మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -373

  మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -373

·         373-నటి ,ప్రవీణా ఆర్ట్స్ స్థాపకురాలు  ‘’కేరాఫ్ కంచరపాలెం ‘’సినీ నిర్మాత –పరుచూరి విజయ ప్రవీణ

·         పరుచూరి విజయ ప్రవీణ తెలుగు సినిమా నటి, నిర్మాత. కేరాఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించడమేకాకుండా అందులోని ఒక ప్రధానపాత్రలో నటించింది.[

జీవిత విశేషాలు

ఆమె ప్రవాసభారతీయురాలు, న్యూయార్క్ లో సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో వైద్యవిద్యనభ్యసించి కార్డియాలజిస్టుగా ఉంది. ఆమె తల్లిదండ్రులు తెలుగు భాష నేపద్యం కలవారు. చిన్నతనంలో తెలుగు చిత్రాల పట్ల ఆకర్షితురాలై ఫిల్మ్‌ స్కూలు లో చేరింది.[2] ఆమె తన స్నేహితురాలిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహాతో మొదలైన పరిచయం కథ వినడంతో ఆగలేదు ఏకంగా సినిమా తీసే దాకా వెళ్లిపోయింది. సలీమా పాత్రకు ఎన్ని ఆడిషన్స్ చేసినా ఎవరు సెట్ కాకపోవడంతో ఆలస్యం జరగడం మొదలైంది. ఇలాగే అయితే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందనే భయంతో సలీమాగా తనే నటించడానికి రెడీ అయ్యారు ప్రవీణ. స్కైప్ ద్వారా వెంకటేష్ మహా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు.[3]

సంస్థలు

ప్రవీణ గారు “పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్” ని స్థాపించారు మరియు తెలుగు సినీ దర్శకుడైన వెంకటేష్ మహా గారితో “మహాయాన మోషన్ పిక్చర్స్” కి ఈమె భాగస్వామ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.

374-తెలుగు ,హిందీ సినీనిర్మాత ,జ్వాలాద్వీపరహస్యం ,ఇద్దరుమొనగాళ్ళు నిర్మాత –పి.మల్లికార్జునరావు

పర్వతనేని మల్లిఖార్జునరావు సుప్రసిద్ధ సినిమా నిర్మాత.ఆయన 70వ దశకంలో తెలుగులో అనేక మంచి చిత్రాలను నిర్మించారు

జీవిత విశేషాలు

ఆయన 1935 జూలై 27న కృష్ణా జిల్లాలో జన్మించారు.

సినిమా ప్రస్థానం

ఆయన సినిమాలపై మక్కువతో మధుపిక్చర్‌, భారతీ ఇంటర్‌, నేషనల్‌, సునందిని పిక్చర్స్‌ పతాకంపై పలు తెలుగుహిందీ చిత్రాలను నిర్మించారు. 1965లో జ్వాలాద్వీప రహస్యం (కాంతారావు- విఠలాచార్య)..ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత ఇద్దరు మొనగాళ్ళు, మంచి కుటుంబం, మంచి మిత్రులుఇంటి గౌరవం, ఇంటికోడలు, మహాబలుడు, నేనంటే నేనే తదితర చిత్రాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్‌ (జితేంద్రతో), కీమత్‌ (ధర్మేంద్ర, రేఖ), మౌసుమ్‌ (సంజరుకుమార్‌) చిత్రాలను నిర్మించారు. 1976లో ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసలు లభించాయి. ఇవికాక సంజోగ్‌, ఆగాడిన్‌ ఆదిరాత్‌, ఏతో ఖనాల్‌ హోగయా, ఏ దేశ్‌, ఈశ్వర్‌ తదితర చిత్రాలు నిర్మించారు. జ్వాలాద్వీప రహస్యం, ఇద్దరు మొనగాళ్లు, మంచి కుటుంబం, మంచి మిత్రులు, ఇంటి గౌరవం, ఇంటి కోడలు, మహాబలుడు, నేనంటే నేనే లాంటి చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు. బాలీవుడ్‌ లో కూడా హిమ్మత్, కీమత్, వౌసమ్, సంజోగ్, ఏతో ఖమాల్ హోగయా, ఏ దేశ్, ఈశ్వర్ వంటి చిత్రాలను నిర్మించి తెలుగు పతాకాన్ని ముంబాయిలో ఎగురవేశారు. 1976లో రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు.[1]

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరణం

పర్వతనేని మల్లిఖార్జునరావు (76) 2012 ఫిబ్రవరి 21 న హైదరాబాద్‌లోని మెడ్విన్‌ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు.

