మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -356
· 356-గోపీ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ,చిలకమ్మా చెప్పింది ,కృష్ణవేణి వంటి ప్రయోగాత్మక చిత్ర నిర్మాత –చలసాని గోపి
· చలసాని గోపి చలనచిత్ర నిర్మాత. ఇతడు 1944, ఏప్రిల్ 15న కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన పెదమద్దాలి గ్రామంలో జన్మించాడు.
సినిమా రంగం
ఇతడు వెంకటేశ్వర వైభవం చిత్రంలో భాగస్వామిగా సినీ నిర్మాణరంగంలోకి ప్రవేశించాడు. ప్రయోగాత్మక చిత్రాల నిర్మాతగా ప్రసిద్ధి చెందాడు.అతను గోపీ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై చిత్రాలనునిర్మించాడు.[1]
ఇతడు నిర్మించిన సినిమాలు:
1. కృష్ణవేణి – 1974
2. చిలకమ్మ చెప్పింది – 1977
3. కుక్క కాటుకు చెప్పు దెబ్బ – 1979
4. గజదొంగ – 1981
5. దొంగ రాముడు – 1988
6. చిన్న అల్లుడు – 1993
7. దొంగా పోలీస్ – 1992
8. అడవి దొంగ – 1985
9. కుర్రాడు బాబోయ్ – 1995
మూత్రపిండాల పనిచేయకపోవడం వల్ల 2003 ఆగస్టు 23 న మరణించాడు. అసోసియేట్ నిర్మాతగా ‘శ్రీ వెంకటేశ్వర మహాత్యం’ తో కెరీర్ ప్రారంభించాడు. తరువాత, అతను ‘గజదొంగ’ (ఎన్టీఆర్) , అడవి దొంగ (చిరంజీవి) వంటి బ్లాక్ బాస్టర్లను నిర్మించాడు. [2]
357-మాజీ మంత్రి ,ఈ భూమి పత్రిక నిర్వాహకుడు ,రూమ్ మేట్స్ మీ శ్రేయోభిలాషి చిత్రనిర్మాత ఎందఱో విద్యార్ధుల విదేశీ చదువులకు సాయం చేసినవాడు ,అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపకుడు –సి.సి .రెడ్డి
విసు కన్సలటెన్సీ, విసు ఫిలింస్ అధినేత, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త చవ్వా చంద్ర శేఖర రెడ్డి అనే సి.సి. రెడ్డి ( అక్టోబర్ 24, 1930 – అక్టోబర్ 6, 2014). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా కూడా వ్యవహరించారు.
జననం
1930, అక్టోబర్ 24 న జన్మించారు.
నిర్మించిన సినిమాలు
· రూమ్ మేట్స్
ఇతర వివరాలు
· వెంగళ్‌రెడ్డి అంతర్జాతీయ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించాడు.
· విసు కన్సల్టెన్సీ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాడు.
· ఎడిటర్ గా ఈ భూమి అనే పత్రికను నడిపాడు.
ఆరోగ్య పరిస్థితి
2008 సెప్టెంబరులో కాలి బొటన వేలికి సంబంధించిన “గౌట్” అనే వ్యాధితో బాధపడ్డారు. అది శ్రుతిమించి కేన్సర్‌గా మారే అవకాశముందని డాక్టర్లు తెలిపారు. సరైన ట్రీట్ మెంట్ తీసుకోకపోవడంతో కోమాలోకి వెళ్లి, ఐదురోజుల అనంతరం బయటపడ్డారు.
మరణం
కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. 2014, అక్టోబర్ 6 సోమవారం డయాలసిస్ కోసం బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి వెళ్లారు. పక్రియ కొనసాగుతుండగానే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై గుండెపోటు రావడంతో మృతి చెందారు.
358-శాసన సభ్యుడు ,సమరసింహారెడ్డి సినీ నిర్మాత –చంగల వెంకటరావు
చెంగల వెంకటరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన 1999 నుంచి 2009 వరకు పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.
నిర్మించిన సినిమాలు
· సమరసింహారెడ్డి (1999)[1]
· నర్సింహుడు (2005)
రాజకీయ జీవితం
చెంగల వెంకటరావు పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి గంటెల సుమనా పై 7576 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమనా పై 13689 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]వెంకటరావు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్ల బాబూరావు చేతిలో 656 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2013లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. చెంగల వెంకటరావు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత చేతిలో ఓడిపోయాడు.
వివాదాలు
చెంగల వెంకటరావు 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట అనే మత్స్యకార గ్రామంలో బీచ్ మినరల్స్ కంపెనీ పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. గ్రామసభ జరిగినప్పుడు ఎమ్మెల్యే చెంగల సహా ఆయన అనుచరవర్గం పరిశ్రమ పెట్టడానికి వీళ్లదని ఖరాఖండిగా చెప్పారు. కానీ మరో వర్గం వారు పరిశ్రమను పెట్టితీరాలని వాదించింది. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక మత్స్యకారుడు మరణించాడు. బంగారయ్యపేటలో జరిగిన ఘర్షణలో మత్స్యకారుడు మరణానికి చెంగల వెంకట్రావు, అతని అనుచరులే కారణమంటూ కేసు పెట్టారు. పదేళ్లపాటు కేసు విచారణ జరగగా 2017 మే 24న అనకాపల్లిలోని జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు వెంకటరావుతో పాటు 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.[3]
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-11-22-ఉయ్యూరు