అతి సర్వత్ర వర్జయేత్ ,కష్టే ఫలి
అని నానుడి .దీన్ని మనమే కాదు అన్నీ దేశాలవారూ అనుసరిస్తారు .లేనివారు దాని చెడుఫలితాలను అనుభవిస్తారు .నాల్గవ జార్జి మహా తిండి పోతు..అతని బ్రేక్ ఫాస్ట్ -రెండు పావురాలు ,మూడు స్టీక్స్ అంటే మాంసం ముక్కలు ,,ఒక పూర్తి వైన్ బాటిల్ ,,ఒక గ్లాసు బ్రాందీ ..ఈ తిండితో పొట్టపెరిగి , ఆబరువుతో అటూ ఇటూ తిరగలేక ఉక్కిరిబిక్కిరౌతూ నిద్రపోయేవాడు కాదు .రాజపత్రాలపై సంతకాలు పెట్టటానికి కూడా ఇబ్బంది పడే వాడు .ఈ బాధ భరించలేక తన సంతకానికి ఒక స్టాంప్ తయారు చేయించి సేవకులతో గుద్దించేవాడు .అంటే సంతకం పెట్టె శ్రమకూడా పడే ఓపిక లేకుండా ఉండేవాడు .అతి తిండి ఫలితం ఇది ..అయితే అనేక మంది పిల్లలకు చట్ట విరుద్ధమైన తండ్రి అయ్యాడు .రాచకార్యం కన్నా రతి కార్యం పై అధిక మోజున్న వాడు .ఆరోగ్య సూత్రాలకు ,మానవ త్వానికి తాను కట్టుబడాల్సిన అవసరం లేదని భావించేవాడు .తనకు యేమీ ఇబ్బంది లేదనీ ఏ రూల్స్ తనను ఏమీ చేయలేవని ,,పర్యవసానంగా ఏ పరిణామాలు తనదరి చేరవని నమ్మేవాడు ..సంవత్సరాల తరబడి అతని అంతు లేని దురలవాట్లు,తీవ్ర బద్ధకం అతనని దెబ్బ తీసి 1830 వేసవిలో ఒకరోజు తెల్లవారుజామున 3.30గం లకు అతను ”దేవుడా ఏమిటిది ?”అన్నాడు అప్పుడు తెలిసింది అది యేమిటో..ఊపిరి కూడా సరిగ్గా పీల్చలేక ”ఇదే చావు ”అని ప్రాణాలు వదిలాడు ..అప్పుడు తెలిసింది తాను మర్త్య్యుడను అని అమరుడినికాను అని అర్ధమైంది. తనకూ మహారాజైనా చావు తప్పదని అర్ధమయింది .ఆరోగ్యం చెడి ముందే చనిపోయాడు .
మరో మహాను భావుడున్నాడు లూ గెహృగ్ తో పాటు బేస్ బాల్ ఆడేవాడు బెబ్ రూత్ ..ఇతడి బ్రేక్ ఫాస్ట్ – అల్లం రసంతో కలిపిన పింట్ ఆఫ్ విస్కీ,తర్వాత మాంసం ముక్క ,నాలుగు గుడ్లు ,ఫ్రైడ్ పొటాటోస్ ,ఒక పాత్రనిండా కాఫీ ,.మధ్యాహ్న భోజనం లో కోకాకోలాతో ముంచిన నాలుగు హాట్ డాగ్స్ , .రాత్రి రెండు మాంసం ముక్కలు ,బ్లూ చీజ్ లో ముంచిన రెండు పాలకూర కట్టలు ,రెండు ప్లేట్ ల ఫ్రైడ్ పొటాటోస్ ,,రెండు ఆపిల్ ముక్కలు .మధ్యాహ్న రాత్రి భోజనాలమధ్య మళ్ళీ నాలుగు హాట్ డాగ్స్,నాలుగు కోకాకోలా బాటిల్స్ ..ఈ అధిక మద్యం హాట్ డాగ్స్ తిండితో ఒకసారి అకస్మాత్తుగా హాస్పిటల్ పాలయ్యాడు .లూ గెహృగ్ తో ”చూడు మిత్రమా లూ !- ఆరోగ్యం జాగ్రత్త .నేను జీవితంలో చాలా తప్పులు చేశాను .దేన్నీ లక్ష్య పెట్టలేదు దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను .సరైన సమయాలలో తింఆన్డి తినే వాడినికాదు .సరిఆయన మార్గం లో నడవలేదు .వాటన్నిటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను .నాలాగా నువ్వు ప్రవర్తించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు ”అని చెప్పాడు ఆతిండిపోతు బెబ్ రూత్ సక్రమ0 గా జీవిస్తున్న లూ గెహృగ్ తో..జీవితం లో క్రమ శిక్షణ పాటిస్తే బెబ్ అత్యద్భుత విజయాలు సాధించ గలిగి ఉండేవాడు అలా చేయకపోవటం తో కెరీర్ దెబ్బతిన్నది .
