మహాత్మజ్యోతి -1
మానవ ప్రవర్తన భావోద్వేగ ,తార్కిక స్థాయి లలో మాత్రమేకాదు ఆధ్యాత్మిక స్థాయిలోనూ చూడాలి .ఆధ్యాత్మిక ఊహాజనితమే కాదు. అందులో తర్క ,కారణ సంబంధమూ ఉన్నాయి .కొందరికి సాధారణానికి ఎక్కువగా అంటే అతీత శక్తులు ఉంటాయి .వీటిని సిద్ధులు అంటారు సిద్ధులు కారణాతీత౦గా ఉంటాయి .ఇవాళ దీన్ని యోగా అంటున్నారు .గాంధీ మహాత్ముడురాజకీయ కార్యానికి ఆధ్యాత్మికత జోడింఛి మార్గదర్శనం చేశాడు .ఆయన సత్యాగ్రహం ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించటానికే .దాన్నే ఆయన ‘’సత్య శక్తి ‘’అన్నాడు .ఇది అహింస సాధన వలన కలిగి ,సంక్లిష్ట స్థితులలో పరిష్కారంచూపిస్తుంది .
రాజకీయాలను ఆధ్యాత్మీకరించటంను సర్వోదయం అన్నాడు .ఇవాల్టి మతాతీత రాజ్యంలో దాన్ని సాధించటానికి గాంధీ ఎన్నో ప్రయోగాలుచేశాడు .పాశ్చాత్య మేధావులు తిడ్రిక్ లాంటి వారు ఆయనను తప్పుగా అర్ధం చేసుకొన్నారు . శరీరాన్ని శుద్ధి చేయటం తప్పుకాదు యోగా లో అదేముఖ్యం .విధులకంటే హక్కులు గొప్పవని పాశ్చాత్యులు భావిస్తే, హక్కులకంటే విధులు అంటే ధర్మం గొప్పఅని భారతీయులు భావిస్తారు .విశ్లేషణ విభజిస్తుంది ,ఆధ్యాత్మికత సంశ్లేషణ చేస్తుంది అంటే కలుపుతుంది .చట్రంలో ఉన్న భౌతికత కంటే ఆధ్యాత్మికత శక్తి ఉత్పాదకంగా ఉంటుంది .
ఈ నాటి ప్రపంచంలో అస్తిత్వ సంక్షోభం ఎక్కువైపోయింది .అస్తిత్వం రాజకీయంగా మతపరంగా కూడా ఉంది .అది వ్యక్తిగతమై సంతృప్తి పొందకపోతే సామూహికమై హింసకు దారితీస్తుంది. అస్తిత్వంముఖ్యమే అది జాతీయ సమైక్యత కు దారితీయాలి .అందులో ముఖ్యంగా ఇండియాలాంటి సెక్యులర్ దేశానికి .సైన్స్ ,స్పిరిటియువాలిటి చేతులుకలిపి నడవాలి .మహాత్ముని సిద్ధాంతాలలో సైకాలజీ ఫిలాసఫీలు పెనవేసుకుపోయాయి .
ఆధారం డా.కోనేరు రామకృష్ణారావు గారి ‘’గాంధీ అండ్ అప్లైడ్ స్పిరిట్యువాలిటి ‘’గ్రంథం.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్-3-11-22-ఉయ్యూరు
—