మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -341
· 341-క్షణక్షణం ,హలో బ్రదర్ సినీ నిర్మాణ ఫేం,ఒకే చిత్రానికి అయిదు నందులుపొందున –కె.ఎల్.నారాయణ
· కె.ఎల్.నారాయణ తెలుగు చలనచిత్ర నిర్మాత.
సినిమా రంగం
1987లో ప్రముఖ కెమెరామెన్ ఎస్. గోపాల రెడ్డితో ఇతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరూ 1990లో దుర్గా ఆర్ట్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటైన దుర్గా ఆర్ట్స్ ద్వారా తొలిసారిగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో క్షణక్షణం అనే సినిమాను నిర్మించాడు. ఆ చిత్రం సంచలనం సృష్టించడంతో బాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో హలో బ్రదర్ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తర్వాత ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో దొంగాట సినిమాలను తీశాడు. అక్కినేని నాగార్జున హీరోగా సంతోషం అనే సినిమాను నిర్మిస్తూ దశరథ్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేశాడు[1].
సినిమాల జాబితా
· క్షణక్షణం (1990)
· హలో బ్రదర్ (1994)
· ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)
· దొంగాట (1997)
· సంతోషం (2002)
· నిన్నే ఇష్టపడ్డాను (2003)
· 342-మహాకవికాలిదాసు నిర్మాత ,శ్రీరంజని భర్త –కె.నాగమణి
· కె.నాగమణి తెలుగు చలనచిత్ర నిర్మాతలలో ఒకరు. ఈయన ప్రముఖ నటీమణులు శ్రీరంజని సీనియర్, శ్రీరంజని జూనియర్‌ల భర్త. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ దర్శకుడు ఎం.మల్లికార్జునరావు ఈయన, శ్రీరంజని సీనియర్ల ముగ్గురు కుమారులలో పెద్దవాడు.
· వైవాహిక జీవితం
· నాగమణి గారు బెజవాడ హనుమాన్‌దాసు గారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నారు. శ్రీరంజని కూడా హనుమాన్ దాసు గారి దగ్గరే సంగీతం నేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి గారు హార్మోనియం వాయించేవారు. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందారు, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.
· సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-10-22-ఉయ్యూరు