375-తెలుగు హిందీ బెంగాలీ సినీ దర్శకుడు ,ఆత్రేయగారి శిష్యుడు ,హిందీ,బెంగాలీ  పాండవ వనవాస చిత్ర నిర్మాత ఇంటింటి రామాయణం సినీ ఫేం –పి.సాంబశివరావు

పర్వతనేని సాంబశివరావు సినిమా దర్శకుడు. ఆయన సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో తెలుగుతో పాటు హిందీబెంగాలీ చిత్రాలు కూడా ఉన్నాయి

జీవిత విశేషాలు

ఆయన 1935 సెప్టెంబరు 20 న ఏలూరులో జన్మించారు. బి.ఎస్.సి. వరకూ ఏలూరులోనే చదువుకున్నారు. డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఆయన నాన్నగారు చనిపోయారు. తరువాత ఆయన చదువు కొనసాగలేదు. ఆయన అన్నయ్య “నవశక్తి” గంగాధరరావుగారు అప్పటికే చిత్రపరిశ్రమలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. ఆయన దగ్గరకు వెళ్లడంతో విక్రమ్ లాబరేటరీలో ఆఫ్రెంటీస్ గా చేర్పించారు. ఏడాది అక్కడ పనిచేసిన తర్వాత 1959లో సారథీ సూడియోస్ వారి ల్యాబ్ లో చేరారు. అయితే ఎందువల్లనో గానీ ఆయనకు తాను చేస్తున్న ఉద్యోగం నచ్చలేదు. మానేద్దామనుకున్న తరుణంలో ఆయన అన్నయ్య “మా ఇంటి మహాలక్ష్మి” చిత్ర నిర్మాణం ప్రారంభించారు. హైదరాబాదులో పూర్తి స్థాయిలో రూపుదిదుకున్న తొలి చిత్రం అదే. ఆయన సొంత సినిమా కావడ చేత ఆయన ఉద్యోగం వరిలేసి ఆ చిత్రనిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు రామినీడు గారి దగ్గర అసిస్టెంట్ గా చేరడంతో పాటు ప్రాడక్షన్ పనులు కూడా పర్యవేక్షించే వారాయన. ఆ సినిమా పూర్తయిన తర్వాత తాపీ చాణక్య గారి దగ్గర “జల్సారాయుడు” చిత్రానికి, సి.ఎస్.రా వుగారి దగ్గర “పెళ్లికాని పిల్లలు” చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. సి.ఎస్.రావుగారి దగ్గర చాలా సినిమాలకు పనిచేశారు.

ఆత్రేయ గారి వద్ద శిష్యరికం

ఆయన కొంతకాలం ఆదుర్తి సుబ్బారావుగారి దగ్గర పనిచేశారు. సుబ్బారావు గారి చిత్రాలకు ఆత్రేయ గారు రచయిత. రాసే అలవాటు ఆత్రేయగారికి లేనందువల్ల ఆయన డిక్లేట్ చేస్తుంటే అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలి. అందుకే ఆదుర్తి సుబ్బారావుగారు సాంబశివరావు గారిని ఆయన దగ్గరకి రాసుకొనే నిమిత్తం పంపించే వారు. అలా ఓ ఏడాది పాటు ఆత్రేయగారి శిష్యరికం చేశారు. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా ఎడిటర్, డైరెక్టర్ అక్కినేని సంజీవి గారి దగ్గరకు వెళ్లి ఎడిటింగ్ నేర్చుకునేవారు.

బెంగాలీ లోకి “పాండవ వనవాసం

ఎన్.టి.రామారావుఎస్.వి.రంగారావుసావిత్రి వంటి ఉద్దండుల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ‘పాండవ వనవాసం” చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాత ఎ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సాంబశివరావుగారి అన్నయ్య బెంగాలీ లో డబ్ చేసారు. బెంగాలీలోనికి అనువదింపబడిన తొలి చిత్రం అది. దీని డబ్బింగ్ బాద్యతలను సాంబశివరావుగారే నిర్వహించారు. దీనికోసం ఆయన కలకత్తా వెళ్ళి రెండు నెలలు ఉండి డబ్ చేసారు. “పాండబేర్ బనవాస్” పేరుతో విడుదలైన ఆ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది.

