అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు
అయిదవ ప్రపపంచ తెలుగు రచయితల మహా సభలు కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో ,ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ),తానా ప్రపంచ సాహిత్య వేదిక ,సిలికానాంధ్ర ,విజయవాడ సిద్ధార్ధ అకాడెమి సహకారంతో 23-12-22శుక్రవారం ,24-12-22శనివారం పివి సిద్ధార్ధ ఆడి టోరియం ,సిద్దార్ధనగర్ –మొగల్రాజపురం లో’’మారుతున్న దేశ ,కాలమాన పరిస్థితులలో రచయితలపాత్ర ,కర్తవ్యమ్ ,కార్యాచరణ ‘’లక్ష్యాలుగా జరిగాయి .సభలు జరిగిన ప్రాంగణానికి ‘’రాజరాజ నరేంద్ర సభా ప్రాంగణం ‘’అని ఆరాజు పట్టాభిషేక సహస్రాబ్దం కారణ౦ గానామకరణం చేశారు .ఈ ప్రాంగణం లో 1-ఆదికవి నన్నయ్య వేదిక 2-శ్రీ నందమూరి తారక రామారావు వేదిక 3-శ్రీ పివి నరసింహారావు వేదికలపై కార్యక్రమాలను నిర్వహించారు .రామారావు నరసింహారావు ల శతాబ్ది కూడా ఉండటం వలన ఆ పేర్లు పెట్టారు
https://www.youtube.com/post/UgkxEZ_SRomdAQuKi4J57–vI9Qli6KmJKsR
మొదటి రోజు ఉదయం 10గం .లకు ఖచ్చితంగా ప్రారంభ సభ నన్నయ వేదికపై భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రారంభించారు ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ సభాధ్యక్షత వహించారు .ఆత్మీయ అతిధులుగా ఆచార్య కొలకలూరి ఇనాక్ ,ఫ్రాన్స్ తెలుగు ఆచార్యులు డేనియల్ నేగార్స్,తానా అధ్యక్షులు శ్రీ లావు అంజయ్య చౌదరి తానా ప్రపంచ సాహిత్యవేదిక అధ్యక్షులు శ్రీ తోటకూర ప్రసాద్ ,సిలికానాంధ్ర అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ ,సిద్ధార్ధ అకాడెమి అధ్యక్షులు డా చదలవాడ నాగేశ్వరరావు ,సింగపూర్ కు చెందిన శ్రీమతి మంగిపూడి రాధికా బోట్సు వానకు చెందిన డా.శ్రీవల్లి శ్రీకాంత్ వేదిక పై ఆశీనులుకాగా ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ సుబ్బారావు స్వాగత వచనాలు పలుకగా ,ప్రధాన కార్య దర్శి డా .జివి పూర్ణ చాంద్ లక్ష్య ప్రస్తావన చేశారు .కోటిమాటలకోట,రాజరాజ నరేంద్ర గ్రంథా విష్కరణ జరిగాయి .
https://www.youtube.com/post/Ugkx-0ELYs3bzFW8rPBBFVuFHPeHvRN_fdeH
ఉదయం 11-30కి ‘’అంతర్జాలం లో తెలుగు ‘’,సాయంత్రం 1-30కుశ్రీ మోదుమూడి ప్రభాకర్ చే వాగ్గేయకార వైభవం ,సాయంత్రం 2కు కుదురాటఅద్భుతావధానం డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ఆధ్వర్యం లో ,శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ ,తాతా సందీప శర్మ ,ఉప్పలధడియం భరత శర్మ గన్నవరం లలితాదిత్య ,నల్లాన్ చక్రవర్తుల సాహితి యువ అవధానులచేత అవధానం జరిగింది ,సా 4కు తెలుగు వెలుగుల సభ లోసుప్రీం కోర్ట్ మాజీ సిజె జస్టిస్ నూతులపాటి వెంకటరమణ ,ముఖ్యఅతిదికాగా డా గరికపాటి నరసింహారావు కీలక ప్రసంగం చేశారు ఆత్మీయ అతిధులుగా శ్రీ అన్నవరపు రామస్వామి ,శ్రీమతి దండమూడి సుమతీ రామమోహనరావు ,శ్రీ భువన చంద్ర ,శ్రీస్వర వీణా పాణి పాల్గొన్నారు , మహాసభల ప్రచురణ ‘’గమ్యం –గమనం’’,ను శ్రీ పువ్వాడ శివరామ విట్టల్ ,వేణుగోపాల్ సమర్పించగా ఆవిష్కరణ జరిగింది .