అలనాటి అజ్ఞాత ప్రపంచ వాణిజ్య కుబేరులు -7
7-రిచర్డ్ హెచ్ .గ్రాంట్
హెన్రి ఫోర్డ్ ను కింగ్ ఆఫ్ మోటార్స్ అంటారు .ఆయనతో పాటు దీటుగా ‘’చెవ్రోలెట్ ‘’కార్లను ఉత్పత్తి చేసి ,,ఫోర్డ్ కూడా తన చేవ్రోలేట్ మోడల్‌గా ఫోర్డ్ కారు ను మార్చుకోనేట్లు చేసిన మోటార్ సుప్రీం రిచర్డ్ .హెచ్. గ్రాంట్ .ఫోర్డ్ కార్లకంటే చేవ్రోలేట్ కార్లు అధికధరకు అమ్ముడయ్యేవి .దీనికి ముఖ్యకారకుడు చేవ్రోలేట్ మోటార్ కార్ సేల్స్ మేనేజర్ అయిన రిచర్డ్ హెచ్ .గ్రాంట్.ఫోర్డ్ కార్లు,ట్రక్కుల కంటే అత్యధికమైన నాణ్యతతో కస్టమర్ సాటిస్ఫాక్షన్ సాధించాడు .
1920లో చేవ్రోలేట్ కంపెని సేల్స్ మేనేజర్ అయ్యాడు గ్రాంట్ .నాలుగేళ్ళలో చేవ్రోలేట్ కార్ల అమ్మకాన్ని అయిదు రెట్లు పెంచగలిగాడు .1924లో రెండున్నర లక్షల కార్లు అమ్మితే ,1928కి 12లక్షల 25వేలకార్లు అమ్మాడు ..ప్రపంచం మొత్తం మీద ఇంతటి సేల్స్ మగాడు లేనేలేడు.అతడి ప్రతిభ అమెరికాలో తెలిసినట్లు యూరప్ ఆసియాలలో తెలియలేదు .అతడు స్కాటిష్ జాతికి చెందిన అమెరికన్ .తలిదండ్రులు ధనవంతులు .హార్వర్డ్ గ్రాడ్యుయేట్ .మొదట్లో మూడేళ్ళు ఒక టెలిఫోన్ కంపెనీ సేల్స్ మేనేజర్‌గా ఉన్నాడు .తర్వాత నేషనల్ కాష్ రిజిష్ట్రర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు .తొమ్మిదేళ్ళలో అ కంపెని సేల్స్ మేనేజర్ అయ్యాడు .తర్వాత జనరల్ మోటార్స్ కు చెందిన డేల్కొలైట్ కంపెనీలో వ్యవసాయదారులకు దీపపు సామగ్రి అమ్మే పనిలో కుదిరాడు ఇది చాలాకష్టమైన పనే .అలాంటి కంపెనీలు అప్పుడు 50ఉన్నాయి .ఆ కంపెనీ లన్నీ కలిసి ఏడాదికి 10వేల లైటింగ్ ప్లాంట్ లకంటే ఎక్కువ అమ్మలేక పోయాయి.అప్పుడు అతడి వయసు 30.దీక్షగా పని చేసి డెల్కోలైట్ లైటింగ్ ప్లాంట్ లను ఏడాదికి 25వేలు విడుదల చేయించి అమ్మి౦చగలిగాడు .
ప్రతి అమ్మక స్థలానికి స్వయంగా వెళ్ళేవాడు .అ సామగ్రి అవసరం చక్కగా వివరించేవాడు .రైతులను ఉత్సాహపరచి కోనేట్లు చేయగలిగాడు .అందుకే యాభై కంపెనీలు ఏడాదికి పది వేల లైట్లను అమ్మగలిగితే ,తన ఒక్క కంపెనీ యే ఏడాదికి 25వేలు అమ్మేట్లు చేయగలిగిన బుద్ధి శాలి గ్రాంట్ .ఇదొక ట్రేడ్ గారడీ అన్నారు .తర్వాత ఎలెక్ట్రిక్ రిఫ్రిజి రేటర్ల కంపెనీలో చేరి ,అక్కడా తన ప్రతిభ సామర్ధ్యాలు చూపి అత్యదికంగారిఫ్రిజి రేటర్లను అమ్మించాడు .కార్ల దిగ్గజం హెన్రి ఫోర్డ్ కు కూడా చుక్కలు చూపించాడు గ్రాంట్ .ఇతడి ప్రతిభను గుర్తించి ఫోర్డ్ కార్లను చేవ్రోలేట్ కార్లు మించి పోవాలని చేవ్రోలేట్ కంపెనీ గ్రాంట్ ను ఆహ్వానించి సేల్స్ మేనేజర్ ను చేసింది.
