· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -339
· 339- క్రియేటివ్ కమ్మర్షియల్ అధినేత ,,అభిలాష సినీ నిర్మాత ,ఇళయరాజా తో మొదటి తెలుగు ట్యూన్స్ ఇప్పించిన –కె.ఎస్ .రామాకె.ఎస్. రామారావు ఒక తెలుగు సినీ నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకం పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి పెక్కు పురస్కారాలను కూడా పొందారురావు
నేపధ్యము
ఇతనిది విజయవాడ. అక్కడే పుట్టి పెరిగాడు. విద్యాభ్యాసం కూడా అక్కడే చేశాడు. ఇరవై ఒక్క ఏళ్లు వయస్సులో విజయవాడ నుండి చెన్నై వెళ్ళాడు. సినిమాల మీద ఇతని ఆసక్తి గమనించి కె. రాఘవేంద్రరావు వాళ్ల నాన్న కె.ఎస్. ప్రకాశరావు గారు అతడిని తన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఆయన వద్ద ‘బందిపోటు దొంగలు’, ‘విచిత్ర కుటుంబం’, ‘నా కుటుంబం’ అనే మూడు సినిమాలకు పనిచేశాడు. ఆ తర్వాత ఇతని నాన్నకి ఒంట్లో బాగా లేకపోవడంతో విజయవాడ తిరిగి వచ్చాడు. అప్పుడే వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఆంధ్రా పీపుల్ అసోసియేషన్‌కు సెక్రటరీగా ఉండేవాడు. కానీ వాటిలోనూ రాజకీయ నాయకులు రావడంతో వదిలేసి, మళ్లీ చెన్నైకి వెళ్లిపోయాడు.
నిర్మించిన చిత్రాలు
ఇతను మొదట పుట్టనకనగళ్ అనే కన్నడ దర్శకుడి మీద అభిమానం ఉండటంతో ఆయన సినిమాని తెలుగులో అనువాదం చేశాడు. అది ఫ్లాపయింది. కమల్‌హాసన్ అబిమాని కావడంతో ‘ఎర్ర గులాబీలు’ కొన్నాడు. అది పెద్ద హిట్టయింది. అలాగే ఆయనదే ‘టిక్ టిక్ టిక్’ చేశాడు. అదీ బాగా ఆడింది. ఆ తర్వాత సుహాసిని మొదటి సినిమా ‘మౌనగీతం’ చేశాడు. అది కూడా ఆడింది. అలా డబ్బింగ్ సినిమాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రధాన సినిమాల్లోకి వచ్చాడు. చిన్నప్పట్నించీ సాహిత్యం ఎక్కువగా చదివేవాడు. ఆంధ్రజ్యోతిలో యండమూరి వీరేంద్రనాథ్ ధారావాహిక ‘అభిలాష’ చదువుతూ, బాగుందనిపించి, ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ సినిమా తీశాడు. ఇళయరాజాను నేరుగా తెలుగుకు పరిచయం చేసింది ఆ సినిమాతోనే. అదివరకు ‘సీతాకోకచిలుక’కు ఆయన పనిచేసినా, అందులోని పాటలు తమిళ ట్రాకువే. ఆయన ప్రత్యేకంగా తెలుగు సినిమా కోసం ట్యూన్లు కట్టింది మొదటగా ‘అభిలాష’కే. ఆ తర్వాత ఆయన ఇతని సినిమాలకు తెలుగు ట్యూన్లే చేస్తూ వచ్చారు.
చిత్రాల జాబితా
- కౌసల్య కృష్ణమూర్తి (2019)[1]
- వరల్డ్ ఫేమస్ లవర్ (2020)[2
· 340-‘’నవ్విపోదురుగాక ‘’ఆత్మకధా రచయిత ,మాధుర్య మైన పాటలకు స్థానమిచ్చిన సీతామాలక్ష్మి ,మురారి సినీ నిర్మాత, –కె. మురారి
· కె. మురారి గా ప్రసిద్ధిచెందిన కాట్రగడ్డ మురారి ఒక తెలుగు సినిమా నిర్మాత. సినిమాలపై ఆసక్తితో వైద్య విద్య మధ్యలో ఆపేసి సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. జానకి రాముడు, నారి నారి నడుమ మురారి లాంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. నవ్విపోదురుగాక పేరిట తన సినీ రంగ అనుభవాలపై మురారి పుస్తకం రచించారు.
వ్యక్తిగత జీవితం
విజయవాడ, మొగల్రాజపురంలో 1944 వ సంవత్సరంలో జన్మించాడు. తాత, నాయనమ్మలు: కాట్రగడ్డ గంగయ్య, అక్కమ్మలు. వరంగల్లు, ఆ తర్వాత హైదరాబాదులలో యంబీబీయస్ చదువుతూ మధ్యలో ఆపి మద్రాసు చేసి సినిమా రంగంలో ప్రవేశించాడు.