శ్రీ పెద్ది సాంబశివరావు కూర్చిన ఇంగ్లీష్ –తెలుగు నిఘంటువు ఆవిష్కరణ అరిగింది .సాయంత్రం 6గం లకు –మహాసభల విజయానికి కారకులైన సాహితీబందువులకు అంటే 10వేలరూపాయలు,ఆపైన విరాళాలు ఇచ్చిన వదాన్యులకు శాలువాకప్పి జ్ఞాపిక అందించారు .నేనూ ఆ సన్మానం పొందిన వారిలో ఉన్నాను .రాత్రి 8గం లకు కుమారి నేక్షిత భరతనాట్య ప్రదర్శన జరిగింది .ముఖ్య అతిధి శ్రీ గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఔత్సాహిక గజల్స్ గాయనీ గాయకులూ గానం చేశారు
https://www.youtube.com/post/Ugkx-0ELYs3bzFW8rPBBFVuFHPeHvRN_fdeH
24-12-22శనివారం రెండవ రోజు ‘’రచయితల పాత్ర ‘’పై సదస్సు ఉదయం 9గం లకు శ్రీ విహారి అధ్యక్షతన శ్రీ వివి లక్ష్మీ నారాయణ ముఖ్యఅతిధిగా ‘’ జరిగింది .హాస్యబ్రహ్మ శంకనారాయణ,డా నాగులపల్లి భాస్కరరావు ,ఆచార్య పరిమి రామ నరసింహం ,శ్రీ వి లక్ష్మారెడ్డి ,ఎబి వెంకటేశ్వరరావు ,వేలిమళ్ళ జగన్నాథ్ ,నీలం దయానందరాజు ఆత్మీయ అతిధులుగా ,సింహప్రసాద్ .రాజ్యశ్రీ ,పెద్దింటి అశోక్ కుమార్ ,గంధం సుబ్బారావు మొదలైన వారు వక్తలు .మధ్యాహ్నం 11గం లకు విదేశీ ప్రతినిధుల సదస్సు తోటకూర ప్రసాద్ అధ్యక్షత న జరిగింది .అమెరికా ఆష్ట్రేలియా దుబాయి కి చెందిన ప్రతినిధులు పాల్గొని చర్చించారు .మధ్యాహ్నం 12-30కు మహిళా సదస్సు కు డా తుర్లపాటి రాజేశ్వరి ఆధ్వర్యం లో జరిగింది .కర్నూలు హైదరాబాద్ ,మచిలీ పట్నం మొదలైన చోట్లనుంచి వచ్చిన వారు ప్రసంగించారు .మధ్యాహ్నం 2-30కు రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు పివిపిసి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది అహ్మదాబాద్ భువనేశ్వర్ ముంబై ,బెంగళూర్ హోసూర్ బళ్ళారి ప్రతినిధులు పాల్గొన్నారు .సాయంత్రం 4గం లకు భాషోద్యమ సదస్సు గుత్తికొండ ఆధ్వర్యం లో జరిగింది .సాయంత్రం 5-30కి ఆముక్తమాల్యద నృత్య రూపకం ను కెవివి సత్యనారాయణ ప్రదర్శించారు సాయంత్రం 6-౩౦ కి సమాపన సభ జరిగి సభలు సమాప్తమయ్యాయి .
https://www.youtube.com/post/UgkxeBk_XSNVPynl9m-pv_3b3J7Z1zWnx8du
నందమూరి తారక రామారావు వేదిక
23-12-22 శుక్రవారం మధ్యాహ్నం 12గం లకు వంశీ రామరాజు ఆధ్వర్యం లో ‘’సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సు జరిగింది .యువభారతి అధ్యక్షులు ఆచార్య ఫణీంద్ర నవ్యాన్ధ్రరచయితల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ ,రఘుశ్రీ లు ఆత్మీయ అతిధులు పాల్గొన్న సంస్థల అధ్యక్షులుగా సరసభారతి కి చెందిన నేను ,ఆంద్ర సారస్వత సమితికి చెందిన శ్రీ కొట్టి రామారావు వగైరాలున్నారు .సాయ్నత్రం 2-30కి పత్రికాప్రతినిదుల సదస్సు శిఖామణి ఆధ్వర్యం లో జరిగింది చలపాక ప్రకాష్ ,శ్రీమతి స్వాతి మొదలైన వారున్నారు .సాయంత్రం 6గం లకు ఉపాధ్యాయులు –భాషా పరిరక్షణ సదస్సు లలితానంద ప్రసాద్ ఆధ్వర్యం లో జరిగింది డా వై శ్రీలత ,శ్రీహరికోటి అక్షరం ప్రభాక ర్ వగైరాలు పాల్గొన్నారు సాయంత్రం 7-30కి తెలుగు బోధనా సదస్సు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఆచార్య మన్నవ సత్యనారాయణ ,కానుకొల్లు బాలకృష్ణ మొదలైన వారు మాట్లాడారు .
