వ్యసనం పతనం 

వ్యసనం పతనం 

  ”వ్యసనానికి బానిస నీవైతే పతనానికి దారిని నే చూపిస్తా ”అంటుంది ..మకార త్రయం అంటే మగువ మద్యం ,మాంసం,ధూమపానం లకు విపరీతంగా బానిసలైతే అవి మన పతనాన్ని దగ్గర చేస్తాయి ..వాటి వలయం లో చిక్కుకుంటే బయట పడటం ఎంతటి వాడికైనా కష్టమే .

  రెండవ ప్రపంచ యుద్ధం లో డ్విలైట్ ఐసెన్ హోవర్ మిత్ర పక్షాల సుప్రీం కమాండర్ గా  తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి నాజీ హిట్లర్ చెరనుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాడు నార్మ౦డీ లో కాలుపెట్టి ,నాజీలను హతం చేసి  జర్మనీ ని హస్తగతం చేసుకొన్నాడు .1949లో .విజేత అని పించుకొన్నాడు .అప్పటిదాకా ఆయన జీవిత మంతా యుద్ధాలు వ్యూహాలతోనే గడిచి పోయింది ..అప్పుడు తనను తాను సంస్కరించుకొన్నాడు .-అదే ఆక్షణం నుంచి ”ఇక సిగరెట్ తాగను ”అని నిశ్చయించుకొన్నాడు .అది 38 యేళ్ళ వ్యసనం దానికి ఒక్క క్షణం లో గుడ్ బై చెప్పాలను కొన్నాడు,చెప్పేశాడు .బయటి శత్రువులను జయించటం తేలికే సిగరెట్ మద్యం వంటి అంతశ్శత్రువులను జయించటం తలకు  మించిన పని. ఒక రకంగా అందరి దృష్టిలో అసాధ్యం ..కానీ అసాధ్యాన్ని అత్యంత సులభంగా సుసాధ్యం చేసి చేసి చూపించి మార్గదర్శి అయ్యాడు అదీ అతని మానసిక శక్తి -విల్ పవర్ .ముక్కున వేలేసుకొన్నారు ప్రపంచ ప్రజలు ..దీన్ని గురించి అతని చరిత్రకారుడుజీన్ ఎడ్వర్డ్ స్మిత్ ”A life time smoker of four packets a day ,Eisen hower quit cold turkey –and never touched a cigarette again . ”అని రాశాడు .ఆయన అనేవాడట”The only way to stop is to stop ..”ఆయనకు ఎవరూ చెప్పలేదు ఆయనే అలా నిర్ణయించుకొన్నాడు దానికే కట్టు బడి ఉన్నాడు యుద్ధ విజేతమాత్రమే కాదు వ్యసన విజేత అయ్యాడు కూడా ..అది తన బాధ్యత అనుకోని పాటించాడు .సిగరెట్ కు బానిస కాకుండా తన శరీరాన్ని ,మనసునీ కంట్రోల్ చేసుకొని ,విస్తృత ప్రపంచానికి సేవ చేయగలిగే మహా భాగ్యాన్ని పొందాడు ..ముందుగా ”నాటో”కు సారధ్యం వహించి ఆతర్వాత సర్వాధికారాలు ఉన్న 34వ  అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకో బడ్డాడు .. అదే సమయం లో 1949 లో ఒక రోజు యాదృచ్ఛికంగా ,ఆయన డాక్టర్ రిచార్డ్ ఫే మన్ తన తాగుడు అలవాటుకు స్వస్తి చెప్పాడు .ఇద్దరూ వ్యసనం అనే బానిసత్వం నుండి బయటపడి స్వేచ్చ పొందారు .

 అందుకే ”self mastery  is an instinctive reaction against any thing that masters us ”అన్నారు .ఇలాంటి వ్యసన బానిసత్వాన్ని గురించి ప్రముఖ వేదాంతి సెనేకా ” even slave owners were chained to the responsibilities  of  the institution of slavery ”అని చక్కగా చెప్పాడు .బౌద్ధులు చెప్పిన తనః అంటే అత్యాశ లేక దాహం ,

తృష్ణ అంటే కోరిక .అది సెక్స్ కాదు ,డ్రింక్ కాదు .అది నీడ్ అంటే అవసరం ..ఈ అవసరమే అనేక అనర్ధాలకు ,పతనానికి కారణం .

  అమీ విన్ హౌస్ డ్రగ్స్ కు ,టైగర్ వుడ్స్ స్త్రీలకు బానిసలై అధః పతనం పొందారు .లూ గెహృగ్ ను  తన నరాలశక్తికొసం ఆటమొదలవటానికి ముందు తనను తాను గిల్లుకోవటం లేక గాయం చేసుకోవటం చూసిన కోచ్  ”.you are not going to like where this road ends and it always seems to end in the same place ” అని హెచ్చరించేవాడు .ప్రపంచం లో ఎంత మొగాడైనా ఎంత గొప్ప హోదాలో ఉన్నా ఏదో ఒక చెడు అలవాటుకు బానిస అవటం లోక సహజం…కానీ త్వరలో గ్రహించి దాని నుండి విముక్తి పొంది స్వేచ్చ పొందాలి .58యేళ్ళ ఐసెన్ హోవర్ కు సిగరెట్ అలవాటు 38 యేళ్ళు .దాన్ని వదిలించుకొని తనను తాను రక్షించుకొని ప్రపంచ మార్గదర్శి అయ్యాడు అదీ గొప్పతనం అంటే ..దురలవాటు అనే బానిసత్వం నుంచి మనం ముక్తులవ్వాలి అనుకొంటే ఏదీ అసాధ్యం కానే కాదు -we can save ourselves,so we can save the world and keep saving and keep saving”

  ఆధారం – రియన్ హాలిడే రాసిన -డిసిప్లిన్ ఈజ్ డేష్టిని .

 మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్ 

– 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.