లకు స్వీట్లు సరఫరా చేశారు. అప్పట్లో పాప్ సంగీతం ప్రాచుర్యంలో ఉండటంతో పాప్ టీ పేరుతో అప్పట్లో ఉన్న డంకన్ టీకి పోటీగా తయారు చేశారు. గోల్డెన్ ఫింగర్స్ పేరుతో ఒక రకమైన వడియాలు లాంటి ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేశారు. కొంతమంది కలిసి బృందంగా ఏర్పడి డబ్బు సంపాదన కోసం ఈ వ్యాపారాలు నిర్వహించేవారు. ఖాళీ సమయాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు సినిమాలు చూసేవారు. వ్యాపారాల ద్వారా కొంత డబ్బును కూడబెట్టారు కానీ సినిమా నిర్మాణానికి అవి సరిపోవని తెలిసింది. సినీరంగంతో పరిచయం కలగడం కోసం అప్పుడే ప్రాచుర్యం పొందుతున్న దూరదర్శన్ చానల్లో అధికారులకు, నిర్మాతలకు మధ్య వారధిగా వ్యవహరించడం ద్వారా సినీ ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నారు. అప్పుడే మరో నిర్మాత కిషోర్ రాఠీతో పరిచయం ఏర్పడింది. ఆయనకు అప్పుడే మనీషా వీడియోస్ పేరుతో సినిమాలకు సంబంధించిన ఒక సంస్థ ఉండేది. మొదట్లో మూడు రీమేక్ చిత్రాలు నిర్మించాక కొబ్బరి బోండాం సినిమా తీశారు.
· కెరీర్
· 1988లో ఆయన కెరీర్ ప్రారంభమైంది.[3] మొదట్లో మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌పై కొబ్బరిబోండాం, రాజేంద్రుడు – గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, వినోదం, దీర్ఘ సుమంగళీభవ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించాడు. తర్వాత ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై హంగామా, సామాన్యుడు, గుండమ్మగారి మనవడు, కిక్ వంటి చిత్రాలకు సమర్పకుడుగా వ్యవహరించాడు. తర్వాత మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ అనే నూతన సంస్థను స్థాపించి ఆది హీరోగా ప్రేమ కావాలి సినిమా తీశాడు.
·
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-22-ఉయ్యూరు