చేవ్రోలేట్ కంపెని లో చేరిన మొదటి ఏడాదే ఆకార్ల అమ్మకాన్ని రెట్టింపు చేయగలిగాడు గ్రాంట్ .మరో రెండేళ్లలో మళ్ళీ రెట్టింపు అమ్మకాలు సాధించాడు .1929కి 12.50శాతం అభి వృద్ధి చూపించాడు .ఆఏడు 12లక్షల 25వేల కార్లను రికార్డ్ స్థాయిలో అమ్మగలిగాడు గ్రాంట్ .గ్రాండ్ సేల్స్ మేనేజర్ గ్రాంట్ అని పించాడు .ఈ అమ్మకం బ్రిటన్ లోని మొత్తం కార్ల సంఖ్య కంటే చాలా ఎక్కువ .ఇంతకీ గ్రాంట్ వ్యాపార విజయ రహస్యం ఏమిటి?’’ప్రదర్శన –ప్రకటన ‘’.మాత్రమె .అమ్మకాలలో మర్యాద పాటించటం మూడవది .కస్టమర్ శాటిస్ఫాక్షన్ పైనే ఎక్కువ దృష్టిపెట్టాడు .ఒక వ్యాపారి పరిధిలోకి రెండవ వ్యాపారి చొరబడకూడదు అనే నియమాన్ని ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేసి అభి వృద్ది సాధించాడు .వ్యాపారులను తన భాగస్వాములుగా నే చూసేవాడు .వాళ్ళ హక్కులు పరిరక్షించాడు .కంపెని జమాఖర్చులు నిర్దుష్టంగా ఉండేట్లు చేసేవాడు .పాతకార్లు అమ్మటానికి అమితంగా సాయం చేసేవాడు .ఇవన్నీ విజయానికిసోపానాలయ్యాయి .అమ్మగలిగిన వాటికంటే ఎక్కువ కార్లు తీసుకోమని బలవంతంగా నెత్తిన రుద్దేవాడు కాదు .
గ్రాంట్ యాజమాన్యంలో చేవ్రోలేట్ కంపెనీకి 4,500 మంది డీలర్స్ ,5,500మంది అసిస్టెంట్ డీలర్స్ ఉండేవారు .వారందరితో మంచి స్నేహం నేరిపెవాడు .వారిని విశ్వాసం లోకి తీసుకొనేవాడు .ప్రతినెలావారినుండి నివేదికలు తెప్పించుకొని పరిశీలించేవాడు ,తనవద్ద పని చేస్తున్న 50మంది సేల్స్ మెన్ ను సూపర్ వైజర్స్ గా పంపుతూ ,డీలర్లకు ,తనకు చక్కని సాన్నిహిత్యం రాపోర్ట్ ఉండేట్లు చూసుకొనేవాడు .కార్లపై మంచి విజ్ఞానం కలిగించటానికి ఫిలిం లు కరపత్రాలు ,పోస్టర్లు కార్డ్ లు పుస్తకాలు తయారు చేయించి అందజేయి౦చేవాడు .వ్యాపారం నీరసిచకుండా ఎప్పటికప్పుడు ఉత్సాహ పరచేవాడు .మంచి వ్యాపారం చేసిన వారిని గుర్తించి అభిన౦దింది౦ చేవాడు .తగిన పారితోషికాలు అందజేసేవాడు .’’అమ్మకానికి ఉత్సాహం ఉండాలి ‘’అనే సూత్రాన్ని తానుపాటించి ,అందరి చేతా పాటింప జేసేవాడు.
1878లో అమెరికాలోని మాసా చూసేట్స్ రాష్ట్రం ఇప్స్ విచ్ లో పుట్టాడు .హార్వర్డ్ లో చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు .పొట్టివాడు కనుక గట్టి వాడు .జనరల్ మోటార్స్ లో చేరి డేల్కో లైట్ కంపెని సేల్స్ మాన్ అయ్యాడు .ఫోర్డ్ ను మించిపోవాలని చేవ్రోలేట్ కంపెనీ ఇతడిని ఆహ్వానించి సేల్స్ మేనేజర్ చేసింది .అప్పుడు He lead Chevy past Ford in 1927, but that year is sort of an asterisk,” Grant said. “Ford was switching to the Model A, but Chevy still beat them handily in 1928 and then for the next few years, the two companies traded the No. 1 spot back and forth.”
అని చెప్పి తన సామర్ధ్యాన్ని నిరూపించాడు .1929లో జనరల్ మోటార్స్ అతడిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్ చేయగా ,ఆటో మోటివ్ మార్కెట్ లో అన్ని కంపెనీలను అధిగమించేట్లు చేసి 26 బిలియన్ డాలర్ల టర్నోవర్ చూపించాడు .తన డీలర్లను ఉత్తేజపరుస్తూ గ్రాంట్ – He was also known for his many quotes, often called “Grantisms.” About his team, he said, “A salesman, like the storage battery in your car, is constantly discharging energy. Unless he is recharged at frequent intervals he soon runs dry. This is one of my greatest responsibilities of sales leadership.
అని చెప్పేవాడు .1944లో చేవ్రోలేట్ లో రిటైర్ అయ్యాడు .కానే 1950దాకా అందులో సభ్యుడుగా ఉన్నాడు .రేనాల్డ్స్ కంపెనీతో కూడా సన్నిహితంగా ఉండేవాడు .ఇతనికొడుకు జూనియర్ గ్రాంట్ ఆకంపేని ప్రెసిడెంట్ అయ్యాడు .పబ్లిక్ పార్క్ కోసం గ్రాంట్ కుటుంబం 45ఎకరాల మంచి స్థలాన్ని దానం చేసింది .నార్మండిలో కొడుకు డైరీ ఫారం స్థాపించాడు .సీనియర్ గ్రాంట్ 1957లో చనిపోయాడు .1920-30కాలం లో ‘’అమెరికా నంబర్ వన్ సేల్స్ మాన్ ‘’గాప్రభుత్వం గుర్తి౦చి,గౌరవించింది .
ఆధారం –ఆంద్ర భూమి సంపాదకులు శ్రీఆండ్ర శేషగిరి రావు రాసిన ‘’వాణిజ్య పూజ్యులు ‘’పుస్తకం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-23-ఉయ్యూరు