కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -3

కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -3
బ్రిటిషర్ల పాలనలో మనపై మనకు ఆత్మ న్యూనతా భావం కలిగించింది .వాళ్ళ సాహిత్య పరిచయం వలన శ్రీ కంఠయ్య లో ఆయా దేశాలపట్ల గౌరవభావం ఏర్పడింది .ఈయన కాలేజి లో చేరేనాటికి ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి యూని వర్సిటీ లలో తర్ఫీదు అయిన కొత్తరకం పండితులు పరిచయమయ్యారు .వారిలో ఆత్మ న్యూనతా భావం లేదు .దేశానికి అప్రతిష్ట కలిగించే అంశాలను వాళ్ళు ఒప్పుకొనే వారుకాదు .ఈయనకు భవిష్యత్తు పై ఎక్కువ ఆసక్తి .కన్నడం తల ఎత్తుకోవాలని ఆయన గట్టిగా కోరాడు .అందుకే కన్నడ జెండా ఎగరేశాడు .సంస్కృతం ఒక్కటే మనల్ని తీర్చి దిద్దలేదు .పాశ్చాత్య సాహిత్య ప్రక్రియలు తెలుసుకోవాలి .కన్నడం ఇవ్వగలిగింది ఏమిటిఅనే మౌలిక ప్రశ్నకూడా వేసుకొన్నాడు .కన్నడ ప్రాచీన సాహిత్యంలో కన్నడంకన్నా సంస్కృత పదాలెక్కువ .ఆధునిక భాషాజ్ఞానం ఆధునిక సాహిత్య పరిచయం అందుకే కావాలన్నాడు .యువత ఆయన వెంట నడిచింది ..కర్నాటక ఏకీ కరణ ఉద్యమాన్ని ఆయన తలకెత్తుకొన్నాడు .దానికి వీరి మద్దతు పుష్కలంగా ఉంది .మైసూర్ యూని వర్సిటి ఏర్పడిన 15ఏళ్ళకు కానీ కన్నడ భాషా పీఠం ఏర్పడలేదు .కన్నడ పునరుద్ధరణకు ధార్వాడ లోని కర్నాటక విద్యావర్ధక సంఘం ,బెంగుళూరులోని కన్నడ సాహిత్య పరిషత్ కృషి చేశాయి .జాతీయోద్యమం కూడా ప్రాంతీయోద్యమానికి, భాషోద్యమానికి సహాయ పడింది .కర్ణాటకలోని అన్ని ప్రాంతాలవారినీ కలుపుకొని పోతూ ,రాజకీయ సాంఘిక సాంస్కృతిక శక్తులను ఏకం చేసే నాయకుడు కావాల్సి వచ్చింది దానికి తగినవాడు శ్రీ కంఠయ్య మాత్రమె .
‘’ఢిల్లీ దూరం ,పల్లె చాలు నాకు ‘’అన్నాడు శ్రీ కంఠయ్య .షేక్స్ పియర్ అన్నాడని చెప్పబడే ‘’నేను చనిపోయాక నా గుండె మీద ఇంగ్లాండ్ అని రాసి ఉంటుంది చూడండి ‘’అన్న వాక్యం ఈయనకూ వర్తిస్తుంది కర్నాటక విషయంలో ..మైసూర్ మహారాజా గారి ఏక చ్చత్రం కింద సమైక్య కర్నాటకం ఏర్పడాలని ఆయన చనిపోవటానికి ముందు కోరుకున్నాడు .లెక్చరర్ గా ఆయన విశేష గౌరవం పొందాడు .తాదాత్మ్య స్థితిలో పాఠాలు బోధించేవాడని ఆయన శిష్యులు గొప్పగా చెప్పుకొనేవారు ‘’.పాఠ్య భాగం సువిశాల ఆలోచనా సంవేదనలలోకి ఎగిరిపోవటానికి కాలు పెట్టె ఆధార పీఠం’’ అనే వాడు .ఎన్నెన్నో విషయాలు ఆయన బోధనలో దొర్లిపోయేవి .విద్యార్ధి దృక్పధం సువిశాలం చేయటమే ఆయన ధ్యేయం .ఆయనకు బాగా ఇష్టమైన కవితలు –‘’the spirit that dwells in the light of setting suns ‘’,..the young lambs bound as tabors’ sound ‘’అవి మాటలుకావు సంగీత ధ్వనులు .వీటిద్వారా గొప్ప అనుభూతిని కలిగించేవాడు .మాధ్యూ ఆర్నాల్డ్ పాఠం చెబుతూ అందులో డాంటే చెప్పిన మాటలు’’in His will is our peace ‘’ అంటూ పదే పదేమననం చేసుకొనేవాడు .వర్డ్స్ వర్త్ రాసిన ‘’the still sad music of humaanity ‘’బోధిస్తూ గంట దాటినా చెబుతూనే ఉన్నాడు ఒకసారి అంతా అయ్యాక పూర్తి నిశ్శబ్దం ఆవహించింది అని ఒక పూర్వ విద్యార్ధి జ్ఞాపకం చేసుకొన్నాడు .