మురారి మొదటగా కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసి తర్వాత యువచిత్ర ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి సినిమాలు నిర్మించాడు. తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవి.
2012 లో ఆయన ఆత్మకథ నవ్విపోదురు గాక అనే పుస్తక రూపంలో విడుదల చేశారు. ఈ పుస్తకంలో కొందరు సినీ ప్రముఖులపై విమర్శలు చేశాడు.[2]
సినీ రచయిత పి. సత్యానంద్ మురారితో తన అనుభందం గురించి వ్రాసిన వ్యాఖ్యలు :
“హీరోని తీసేస్తున్నా మన సినిమా లోంచి” నిర్మాత అన్నాడు .అందరికీ షాక్ .
“ఎందుకని ..ఏమయింది “
“కథ లో చిన్న చిన్న మార్పులు కొన్ని చెబుతున్నాడు “
“చిన్నవే కదా పోనీ చేసేద్దాం ….”
“కథ ,పాట, సీన్ ..నాకు నచ్చాలి ..తర్వాత డైరెక్టర్ కి , రైటర్ కి నచ్చాలి అంతే …హీరో కి , హీరోయిన్ కి కాదు ..వాళ్ళ చెప్పే మార్పులు -కూర్పులు నేను చెయ్యను .డబ్బు పెట్టేది నేను ..పొతే నష్ట పోయేది నేనే ..”
చెప్పాడు నిర్మాత .
“మనకి ఇప్పుడు వేరే హీరో ఎవరూ దొరకరు …”
“అయితే సినిమా తియ్యను …హీరో డేట్స్ వున్నాయని , లక్షలు వస్తాయని , వాళ్ళకి నచ్చేటట్టు మార్పులు చేసి మాత్రం సినిమా తియ్యను ..”ఖచ్చితం గా అన్నాడు నిర్మాత మురారి ..
ఆ మొండి తనం తోనే తను అనుకున్నట్టే సినిమాలు తీసాడు .
ఆలా కుదరక పోవటంతో ,తను అన్నట్టే మానేసాడు కూడా చాలాకాలం క్రితమే .
ఆ నాటి టాప్ దర్శకులు అందరితోనూ (విశ్వనాధ్ ,దాసరి , రాఘవేంద్రరావు , జంధ్యాల , కోడి రామకృష్ణ , కోదండరామిరెడ్డి ..) సినిమాలు తీసాడు తనకి ‘నచ్చిన ‘విధంగానే .
సాహిత్యం ,సంగీతం -అంటే ప్రాణం గా ఫీల్ అయ్యే మురారి “మావ -బాలు “ని
మారుద్దాం అంటే అలాఅన్న డైరెక్టర్ ని కూడా మార్చేయటానికి సిద్ధపడేవాడు .
అందుకే తన సినిమాల్లో అన్ని పాటలూ బావుంటాయి
తనకి రెండే సినిమాలు ( త్రిశూలం (సినిమా), జానకిరాముడు) రాసినా మూడుపదుల స్నేహం మాది .
మొండి ,కోపిష్టి , తిక్క మనిషి ,అని కొందరు అన్నా నాకు మాత్రం చాలా మంచిస్నేహితుడు …మురారి కాట్రగడ్డ.
“నవ్వి పోదురుగాక …”నాకేమిటి అని తనకి నచ్చినట్టే జీవిస్తూ ,
ఆ టైటిల్ తోనే తన జీవిత అనుభవాలు రాసిన ( ఎక్కువ సేల్స్ అయిన సినిమా మనిషి బయోగ్రఫీ )
మిత్రుడు మురారి ఎప్పటికీ అలాగే ,
సాహిత్య ..సంగీతాలతో హాయిగా గడపాలని తన ఈ పుట్టిన రోజు పూట కోరుకుంటూ …
సినిమాలు
- సీతామాలక్ష్మి
- గోరింటాకు
- జేగంటలు
- త్రిశూలం
- అభిమన్యుడు
- సీతారామ కల్యాణం
- శ్రీనివాస కళ్యాణం
- జానకిరాముడు
- నారీ నారీ నడుమ మురారి
పుస్తకాలు
- తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర 1931-2005, తెలుగుసినిమా వజ్రోత్సవాలలో విడుదలయిన పుస్తకానికి సంపాదకుడు.
- నవ్విపోదురుగాక ఆత్మకథ. (2012లో తొలి ప్రచురణ)
మరణం
కాట్రగడ్డ మురారి చెన్నైలోని తన స్వగృహం నీలాంగరైలో 2022 అక్టోబరు 15న మరణించాడు.[3]
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-22-ఉయ్యూరు