కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -2
శ్రీ కంఠయ్య రచనలన్నీ 1926-35 మధ్య వచ్చినవే ఆయన రాసిన ‘’ఇంగ్లీష్ గీత గళు’’ ను లికిరికల్ బాలడ్స్ తో పోల్చవచ్చు .అన్నిటికంటే గొప్ప రచన ‘’ఆశ్వత్దామన్’’1929లో వచ్చింది .ఇది విషాదాంత నాటకం సోఫోక్లిస్ ‘’అయాన్ ‘’కు సరిపోలుతుంది .గదాయుద్ధ నాటకం అనే పద్య నాటకం కూడా రాశాడు .1935లో ఆసిలాస్ రాసిన ‘’పెర్సే ‘’కు అనువాదంగా ‘’పారశీకరు ‘’రాశాడు .1937లో ‘’ఎ షార్ట్ బుక్ ఆఫ్ కన్నడ ప్రాసెడి’’రాశాడు .అప్పుడప్పుడు రాసిన కన్నడ పద్యాలను ‘’హో౦గన సుగళు’’-బంగారు కలలు గా1943లో ప్రచురించాడు. 1948లో’’కన్నడిగరియెఒళ్ళేయ సాహిత్య ‘’- కన్నడిగులకోసం చక్కని సాహిత్యం ‘’.ఇందులో ఆయన చేసిన ప్రసంగాలు ,చేసిన సమీక్షలు రాసిన పీఠికలు ఉన్నాయి .షేక్స్పియర్ విషాదాంత నాటకాలను ,అరిష్ట్రియస్ ‘’ట్రయాలజి ‘’ని అనువాదం చేయగల సమర్ధుడు .ఎ౦దుకొఆజొలికి పోకపోవటం కన్నడిగుల దురదృష్టం ‘’.’’విశ్వ జనీనత విషయం లో ,జీవితంలో వివిధ అంశాలను స్పృశించటం లో షేక్స్ పియర్ ను మించిన వారు లేరు .కానీ భారతీయులకు గ్రీకులే దగ్గర వారుగా కనిపిస్తారు ‘’అనే వాడాయన .ఆషిలస్ రాసిన ‘’ప్రామిధ్యూస్ బౌండ్ ‘’,ను షెల్లీ రాసిన ‘’ ’ప్రామిధ్యూస్ అన్ బౌండ్’’ను ఆధారంగా ఒక గొప్ప స్వతంత్ర నాటకం రాయటానికి ప్రణాళిక తయారు చేసుకొన్నాడు .దీనివిషయంలో ‘’ ముసలాడి గడ్డాన్ని పడుచు వాడి మీసానికి మెలేసి దానిపై ఉయ్యాల లూగాలి ‘’అనే వాడు సరదాగా .దానికి ‘’మాతారీశ్వరన్ ‘’అనే పేరుకూడా పెట్టాడు .
1935 తర్వాత ఆయన ఏమీ రాయలేదుకాని ,విలువైన ప్రసంగాలు చేశాడు .ఆశుధారగా తేనెల సోనలమాటలతో ఆయన ప్రసంగాలు చవులూరించేవి .1928కన్నడ సాహిత్య మహాసభలకు అద్యక్షు డయ్యాడు .1938లో మైసూర్ మహారాజా ఆయనకు ‘’రాజ సేవాసక్త ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .తర్వాత పరిషత్తు కు ఉపాధ్యక్షు డయ్యాడు .ఆకాలం లో రాజవంశం లో ఒకరు అధ్యక్షులుగా ఉండేవారు .ఆయన స్వరం సంగీతమయంగా ఉండేది అందుకే శ్రోతలు గానం వింటున్న అనుభూతిని ఆయన ఉపన్యాసాలలో అనుభవించేవారు .
శ్రీ కంఠ ను తిరగేసి కంఠశ్రీ గా మార్చి ఆయన్ను స్వర సంపద గా భావించి గౌరవించేవారు .ప్రతిమాటకు కనీసం అరడజను సమానార్ధకాలను ప్రయోగించి మాట్లాడటం ఆయనకు కొట్టిన పిండి .ఈ లక్షణం నాకు తెలిసినంతవరకూ శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి గారికి ఉండేది .