కింగ్ జార్జి ని 26వ అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ని పోల్చి చూద్దాం .జార్జిది విచ్చలవిడి జీవితం .”టెడ్డీ” అని పిలువబడే ధియోడర్ రూజ్ వెల్త్ ది నిశ్చలమైన ,నిబద్ధమైన జీవితం ..పుట్టటమే చాలా బలహీనంగా,దుర్బలమైన శరీరంతో పుట్టాడు రూజ్వెల్ట్ .అతని దృష్టి అంతా విద్యావ్యాస0గం పైనే ..అతని కళ్ళకు హ్రస్వ దృష్టి ఉండేది .ఊపిరితిత్తులు బలహీనమైనవి .ఏమాత్రం శారీరక ఒత్తిడినీ భరించ గలిగేవి కావు.ఒక సారి తండ్రి కేకేలేస్తుంటే ”నన్ను తిట్టద్దు ఆస్త్మా వస్తుంది ”అని చెప్పాడు .రాత్రి వేళలో ఉబ్బసం తో ఉక్కిరిబిక్కిరయెవాడు .దా.దాపు చావు ముఖద్వారం వద్ద ఉన్నట్లు ఉండేది అతని పరిస్తితి .
కానీ తండ్రి ప్రోత్సాహం అత్య0త సహనం వలన రూజ్వెల్ట్ క్రమంగా కోలుకొని విజయాలపై విజయాలు సాధించాడు .వీధి చివర ఉన్న జిమ్ లో తర్వాత ఇంట్లో ఉన్న జిమ్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసే వాడు ,హార్వర్డ్ లోనూ హార్డ్ వర్క్ చేశాడు .తన శరీరాన్ని క్రమశిక్షణగా మలచుకోవటమేకాదు జీవితాన్నీ దేశాన్నీ ,ప్రపంచాన్నీ మలిచాడు .రూజ్ వెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ అని రుజువు చేశాడు .వాకింగ్ రోయింగ్ బాక్సింగ్ ,రెస్లింగ్ ,హైకింగ్ హంటింగ్ ,హార్స్ రైడింగ్ ,ఫుట్ బాల్ లలో కృషి చేసి ఛాంపియన్ గా రుజువు చేసుకొన్నాడు శరీరాన్ని ఆరోగ్య వంతంగా మలచు కోవాలన్న అతని తపనే ఇన్ని పనులు చేయించింది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ కి ఉదాహరణగా నిలిచాడు టెడ్డీ..జీవితం లో ఒక్కరోజు కూడా వీటి ప్రాక్టీస్ మానలేదు అంటే ముక్కున వేలు వేసుకొంటామ్ .ప్రెసిడెంట్ గాకూడా చాలామంది యువకులకంటే మహా చలాకీగా ఉండేవాడు ,”సాయం వేళ వైట్ హౌస్ లో కూడా రోజూ రెండు గంటలు ఎక్సెర్సైజ్ చేసే వాడిని ”అని రాసుకొన్నాడు .బిజీ బిజీ అమెరికా ప్రెసిడెంట్ రోజుకు రెండు గంటలు ఇలా ప్రాక్టీస్ చేశాడని తెలిస్తే అవాక్కైపోతామ్ అది నిజం నిజం .
కనుక ”If greatness is our aim ,if we want to be productive ,courageous members of society ,we need to take care of our bodies ”.ఆరోగ్యవంతమైన ఆహారం ,మత్తు మందులకు పానీయాలకు దూరంగా ఉండటం తప్పని సరి అప్పుడే నీ ఆశయాల గమ్యం చేరగలవు
జీవితం అంటే పెను సవాళ్ళ మయం .కష్టాల కడలి..పని ఒక్కటే పని చేయదు .శరీరం పై నియంత్రణ ఉండాలి అప్పుడు మనసూ మనం చెప్పినట్లు వింటుంది .స్టాయిక్ ఫిలాసఫర్ సెనేకా ”You must be active .get your daily win .treat the body rigorously so that it may not be disobedient to the mind.”అని హితవు చెప్పాడు .కండరాలు పెంచితే మానసిక శక్తి పెరుగుతుంది .1902 కోల్ స్ట్రైక్ లో రూజ్వెల్ట్ అలసిపోయాడా ?వర్కర్స్ తరఫు లాయర్లతో పత్రికా విలేకరులతో ఎన్ని సార్లు సుదీర్ఘ చర్చలు జరిపాడో తెలుసా ?ఒకడు తనపై పేల్చిన తుపాకి గుండు ఉపన్యాసం మొదలుపెట్టే ముందు అతని చాతీకీ తగిలి ఎంత ఇబ్బంది పడ్డాడోతెలుసా ?
తను దిగిపోయే సమయం వచ్చిందని గ్రహించాడు తన శక్తి సామర్ధ్యాలు చాలటం లేదని గ్రహించాడు .తనకంటే యువకులు ఇంకా బాగా పని చేయగలరని గ భావించలేదు.తన శక్తికీ పరిమితులు ఉన్నాయని అర్ధం చేసుకొన్నాడు .కానీ అలాగే కొనసాగాడు అతనికి గొప్ప అనుభవం ఉంది శరీరాన్ని మనసును సమాధాన పరచాడు .వాటికి గొప్ప శిక్షణ ఇచ్చాడు తన శక్తి సామర్ధ్యాలేమిటో తెలుసు అవి అమెరికాకు ప్రజలకు ఎలా ఉపయోగించాలో తెలుసు .అందుకే నిశ్చలమనస్తత్వంతో నిలిచి దేశాభి వృద్ధి చేసి జన జీవనాన్ని తీర్చి దిద్దాడు రూజ్ వెల్ట్. .
ఆధారం -రియాన్ హాలీడే రచించిన -డిసిప్లిన్ అండ్ డేష్టిని .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్