దర్శకునిగా

దర్శకునిగా ఆయనకు తొలి అవకాశాన్ని ఆయన తండ్రిగారు యిచ్చారు. హైదరాబాద్ మూవీస్ పేరిట ఒక సంస్థను నెలకొల్పి ఆయనతో సినిమా చేయడానికి సన్నాహాలు ప్రారంభించారాయన. అయితే ముందే ఒక షరతు పెట్టారాయన. కథ ఏమిటో దాన్ని ఎలా తీయాలో వివరంగా రాసివ్వమని, అది నచ్చితేనే సినిమా తీయుటకు అంగీకరిస్తానని తన తండ్రి చెప్పారు. అపుడు సాంబశివరావుగారు చెప్పిన “అర్థరాత్రి” సినిమా కథ నచ్చి సినిమా నిర్మించారు. దర్శకుడిగా అదే ఆయన తొలి సినిమా. జగ్గయ్య గారు హీరో, గ్రూప్ డాన్సర్ అయిన భారతికి హీరోయిన్‌గా ఇదే తొలి చిత్రం. ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి గారు కూడా తాన “బంగారు పంజరం” సినిమాలో ఈయన మార్గాన్ని అనుసరించారు. అర్థరాత్రి సినిమా ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చి పెట్టింది. తరువాత అంత గుర్తింపు తెచ్చిన సినిమాలు రాలేదు.

ఇంటింటి రామాయణం

ఏలూరులో ఉంటున్న నిర్మాత, దర్శకుడైన విజయబాపినీడు గారు ఆయన స్నేహితుడు. సాంబశివరావు గారు దర్శకత్వం వహించిన కొన్ని సినిమూలు చూసి ఆయన “రంభ ఊర్వశి మేనక(1976) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. కొద్ది కాలం విరామం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఆయనకు మళ్లీ వరుసగా అవకాశాలు ఆయనకు వచ్చాయి. “రంభ ఊర్వశి మేనక” చిత్రం షూటింగ్ జరుగుతుండగానే నవతా కృష్ణంరాజు గారు ఓ సినిమా చేయమని అడిగారు. ఆయన కూడా ఏలూరులో ఆయన స్నేహితుడు. ఇదే ‘ఇంటింటి రామాయణం‘. ఆ సినిమా పెద్ద హిట్ అయి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది.

హిందీ సినిమా ప్రస్థానం

ఆయన ప్రముఖ నిర్మాత, సత్యచిత్ర అధినేత అయిన సత్యనారాయణ గారి కుమార రాజాకొత్తపేట రౌడీఉద్దండుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఉద్దండుడు చిత్రం ప్లాప్ అయింది. ఆయన దర్శకత్వం వహించిన ఇంటింటి రామాయణం యొక్క ఘనవిజయాన్ని చూసిన నాగిరెడ్డి గారు గుండమ్మ కథ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయమని కోరారు. గుండమ్మ కథ హిందీలో “స్వయంవర్” పేరుతో ప్రారంభమైనది. ఆ చిత్రానికి ఎన్.టి.ఆర్ పాత్రను సంజీవ్ కుమార్, ఎ.ఎన్.ఆర్ పాత్రను శశికపూర్, సావిత్రి పాత్రను విద్యాసిన్హా, సూర్యకాంతం పాత్రను నాదీరా పోషించారు.

దర్శకత్వం వహించిన సినిమాలు

1.    అర్ధరాత్రి (1968)

2.    భలే మోసగాడు (1972)

3.    వంశోధ్ధారకుడు (1972)

4.    నిండు కుటుంబం (1973)

5.    ఉత్తమ ఇల్లాలు (1974)

6.    అమ్మాయిలూ జాగ్రత్త (1975)

7.    రంభ ఊర్వశి మేనక (1977)

8.    మనస్సాక్షి (1977)

9.    కలియుగ స్త్రీ (1978)

10.  కుమారరాజా (1978)

11.  ఇంటింటి రామాయణం (1979)

12.  అల్లరి బావ (1980)

13.  కొత్తపేట రౌడీ (1980)

14.  ప్రణయ గీతం (1981)

15.  ఈనాడు (1982)

16.  ఎంత ఘాటు ప్రేమయో (1982)

17.  ప్రేమ నక్షత్రం (1982)

18.  పెళ్ళి చూపులు (1983)

19.  ఉద్దండుడు (1984)

20.  మృగతృష్ణ (1992)

నిర్మించిన సినిమాలు

1.    ఇదికాదు ముగింపు (1983)

వ్యక్తిగత జీవితం

ఆయనకు ఇద్దరు పిల్లలు. 1990 నుండి సీరియల్స్ కి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విజయవంతమైన “సత్యం” సినిమాను బెంగాలీ లోనికి రీమేక్ చేసారాయన. అలాగే అనేక టెలీఫిల్మ్‌ లను కూడా రూపొందిస్తున్నారు.

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-22-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.