షేక్స్పియర్ ,వర్డ్స్ వర్త్ ,పంప ,రన్న కవులపై ఉపన్యసించమని నిత్యం అభ్యర్ధనలు ఆయనకు వచ్చేవి .తత్వ శాస్స్త్రం మతం గురించికూడా ఆయనే మాట్లాడాలని కోరేవారు. ‘’ప్రవక్తల భారం ‘’అనేది ఆయనకు అభిమాన విషయం .ఆయన ప్రసంగాలు వినటానికి జనం క్యూలు కట్టేవారు .ఎన్ని గంటలు మాట్లాడినా కదిలేవారుకాదు.ఏ సమయానికి వచ్చినా వినటానికి తయారుగా ఉండేవారు అంతటి క్రేజ్ ఆయన ప్రసంగం అంటే .రైలు బస్సు కారు ఏది అందుబాటులో ఉంటె అది అందుకొని కోరిన చోటికి వెళ్లి ప్రసంగించి సంతృప్తి పరచేవారు .పదవ శతాబ్దిలో పంప మహాకవి వలన వన్నె కెక్కిన ‘’బనవాసి ‘’ని చూడగానే పులకిన్చిపోయేవాడు .హంపి అంటే వీరాభిమానం.హరిహర ,రాఘవాంక కవులంటే మరీ ఇష్టం .హలెబీడు శిల్ప సంపద ను గురించి ఆయనలా వర్ణించి చెప్పగలవారు లేరు .
1938-42మధ్య కన్నడ సాహిత్య పరిషత్ కు ప్రధాన నిర్వాహకుడుగా ఉన్నాడు .’’కన్నడ నుడి’’మాసపత్రిక స్థాపించాడు .’’కన్నడ ద బావుటా ‘’-కన్నడ జెండా అనే కవితా సంకలనానికి సంపాదకత్వం వహించాడు .కన్నడ ప్రెస్ కు తానె నిధులు ఇచ్చి ఏర్పాటు చేశాడు .వందలాదిమందిని సాహిత్య పరిషత్ సభ్యులుగా చేర్చి సాహిత్యోత్సవాలు సమావేశాలు జరిపాడు .ఇంతచేస్తున్నా ఒక నియమిత పరిధిలో ఒక ప్రవక్త లాగా ఉన్నాడు .కర్నాటక మాట వర్ణక్రమ విషయం లో భేదాభిప్రాయాలు వచ్చాయి .1942పరిషత్ ఎన్నికలలో అభిప్రాయ భేదాలు కనిపించాయి .ఆయన మళ్ళీ పోటీ చేయను అన్నాడు .దాన్ని పట్టుకొని ఆతర్వాత ఆయన పేరును ప్రతిపాదించటం మానేశారు .కొత్త ఉపాధ్యాధ్యక్షుడికి బాధ్యత అప్పగించి తప్పుకొన్నాడు .ఇది అందరికీ బాధ కలిగించింది. అప్పుడే విశ్వ విద్యాలయ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు .
కానీ ‘’అక్షరాస్యతా వ్యాప్తి కమిటీకి అధ్యక్షుడుగా నియమితుడయ్యాడు .1944దాకా ఉన్నాడు ..అప్పుడే ధార్వాడలోని కెఇ బోర్డ్ ఆఫ్ ఆర్ట్స్ వారు ఆయన్ను ప్రిన్సిపాల్ గా ఆహ్వానించారు .చాలామంది వద్దని హితవు చెప్పినా అందులో చేరాడు కాని హాయి అనిపించలేదు .ఆరోగ్యం క్షీణిస్తోంది మధు మేహం పట్టుకొన్నది .రక్తపోటు పెరిగింది .వయసుకు మించిన భారం మోసి విధి నిర్వహణ చేశాడు .5-1-1944న 60ఏళ్ళకే ధార్వాడ లో శ్రీ కంఠయ్య శివలోకం చేరాడు .కర్నాటకనవ రాష్ట్ర నిర్మాత గా ఆయన్ను ప్రజలు, ప్రభుత్వం గౌరవించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-11-22-ఉయ్యూరు .