ధర్మవీర పండిత లేఖరాం 5(చివరిభాగం )

ధర్మవీర పండిత లేఖరాం 5(చివరిభాగం )

అజ్మీర్ వీర

ఒక ఏడు సుఖరాం అజ్మీర్ వార్షికోత్సవ సభలో పాల్గొన్నాడు .నగర సంకీర్తనలో పాల్గొన్నాడు దారిలో ముస్లిం లతో వాదోపవాదం జరిగింది ‘ఖ్వాజా శిస్తీ దగ్గరలో ఉంది .ఆర్యసమాజికులు భయపడి పారిపోయారు .శాంతంగా ఉండే ఈయన దర్గా ద్వారం దగ్గరకు వెళ్లి ,ద్వారానికి 30అడుగులదూరంలో ఒక చిన్న వంతెనపై నిలబడి ‘’కబ్రపరస్తీ ,’’మర్దుం పరస్తీ ‘’లను ఖండించటం మొదలుపెట్టాడు .ఎవ్వరూ ఆయన జోలిక రాలేదు .పారిపోయిన అర్యసమాజికులు తమాషా చూట్టానికి వచ్ఛి పండిట్ వీరత్వాన్ని మెచ్చి పారిపోయినందుకు సిగ్గుపడ్డారు .

  స్వల్పాదాయంతో సంతృప్తి

  ప్రతినిధి సభనుంచి నెలకు కేవలం 25రూపాయలు తన కనీస ఖర్చుకు సరిపడా జీతం తీసుకొనేవాడు లేఖరాం .పెళ్ళయ్యాకక 30 తీసుకొన్నాడు .స్వామి శ్రద్ధానంద దాన్ని 35 చేయించాడు .ధనంనం ,కీర్తి లకు ఆశపడ లేదు .

  పోలీసులకు జవాబు

18-7-1896న పండిట్జీ  అయిదుగురు మౌల్వీలతో వాదించటానికి పసరూర్ వెళ్ళాడు .మొదట్లో వాళ్ళు తప్పించుకోవాలని చూశారు .అందులో ఒక్కమౌలిమాత్రమే ఏదో చెబితే మిగిలిన నలుగురు తలలూపారు .శ్రాస్త్రార్ధం జరగటం లేదుకనుక వ్యాఖ్యానం చేద్దామని అనుకోన్నసమయం లో మునిసిపల్ కమీషనర్ మధురాదాస్ తనప్రక్కనున్న ప్రచారకుల చెవిలో ఏదో గుసగుస లాడటం చూసి ఏమిటి విషయం అని అడిగితె వ్యాఖ్యానాల వలన గొడవలు జరిగితే తమకు ఎలాంటి సంబంధం లేదని పోలీస్ అధికారి వార్త పంపాడని చెప్పారు .’’మేము యుద్ధం చేయటానికి రాలేదు ధర్మ ప్రచారానికి కే వచ్చాం.బాగుంటే వింటారు .మాకు పోలీస్ రక్షణ అవసరం లేదు ‘’అన్నాడు .వీరత్వ నిర్భయత్వాలు లేఖరాం సొమ్ములు .

   మీర్జా గులాం అహ్మద్ కాదియాని శిష్యుడితో వాదం

సిమ్లా ఉత్సవ సభలో   మీర్జా గులాం అహ్మద్ కాదియాని శిష్యుడు క్వాజా కమాలుద్దీన్ ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నాడు .రోజూ వెళ్లి అతని వ్యాఖ్యానాలు వినేవాడు .అతడు హిందువుల ఆర్యులగురించి ఏయే వ్యాఖ్యలు చేసేవాడో వాటిని తన ఉపన్యాసాలలో ఖండించేవాడు పండిట్జీ  .’’హుఅతుల్ ఇస్లాం ‘’అనే పుస్తకాన్ని పరిచయం చేస్తూ క్వాజా ‘’మహమ్మద్ కత్తికి భయాడడు .ఇస్లాం కు వ్యతిరేకంగా రాయటం మాట్లాడటం మానుకో ‘’అనగా దీటైన సమాధానాలతో గట్టి దెబ్బ తీశాడు .ఒకసారి పండిట్ ముస్లిం లకు చెందిన పైగంబరులు శవాన్ని పూడ్ఛి పెట్టటం  సమర్ధించి పాపాలు వ్యాపింప జేశారు అన్నాడు .ఇంతలో ఆగు౦పు లో నుంచి ఒకమహమదీయ యువకుడు ‘’మహమ్మద్ కత్తిని మర్చిపోకు ‘’అని అరిస్తే ,’’పరికి వాడు తల్వార్ మాట ఎత్తి నను భయపెట్టాలని చూస్తున్నాడు .అధర్మం లో నడిచే పిరికి వాళ్ళ కు భయపడను .అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని తిరుగుతాను ‘’అని జవాబిచ్చాడు .

  ధార్మిక ప్రేమకు ఉదాహరణ

లేఖరాం కొడుకు చనిపోయాడు .వజీరాబాద్ ఆర్యసమాజ వార్షికోత్సవం దగ్గర పడింది .అయినా అక్కడికి వెళ్లి ధార్మిక ప్రసంగం చేసి పైగంబరుల నిజ స్వరూపం బయటపెట్టాడు .