https://www.youtube.com/post/UgkxaNxKHMgcpjFhQrWfEYp0vlDLOhjU-cV-
24-12-శనివారం –ఉదయం 9కి సాంస్కృతిక రంగ ప్రతినిధుల సదస్సు అక్కిరాజు సుందర రామ కృష్ణ అధ్యక్షతన జరిగింది .అప్పుడే పూర్ణచంద్ ,శ్రీ యాబలూరి లోకనాథ శర్మగార్లచేత 99 ఏళ్ళ డా .రాచకొండ నరసింహ శర్మగారు ఎం డి .రచించిన ‘’అనువాద కవితల సంపుటి –వెన్నెలలో నడుచుచున్న ఆమె ‘’ఆవిష్కరణ నేను దగ్గరుండి శర్మగారి కోరికపై జరిపించాను .కిందటి సభల్లోనూ ఒక పుస్తకం ఇలాగే ఆవిష్కరింప చేయించాము .శ్రీ గౌరినాయుడు శర్మగారి ప్రతినిధిగా విశాఖ నుంచి వచ్చారు .ఇందులో వడ్డేపల్లి కృష్ణ డా సప్పా దుర్గాప్రసాద్ ,అత్తలూరి విజయలక్ష్మి స్వతంత్రభారతి రమేష్ టివి మొదలైన వారు పాల్గొన్నారు .ఉదయం 11గం లకు చరిత్ర రంగ ప్రతినిధుల సదస్సు ఆచార్య శివనాగిరెడ్డి ఆధ్వర్యం లో జరిగింది. కొప్పర్తి వెంకటరమణ మూర్తి మహమ్మద్ సిలార్ ,మున్నగువారున్నారు .మధ్యాహ్నం 12కు వైజ్ఞానిక రంగ ప్రతినిధుల సదస్సు జంపా కృష్ణ కిషోర్ ఆధ్వర్యం లో జరిగింది .ముఖ్య అతిధి కొండా మోహన్ మధ్యాహ్నం 1గం కు –విమర్శనారంగ ప్రతినిధుల సదస్సు డా తిరుమల ఆముక్తమాల్యద అధ్యక్షతన ,డా రేవూరు అనంత పద్మనాభరావు గారు ముఖ్యాతిధిగా జరిగింది సంగనభాట్లనరసయ్య కొండ్రెడ్డి వెంకటేశ్వరేద్ది రొక్కం కామేశ్వరావు వేలువోలు నాగరాజ లక్ష్మి ,తాటికోలు పద్మావతి వగైరా పాల్గొన్నారు .మధ్యాహ్నం 2-30కి డా రావి రంగారావు ఆధ్యక్షతన తెలుగు కవిత సదస్సు జరిగింది ప్రముఖులు పాల్గొన్నారు .సాయంత్రం 4కు శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ డా రాధశ్రీ ,హాస్యబ్రహ్మ మొదలైన వారు పాల్గొన్నారు .
శ్రీ పివి నరసింహారావు వేదిక
23-12-22-శుక్రవారం –మధ్యాహ్నం 12గం లకు ప్రతినిధుల కవి సమ్మేళనం .సాయంత్రం 6కు రసరాజు అధ్యక్షతన ప్రత్యెక కవి సమ్మేళనం, రాధేయ వడ్డేపల్లి మందరపు హైమవతి మాధవే సనార సుమనజానుకవి శిఖా ఆకాష్ వసుధ మొదలైన వారు పాల్గొన్నారు .రాత్రి 8కి యువకవి సమ్మేళనం –ఆలేఖ్య స్నిగ్ధమాధవి మోకా మాధవరావు శ్రావణి మొదలైన వారు కవితలు చదివారు .
24-12-22-శనివారం –ఉదయం 9కు మహిళాప్రతినిదుల కవి సమ్మేళనం ,ఉదయం 12కు ప్రత్యెక కవి సమ్మేళనం ,సాయంత్రం 3కు ప్రతినిధుల కవిసమ్మేళనం .జరిగాయి ఇక్కడ మైకులు లైట్లు పని చేయక ఇబ్బంది పడినట్లు చెప్పుకొన్నారు .
అన్ని సభలలో పాల్గొనటం కష్టం కనుక నేను చూసిన సభలగురించి ,ఆంధ్రజ్యోతి కవరేజ్ ఆధారంగా మిగిలినవాటి గురించి తర్వాత వ్యాసం లో తెలియ జేస్తాను .
సశేషం
రేపు 2023నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -31-12-22-ఉయ్యూరు