అనవసరాన్ని  నివారించాలి 

అనవసరాన్ని  నివారించాలి 

కాస్టో ది ఎల్డర్ అతి తక్కువ వెల ఉన్న దుస్తుల్నే ధరించేవాడు .తన బానిసలు ఏ డ్రింక్ తాగితే అదే తాగేవాడు .వాళ్లతోనే పొలాల్లో కలిసి తిరుగుతూ పని చేయించేవాడు .తాను యజమాని అని వాళ్ళు బానిస కూలీలు అనే భేదం చూపించేవాడు కాదు.తన ఆహారాన్ని బయటే కొనుక్కోనే వాడు .విలాసవంతుల జీవితాలకు విరుద్ధంగా అతి సామాన్య జీవితాన్నే గడిపే వాడు .అనవసరమైంది కాకపోతే ప్రతిదీ విలువైనదే అని చెప్పేవాడు .అవసరం లేకపోతే అసలు కొనే వాడే కాదు .ఈరకమైన పొదుపు లేమి , దరిద్రత   వలన కాదు స్వేచ్ఛకోసమే ..అతని నివాస గృహం కూడా అతి సాధారణమైనదే .అతనికి ప్రేరణ మానియస్ క్యూరియస్ ..విజేత అయి బాగా ప్రసిద్ధుడైన తర్వాత ,కొంతమందిని పంపి క్యూరియస్ ను లంచంతో లొంగ దీసే ప్రయత్నం చేస్తే వాళ్ళు అతన్ని కిచెన్ లో  టర్ణిప్ లను ఉడికిస్తుండగా చూసి అవాక్కయ్యారు .ఒక్క క్షణం లోనే వారు తమ ప్రయత్నం విఫలం అని గ్రహించారు ..అత్యంత తక్కువ దానితో పూర్తిగా సంతృప్తి చెందేవాడు ఎప్పుడూ ప్రలోభాలకు గురికాడు.

  కావాల్సిన దానికంటే మనం ఎక్కువగా కోరుకొంటే ,మనకు మనమే దుర్బలులమ్ అయిపోతామ్ ..మనం దాని వెంట పడితే మనం స్వయం సమృద్ధికలవాళ్లం అని పించుకోము ..అందుకే  కేటో ఖరేదైన బహుమతులు స్వీకరించే వాడు కాదు .తన రాజకీయ జీవితాన్నికూడా ఒక్క పెన్నీ జీతం  తీసుకోకుండా గడిపాడు .కొద్దిమంది సేవకులతోనే ప్రయాణం చేసేవాడు  

  ఇంతకీ ఎవరు ఈ కేటో?కేటో ది సెన్సార్ అని ,ఎల్డర్ అని వైజ్ అని పిలువ్బడే కేటర్ 234-149 BC కు చెందిన రోమన్ సోల్జర్ ,సెనేటర్,హిస్టోరియన్ .లాటిన్ లో ”ఆరిజిన్స్”రాసిన  మొదటి చరిత్ర కారుడు .ఇదే రోమ్ నగరం పై రాయబడిన మొదటి చరిత్ర .వ్యవసాయం పైనా లాటిన్ లో వచనం లో పుస్తకం రాశాడు .ఇతని మనవడు కాటో ది యంగర్ -జూలియస్ సీజర్ ను  పూర్తిగా వ్యతిరేకించాడు .పెద్ద కేటో యుద్ధాలు లేనప్పుడు హాయిగా వ్యవసాయం చేసుకొనేవాడు .లూయిస్ వేలేరియస్ ఫ్లాక్కస్ ఈతని ద్ధైర్యసాహసాలు ,విద్యా విజ్నాన పతిమ గ్రహించి రొమ్ కు ఆహ్వానించి అత్యుత్తమ మిలిటరీ అవార్డ్ ప్రదానం చేశాడు 

  ఒక స్పార్టన్ రాజు ”స్పార్టాన్ల    అలవాట్లనుంచి ఏమి గ్రహించావు అని అడిగితే 

–”freedom is what we reap from this way of life”అని ఖంగు తినే సమాధానం చెప్పాడు .అతడు దిండ్లు కానీ రగ్గులుకాని వాడేవాడుకాదు ఇతర సైనికులు  లాగా నేలమీదే పడుకొనేవాడు .

  ప్రఖ్యాత చిత్రకారుడు శిల్పి మైకెలా0జలో,కీటోలాగా సింపుల్ గా ఉండక పోయినా ,ధనికులు రాజులు ప్రీస్ట్ లనుంచి ఖరీదైన విలువైన బహుమతుల్ని స్వీకరించే వాడు కాదు .ఎవ్వరివద్దా అప్పు చేయలేదు ఎవరికీ బాకీ లేడు..నిజమైన సంపద స్వయం ప్రతిపత్తి -అటానమీ అనే వాడు   .కేటో,మైకెలాంజీలో ల లాగా జీవించటం కస్టమే ,కానీ అది చాలా తేలికే . 

”I would die without my luxury item ,we will say in jest .’అన్నారు అలాంటివారు .మనిషిగా ఎక్కువగా ఉంటే ,అతడికి కోరికలు తక్కువగా ఉంటాయి ”అని మాక్ష్వెల్ పెర్కిన్స్ సూక్తి .అనవసరమైన వాటిని పోగు చేసుకోవాలి అనుకొంటే ,మన  స్వేచ్ఛతగ్గిపోతుంది . మనం ఇతరులపై ఆధారపడటం పెరిగిపోతుంది .”The less you desire ,the richer you aare ,the free you aare ,the more powerful you are ”-it is that simpl

ఆధారం – రియాన్ హాలిడే రచన -డిసిప్లిన్ ఈజ్ డేష్టిని 

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-12-22-కాంప్ -మల్లాపూర్ -హైదారాబా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.