శరీర మాద్య౦ ఖలు ధర్మ సాధనం
అని మనకే కాదు ఇతర దేశీయులకూ ఆదర్శమే .లూ గెహృగ్ గొప్ప బేస్ బాల్ ప్లేయర్ ..జ్వరాలతో మైగ్రేన్ ,వెన్ను నొప్పితో తో,కండరాలవాపుతో ,మోకాళ్ళ నొప్పులతో ,గంటకు 80మైళ్ళ వేగంతో తలకు ఫాస్ట్ బాల్ తగిలి బాధ పడుతున్నా
మొక్కవోని ధైర్యంతో చెక్కు చెదరని విశ్వాసం తో ఆడుతూనే ఉన్నాడు ..
ఒకదాని తర్వాత ఒకటిగా 2130 గేమ్స్ ,ను న్యూయార్క్ యాంకీల జట్టు లోఅయిదున్నర దశాబ్దాలు బేస్ బాల్ కు అంకితమై ఆడాడు .అతని శరీర దారుఢ్యం అంతగొప్పది . ఆ రోజుల్లో రెగ్యులర్ సీజన్స్ లో 152,గేమ్స్ ,ఆడాడు ప్రపంచ సెరీస్ లో 7 సార్లు పాల్గొన్నాడు ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా విరామం లేకుండా ఆడేవాడు .ఊహించటానికే వణుకు పుట్టే ఆట ..ఆఫ్ సీజన్ లో ఏక్సిబిషన్ మాచెస్ లలో ఎన్ని ఆడాడో లెక్కే లేదు .జపాన్ దాకా ప్రయాణం చేసి ఆడాడు .యాంకీల తరఫున 350 డబుల్ హెడర్స్ ఆటను దేశమంతా లక్షలాది మైళ్ళు తిరిగి ఆడిన బేస్ బాల్ దిగ్గజం అతడు ..ఇన్ని ఆటలు ఇంతకాలం ఆడినా ఎప్పుడూ గేమ్ మిస్ కాలేదు అదొక రికార్డ్ .
ఇంతటి సాధన నైపుణ్యం అతను పూర్తి ఆరోగ్యంతో ఆడాడని కాదు అతడు ఒక ఐరన్ హార్స్ లాంటి వాడు దానితోనే సాధ్యమైంది.ఇతరులెవరైనా బాధల సాకుతో ఆటకు దూరమఔతారు అతడు అలా ఎన్నడూ కెరీర్ లో చేయకపోవటం ఆశ్చర్యం దట్ ఈజ్ లూ గెహృగ్ .కెరీర్ లో అతనై ప్రతి వేలూ విరిగింది .కానీ అతని ఆట వేగం మాత్రం తగ్గనే లేదు .అతని కెరీర్ బాటింగ్ సరాసరిమహిమాన్వితం ..పోస్ట్ సీజన్ లో 361, వరల్డ్ సిరీస్ లో .495 హోం రన్స్ చేశాడు అందులో 23 గ్రౌండ్ స్లాంస్ ఉన్నాయి .ఈ రికార్డ్ దాదాపు 70 గా నిలిచే ఉంది .1934 లో ధర్డ్ ప్లేయర్ గా ,,టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు .బేస్ బాల్ హిస్టరీలో 1995 రికార్డ్ రన్స్ చేసి చరిత్ర సృష్టించాడు రెండు సార్లు MVP,7సార్లు ”ఆల్ స్టార్ ”,ఆరుసార్లు వరల్డ్ సిరీస్ ఛాంపియన్ .,హాల్ ఆఫ్ ఫేమర్ కూడా .”He is the first player ever to have his number retired ” అని కీర్తింప బడినాడు .