  జీవిత విశేషాలు

అన్నమాటకు కట్టుబడి ఉండటం ,నాలుగు గంటల రాత్రి ఇంకా ఉండగానే నిద్ర లేవటం ,,శౌచం కోసం నగరం బయటికి వెళ్ళటం ,నిత్య వ్యాయామం ,భోజన ,వస్త్ర విషయాలలో జాగ్రత్త ,మంచిభోజనం చేస్తేనే శక్తికలిగి పనిపై శ్రద్ధ కలుగుందని నమ్మటం ,లోపలి వస్త్రాలను శుభ్రంగా ఉంచుకోవటం ,నిత్యం వేదం కోరాను చదవటం,ఇంద్రియ దాసుడు కాకపోవటం,మద్య మాంసాలకు దూరంగా ఉండటం,సదాచారం ,సామాన్యజీవితం ,,సాత్వికాహారం ,,అన్నిమతాలలోని లోపాలు ఖండించటం ,సంస్కరణలనుకోరటం లేఖరాం సుగుణాలు  ,.

  సుమారు 33పుస్తకాలు రాశాడు .ఆర్యసమాజ దశ నియమాలను అరబిక్ భాషలో కి అనువదించాడు .తన 16పుస్తకాలను అరబ్బీ  భాష లో అనువదించి తనవెంట ఆరబ్ దేశాలకు తీసుకు వెళ్ళాలనుకొన్నాడు .

 ముస్లిం ల చేత ఆక్రమణ

1893లో లాహోర్ ముస్లిం లు లేఖరాం రాసిన జీహాద్ మొదలైన పుస్తకాలపై దావా వేయగా ,ఈయన తరఫున లాలా లజపతిరాయ్ వాదించి నిర్దోషి అని రుజువు చేసి కేసు కొట్టేయించాడు  .మీరట్ ఢిల్లీ బొ౦బాయ్  లలో కూడా ఇలాంటికేసులు పెట్టటం ఆయన నిర్దోషిగా రుజువవటం జరిగింది

 మతోన్మాదం వలన బలిదానం

1897ఫిబ్రవరిలో ఒకనల్లని నీరసముఖ౦ కల  ముస్లిం ఒకడు పండితః లేఖరాం ఇంటికి వచ్చాడు .తాను  హిందువునని బలవంతంగా ముస్లిం గా మార్చారని ఇప్పుడు మళ్ళీ హిందువు అవాలని ఉందని బొంకి నమ్మించాడు .ధర్మ వీర్ అయిన ఆయన వాడిని ఏమీ అడగకుండానే సరే అనగా ఆయన నీడలా వాడు సంచరించాడు .వాడు భయంకరంగా ఉన్నాడు మీ ప్రాణాలు తీయటానికి వచ్చినవాడుగా ఉన్నాడని ఆర్యసామజికులు చెప్పినా పెడ చెవిని పెట్టాడు పండిట్ .మార్చి 4 ఈద్ రోజున ఈయన్ని చంపాలని గట్టిప్లాన్ తో వాడున్నాడు. ఆయన ,సభాకార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 6కు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగిఇంటికి రాగా ,ఆయన పక్కనే కూర్చున్నాడు ,  సంధ్యాసమయంలో పండిట్ రాసుకోవటం ఆపేసి కాగితం కలం కిందబెట్టి లేచినిలబడగా ,వాడు అకస్మాత్తుగా కంబళి లోనుంచి కత్తి తీసి పొట్టలో పొడవగా గాయాలుకాగా ,ప్రేగులు తెగి కిందపడుతుంటే ఎడమ చేతితో వాటిని లోపలి నొక్కుతూ కుడి చేతితో వాడిని పట్టుకోగా తల్లీ భార్యాకూడా సహాయానికి రాగా ,వాడు గట్టిగా చెయ్యి విదిలించుకొని పారిపోయాడు .ఎవర్నీ వీళ్ళు పిలవలేదు అరవలేదు వాడికి అది గొప్ప అవకాశమై  పరిగెత్తాడు .

  పండిట్ జీ ని వెంటనే ఆస్పత్రికి తీసుకు వెడితే  రెండు గంటలవరకు కుట్లు వేస్తూనే ఉన్నారు .ఒక ప్రేగు రెండు ముక్కలైంది. ఎవరికీ ఆయన బతుకుతాడనే నమ్మకమే లేదు .అపస్మారంలో ఉన్నందున డాక్టర్ కూడా ఆయన బతకడు అన్నాడు .రాత్రికి ఆయన మిత్రులు శ్రద్ధానంద జీ వంటివారు వచ్చారు .ఆయనకు భయం, కోపం ఏమీ లేవు .గాయత్రీ మంత్రాలు పఠిస్తూ ఉండగా రాత్రి 2 గంటలకు ధర్మవీర పండిట్ లేఖరాం మరణించి వీర స్వర్గం పొందాడు .మర్నాడు ఉదయం ఆయన పార్ధివ దేహాన్ని దర్శించుకోవటానికి 20వేలమంది వచ్చారు . ఊరేగింపుగా ఆయనను తీసుకు వెడుతున్న దారిలో ప్రజలు పన్నీరు కురిపిస్తూ పుష్పాలు చల్లుతూ శ్మశానం దాకా 7వేలమంది చేరుకొన్నారు .దుఖం ప్రవహించింది .వేదోక్తంగా అంత్యేష్టి జరిగింది.

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-10-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.