ఇంగ్లీషు గీత గళు
పూర్వ కన్నడ కవిత్వాన్ని ఆయన ‘’రాయ కేళి౦దే’’-రాజా అవధరింపుము అని వెక్కిరించేవాడు .అవధానం నిలకడ గా ఉందని రాజుకు వినిపించటానికి రాసిన క్షీణయుగ కవిత్వం గా భావించేవాడు.ఇరవై ఖండికలున్న ఈ కవితా సంపుటి లో షెల్లీవి 9,బర్న్స్ వి 7,వర్డ్స్ వర్త్ వి 5,బ్రౌనింగ్ ,టెన్నిసన్ స్కాట్ లవి మూడేసి షేక్స్ పియర్ సౌదీ ,బైరన్ లవి రెండేసి ,మిగిలినవి ఇతరకవులవి ఉన్నాయి .వర్డ్స్ వర్త్ రాసిన ‘’లూసీ ‘’కవిత ,సాలిటరి రీపర్ లాంటివి వదిలేశాడు .తన శక్తికి మించినవి కావు అన్నవాటినే అనువదించినట్లు చెప్పుకొన్నాడాయన ..ఈయనకాలం లోనే హెచ్ నారాయణ రాకూడా ఆంగ్లకవితలను వాదాలు చేశాడు.
అన్నీ ఉత్తమ అనువాదాలు అనిపించుకోలేదు .కొన్ని మాత్రం అత్యున్నతంగా కనిపిస్తాయి ‘’కవిత్వం అనువాదానికి లొంగదు ‘’అన్న దాన్ని తారుమారు చేసేశాడు .సరళ శైలి అందం మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి .కొన్ని మూలాలనికి మించి అద్భుత సోయగాన్ని ప్రదర్శించాయి .చారిత్రిక ప్రాముఖ్యత వల్ల ఈకవితలు జీవిస్తాయి .మానవుడిని మానవుడిగా చిత్రిస్తూ రాసిన నవ్యకవిత్వాలు ఇవి .మానవ విషాద సంగీత౦ కూడా వినిపించింది .పదాడంబర క్షీణయుగ మహాకావ్యాల స్థానాన్ని ఈకవితలు ఆక్రమించేశాయి తర్వాత రెండు దశాబ్దాల కు కానీ కెవి పుట్టప్ప అనే’’ కు వెంపు’’రాసిన’’ శ్రీ రామాయణ దర్శనం ‘’మహాకావ్యంగా కొత్త చూపు హుందాతనతో ప్రవేశించలేదు .కర్నాటక సాహిత్య చరిత్రలో ,ప్రయోజనకర విప్లవాలలో ‘’ఇంగ్లీషుగీత గళు ‘’కు ఎప్పటికీ ప్రత్యెక స్థానం ఉంటుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-11-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.