కన్నడ కాల్పనిక సాహిత్య రచయిత బి.ఎం.శ్రీ కంఠయ్య -5(చివరి భాగం )
శ్రీ కంఠయ్య వివిధ సందర్భాలలో వ్రాసిన పద్య సంపుటి బంగారుకలలు –మైసూరు రాజవంశం పట్ల తనకున్న ఆరాధనాభావానికి అక్షరరూపం .ఆది ప్రాస పాటించాడు .స్వేచ్చా ప్రియుడే అయినా సంప్రదాయానికి విరోధిని కాను అని తెలియ జేశాడు .’’ఓ భారతమాతా –మళ్ళీ ఎప్పుడు నేను తలెత్తుకోనేట్లు చేస్తావు ‘’అనేది ప్రారంభగీతం .మన సంస్కృతీ ఘనతే మనకు మోయరాని భారమైంది ,’’సత్యం మీ ఆత్మల్ని ఉత్తేజితం చేసినపుడు –సరిహద్దుల్ని వెనక్కి నెట్ట లేకపోయారు –వెలుగు ప్రసరించిన చోట్ల నుంచి వెనుదిరిగి పారిపోయారు –గుహలలో బతికారు అహంకారం పెంచుకొని –కుల దురహంకారంతో ,సంకుచిత విశ్వాసాలతో .భారత దేశం తన బిడ్డలలో జడత్వాన్ని పోగెట్టే ఏఏ పనులు చేసిందో చెప్పాడు .ఇంగ్లాండ్ కు భారత్ కు మధ్య ఉన్న బాంధవ్యం గొప్పదిగా భావించాడు .బ్రిటిష్ సామ్రాజ్యం మనకు కొన్ని మేళ్ళు చేసి౦దినఅని గుర్తు చేశాడు .మనం మన దేశానికీ ఇంగ్లాండ్ కూ మేలు చేశామన్నాడు .
కృష్ణ రాజు చనిపోయినప్పుడు ‘’బన్ కొండ కృష్ణన్ ‘’అనే స్మృతి గీతి రాశాడు .ఇదేకన్నడంలో పూర్తి స్మృతికావ్యం గా భావిస్తారు .విజయనగర సామ్రాజ్య ఆరవ శత వార్షికోత్సవం సందర్భంగా ‘’కన్నడ తాయ నోట ‘’కవితను దేశభాక్తిపూరిత౦గా ,ఆలంకారిక శైలిలో రాశాడు –‘’కర్నాటక అంతా చుట్టి వచ్చాను –దేశ వైభోగామంతా ఆకళించుకొన్నాను –ఆమె పాద ధూళి తాకుతూ పరవశించాను –దాని అందానికి సోక్కిపోయాను –నా గుండె ఆనందంతో చి౦దు లేసింది –నాట్యమే చేశాను ‘’ కర్నాటక అంటే నల్లని నేల అనే అర్ధం ఆయన చెప్పేవాడు .పై మబ్బు నలుపు కన్నెపిల్లల జుట్టు నలుపు ,నవ్వే కళ్ళు నలుపు అనేవాడు .
కన్నడిగుల శక్తి యుక్తులకు ,కార్యశీలతను పురిగొల్పటానికి ‘’కన్నడ బావుటా ‘’రాశాడు .ఈ సంకలనం లో ఇదేఅద్భుత కవిత అన్నారు .జ్ఞానం సత్యం ఉన్నవారికే ఆభావం అర్ధమౌతుంది అనేవాడు –‘’వెలుతురు వచ్చు గాక ‘’అని సృష్టి ఆది లో అన్నప్పుడు –అంతటా వెలుతురూ ఇంపుగా ప్రసరించింది –అందులోంచి మెరుపులు దూసుకొచ్చాయి –అప్పుడు ఖగోళాలు ప్రకాశించాయి –సూర్య చంద్రులు లోకానికిసత్యధర్మాలులాగా ,క్షమా దయ లాగా రెండు కళ్ళు’’అప్పుడు భూదేవి పచ్చని కోకతో అందంగా గానం చేస్తూ సాక్షాత్కరించింది –ప్రత్యగాత్మ ,విశ్వాత్మల వైభవంతో దీపించే దివ్య తలాలతో క్రీడిస్తూ –దేవతలు ఋషులు చూసిఆనందంతో చి౦దులేశారు .తమకు కనబడకుండా సత్యాన్ని మరుగు పరచిన బంగారు పళ్ళాన్ని తొలగించమని పూషుడి ని వేడుకొన్నారు .అసత్ నుంచి సత్ కు అజ్ఞానం నుంచి జ్ఞానానికి చీకటి నుంచి వెలుతురుకు నడిపించమన్నారు .అమృతత్వాన్ని విశ్వమంతా వ్యాపింప జేయమన్నారు .
కన్నడం లో అంగీకారయోగ్యమైన విమర్శ లేదు .విమర్శను మనం పెంపొందించుకోవాలని కోరాడు .ఆయన మరణానంతరం ప్రచురింపబడిన ‘’కన్నడిగరే ఒళ్లేయ సాహిత్య ‘’-కన్నడిగులకోసం మంచి సాహిత్యం అనేది అయన మూర్తి మత్వాన్ని గొప్పగా ఆవిష్కరిస్తుంది .అక్షర రాజ్యాధిపతి అయిన ఈయన అవసరమైతే క్షమాపణలు కూడాచెప్పగలడు..’’ఈనాటి కన్నడ సాహిత్యం లో వినిపించే మధురస్వరాలన్నిటికి మూలం శ్రీ కంఠయ్య గారి వరవడి ,అభ్యాసం ‘’అని నిష్కర్షగా చెప్పవచ్చు .అయన నడిపిన కాల్పనికోద్యమం ఇప్పుడు తిరోగమించింది .నూతననాయకులు ఆయన గొప్పతనాన్నీ, కన్నడ సాహిత్యం పై ఆయన ప్రభావాన్నీ అంగీకరిస్తారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-29-11-22-ఉయ్యూరు