మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369
· మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -369
369-విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పెర్ట్ –నవీన్ మేడారం
· నవీన్ మేడారం,[1] భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. పైరేట్ ఆఫ్ కరేబియన్, ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్, హ్యారీ పాటర్, ద డార్క్ నైట్ వంటి వివిధ హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్‌గా పనిచేశాడు.
జీవిత విషయాలు
నవీన్ 1979, ఆగస్టు 7న నిజామాబాదు జిల్లాలో జన్మించాడు. హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేవాడు. ఆ తరువాత యునైటెడ్ కింగ్‌డమ్ లోని బౌర్న్‌మౌత్ విశ్వవిద్యాలయం నుండి విజువల్ ఎఫెక్ట్స్ లో మాస్టర్ డిగ్రీ చదివాడు.
సినిమారంగం
లండన్‌లోని రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్ నుండి ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా పొందాడు. రెయిన్‌డాన్స్ ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకొని లఘు చిత్రాలకు, సినిమాలకు పనిచేశాడు. ఫిల్మ్ స్కూల్‌లోని ఐదుగురు దర్శకుల బృందంతో కలిసి “మూవింగ్ ఆన్” అనే ఒక షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించాడు. తరువాత “ఫిలోఫోబియా” అనే లఘు చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డబుల్ నెగటివ్ స్టూడియోస్, ది మూవింగ్ పిక్చర్ కంపెనీ, పైన్‌వుడ్ స్టూడియోలలో విజువల్ ఎఫెక్ట్స్ కంపోజిటర్‌గా పనిచేశాడు. ఎఫెక్ట్స్ ఆర్టిస్టుగా ది డా విన్సీ కోడ్, ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్ ది లాస్ట్ స్టాండ్, సిక్స్టి సిక్స్, సన్ షైన్ మొదలైన సినిమాలకు పనిచేశాడు.
లండన్ లైఫ్, నైస్ టూ మీట్ యు వంటి బ్రిటిష్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నవీన్, బాబు బాగా బిజి[2][3] (హిందీ చిత్రం హంటర్ర్ రిమేక్)[4] సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[5][6] నార్త్‌స్టార్ ప్రొడక్షన్ బ్యానరలో శరత్ మరార్ నిర్మాతగా “సిన్” అనే వెబ్ సిరీస్ ను రూపొందించి, అల్లు అరవింద్కు చెందిన ఆహా (ఓటిటి) ద్వారా విడుదల చేశాడు.[7][8]
సినిమాలు
సంవత్సరం
శీర్షిక
దర్శకుడు
నిర్మాత
రచయిత
ఇతరులు
గమనికలు
2015
నైస్ టూ మీట్ యు
Yes
Yes
Yes
[9]
2016
లండన్ లైఫ్
Yes
కాదు
Yes
విఎఫెక్స్ ఆర్టిస్టుగా
2017
బాబు బాగా బిజి
Yes
కాదు
స్క్రీన్ ప్లే
[10][11]
2020
సిన్
Yes
కాదు
Yes
వెబ్ సిరీస్[12]
2021
డెవిల్
Yes
కాదు
కాదు
[13]
విఎఫెక్స్ ఆర్టిస్టుగా
· లెస్ మిజరబుల్స్
· ఆల్ థింగ్స్ టూ ఆల్ మెన్
· డార్క్ షాడోస్
· ప్లానెట్ డైనోసార్
· పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్
· ది వెటరన్
· ది డెబ్యూట్
· స్కాట్ పిల్గ్రిమ్ వర్సెస్ ది వరల్డ్
· ప్రిన్స్ ఆఫ్ పర్షియా: ది సాండ్స్ ఆఫ్ టైమ్
· గ్రీన్ జోన్
· 2012
· హ్యారీ పాటర్ అండ్ ది హాఫ్-బ్లడ్ ప్రిన్స్
· ది బోట్ దట్ రాక్
· కెప్టెన్ స్కార్లెట్
· ఇంక్ హార్ట్
· ది డార్క్ నైట్
· 10,000 బిసి
· క్లోవర్ఫీల్డ్
· హ్యారీ పాటర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫీనిక్స్
· రైడ్ బై[14]
· సన్ షైన్
· సిక్స్టి సిక్స్
· ఎక్స్-మెన్: ది లాస్ట్ స్టాండ్
· ది డా విన్సీ కోడ్
· పోసిడాన్
370-తెలుగు ఫిలిం చేంబర్ అధ్యక్షుడు ,నిర్మాత డిష్ట్రిబ్యూటర్-నారాయణ్ దాస్ నారంగ్
నారాయణ్‌దాస్ కిషన్‌దాస్ నారంగ్ (1946 జూలై 27 – 2022 ఏప్రిల్ 19) తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (Telugu Film Chamber of Commerce) అధ్యక్షుడు (2019 – 2022).[1] ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్ అధినేత. సినిమా నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గాను సుపరిచితుడు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ చేశారు.
ఆయన పూర్వీకులది పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ ప్రాంతం. దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా వచ్చారు. ముంబైలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1950లలో హైదరాబాదు వచ్చారు. కన్యలాల్ నారంగ్, లీలావతి నారంగ్ దంపతులకు నారాయణ్ దాస్ నారంగ్ జన్మించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. నారాయణ్ దాస్ కి భార్య సునీత, ముగ్గురు సంతానం. వారు సునీల్ నారంగ్, భరత్, మోనా.
76 ఏళ్ళ నారాయణ్ దాస్ నారంగ్ తీవ్ర అస్వస్థతతో 2022 ఏప్రిల్ 19న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.[2] మరణ సమయానికి నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుశ్‌తో ‘సార్’ సినిమాతో పాటు సుమారు పది సినిమాల వరకూ నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా గతంలో తన శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో లవ్ స్టొరీ, లక్ష్య తదితర సినిమాలను నిర్మించారు.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-22-ఉయ్యూరు