అయితే అతడు పుట్టుకతోనే క్రీడాకారుడు కాదు అని గ్రహించాలి .తనను తాను క్రీడాకారుడిగా మలచుకొన్న మహోన్నత వ్యక్తి ..తండ్రి పరమ తాగు బోతు.దేనికీ పనికి రాని వాడు.ఏపనిలో ఉన్నా తరచుగా డుమ్మా కొట్టే రకం ..తండ్రిని చూసి తను అలాకాకూడదని నిర్ణయించుకొని తనజీవితాన్ని తీర్చి దిద్దుకొని అద్భుత చరిత్ర సృష్టించాడు .తల్లి మాత్రం కొడుకు జీవితం బాగా ఉండాలని చాలా కష్టపడి పని చేసేది .బీదరికం లో బతికిన కుటుంబం .అతని క్లాస్ మేట్స్”చలికాలం లో కూడా అతడు ఎప్పుడూ స్కూలు మానలేదు .ఖాకీ డ్రెస్ ,బరువైన బూట్లు తో వచ్చే వాడు నెత్తిన టోపీ కూడా ఉండేదికాదు ”అని జ్నాపకం చేసుకొంటారు
అలాగే ష్టాయిక్ ఫిలాసఫర్ క్లియాన్ధెస్ ఎధెన్స నగర వీధులలో వింటర్ లో గుండీలు లేని పల్చటి గౌన్ వేసుకొని చలిగాలి ఈడ్చి కొడుతున్నా తిరిగేవాడు .గడ్డకట్టిన మంచులో కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగేవాడు .పాదాలు చిట్లిపోయేవి ఆ బాధను చిరునవ్వుతో భరించేవాడు.మన బేస్ బాల్ ప్లేయర్ గెహృగ్ అమెరికాలోనే అత్యంత పెద్ద జీతం తీసుకొనే క్రీడాకారుడే అయినా ,న్యూయార్క్ వింటర్ లో హాట్ పెట్టుకోవటం ఎవరూ చూసిన దాఖలాలు లేవు .మంచి అమ్మాయిని వివాహం చేసుకొని ,ఆమె బలవంతంతో ఆమెకోసం కోటు వేసే వాడు
అందరూ పిల్లలు ఆడుతారుకానీ గెహృగ్ ఆటలో ”హయ్యర్ కాలింగ్ ‘దర్శించేవాడు .బేస్ బాల్ ఆట ప్రొఫెషన్ల్ గేమ్ దానికి కంట్రోల్ ,శరీర జాగ్రత కావాలి .లేక పోతే విజయంరాదు విజయానికి అవే ముఖ్యం ..ఈరెండూ అతడు పాటించి విజయాలపై విజయాలు సాధించాడు .అందరికన్నా ఎక్కువ కష్టపడే వాడు .”Fitness is religion for him .”.తాను బేస్ బాల్ బానిస ను అని గర్వంగా చెప్పుకొనేవాడు .ఇలాంటి అంకితభావం ఉన్నవారికి విజయాలు సాధించటం పెద్ద కష్టం యేమీ కాదు .అవే వెంటపడి వరిస్తాయి .ఆట దైవం గా భావించేవాడు .నిటారుగా వూలు యూని ఫారం లో ఉండేవాడు .బరువులెత్తే వాడు శరీరాన్ని స్ప్రింగ్ లాగా వశపరచుకొనే వాడు .ఏఆటగాడినైనా ,ఎక్కడైనా కొట్టగలిగే సామర్ధ్యం అతనిది ఆటలో .అతనివి ”పియానో లెగ్స్ ”అనే వారు .
అతడు ఏనాడూ సిగరెట్ తాగలేదు.మందుకొట్టలేదు అమ్మాయిలతో తిరగలేదు .న్నేను ప్రీచర్ నూకాదూ ,సెయింట్ నూ కాదు అనేవాడు
1938 ఆగస్ట్ లో షెడ్యూల్ ప్రకారం యాంకీలకు నాయకత్వం వహించి 35రోజుల్లో 36మాచెస్ అయిదు సిటీలలో వేలాది మైళ్ళు ప్రయాణం చేసి ఆడాడు.329 రన్స్ ,38RBI లు చేసిన ఘనుడు .ఇదంతా ఎలా సాధ్యం అంటే శరీరం పై కంట్రోల్ అన్నాడు శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకొంటే అది మన విజయాలకు తోడ్పడుతుంది అనేవాడు భగవంతుడిచ్చిన శరీరం ఇలా మంచికి దేశ కీర్తికి ఉపయోగపడాలి అనేవాడు .చనిపోవటానికి ముందు ”I conside rmyself the luckiest man on the face of the earth ”అన్నాడు .అతడు19-6-1903 న పుట్టి 2-6-1941న 38యేళ్ళ వయసులోనే మరణించాడు
అతని జీవితం మనకు నేర్పేది యేమిటి ?శరీరం ఆరోగ్యంగా ఉంటే అన్నీ మనకు సాధ్యమౌతాయి .శరీరం పై మనమే ఆధి పత్యం సాధించాలి .అది మన పై పెత్తనం చేయరాదు .ఆరోగ్యం తగ్గి శరీరం సహకరించక పోతే ,మన వ్యాపకానికి స్వస్తి చెప్పాలి .శరీరం మనకు శిక్షణా స్థలం అది మన ”proving ground for the mind and soul..ఇదే మనం చెప్పే శరీరమాద్యం ఖలు ధర్మసాధనం .
ఆధారం -రియాన్ హాలిడే రచన -డిసిప్లిన్ అండ్ డేస్టీని.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -12-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్
వీక్షకులు
- 978,719 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
- (no title)
- ’ఉత్కళ వ్యాసకవి’’ -ఫకీర్ మోహన్ సేనాపతి -11(చివరి భాగం )
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,920)
- సమీక్ష (1,275)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (298)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు